STOCKS

News


మూడో విడత ఉడాన్ రూట్ల వేలం

Tuesday 6th November 2018
news_main1541481318.png-21745

ముంబై: చిన్న పట్టణాలకు చౌక విమాన సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన ఉడాన్ స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం మూడో విడతలో రూట్ల వేలానికి బిడ్లను ఆహ్వానించింది. ప్రాథమిక బిడ్లను డిసెంబర్ 10లోగా ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)కు సమర్పించాల్సి ఉంటుంది. రూట్లను దక్కించుకున్న ఎయిర్‌లైన్స్ పేర్లను జనవరి 7 లోగా ప్రకటించడం జరుగుతుంది. వేలంలో పాల్గొనాలని భావిస్తున్న బిడ్డర్ల కోసం నవంబర్ 6న ప్రి-బిడ్ సమావేశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆర్‌సీఎస్‌ పోర్టల్‌లో ఉంచారు. ప్రధానంగా పర్యాటక ఆకర్షణ ఉండే ప్రాంతాలపై ఈ విడతలో దృష్టి సారిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ సంయుక్త కార్యదర్శి ఉషా పధీ తెలిపారు. 2016 మార్చిలో ప్రకటించిన ఉడాన్ స్కీమును ఏఏఐ అమలు చేస్తోంది. పెద్ద సంఖ్యలో రూట్లను వేలం వేసినా, ఇప్పటికీ ఆశించినంత స్థాయిలో కనీసం సగం రూట్లలో కూడా  సర్వీసులు అందుబాటులోకి రాలేదని విమర్శలు ఉన్నాయి. ఈ స్కీము కింద గంట ప్రయాణ దూరాలకు గరిష్టంగా రూ. 2,500 చార్జీ ఉంటుంది.



You may be interested

జేవీల్లో వాటా విక్రయిస్తాం; ఆంధ్రా బ్యాంక్‌

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ:  వివిధ జాయింట్‌ వెంచర్లలో ఉన్న  వాటాలను పూర్తిగా కానీ, పాక్షికంగా గానీ విక్రయించనున్నామని  ఆంధ్రా బ్యాంక్‌ తెలిపింది. ఈ మేరకు ఇటీవల జరిగిన తమ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదం తెలిపిందని పేర్కొంది. ఆస్‌రెక్‌ ఇండియా, ఇండియా ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌(మలేషియా) బెర్హాద్‌, ఇండియా ఫస్ట్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌.. జేవీల్లో వాటాలను విక్రయిస్తామని వివరించింది. 

ఏఎఫ్‌పీతో ఫేస్‌బుక్ జట్టు

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టే దిశగా, వాస్తవాల ధృవీకరణ కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా భారత్‌లో ఏజెన్సీ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ)తో జట్టు కట్టింది. ఎన్నికల వేళ తమ ప్లాట్‌ఫాంపై వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఫేస్‌బుక్‌ న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ (భారత విభాగం) మనీష్ ఖండూరి తెలిపారు. ఇప్పటికే ఇంగ్లీష్, బెంగాలీలో కంటెంట్‌ పరిశీలన కోసం బూమ్ సంస్థతో భాగస్వామ్యం ఉందని

Most from this category