STOCKS

News


ద్రవ్యలోటు భయాలు

Saturday 1st December 2018
news_main1543644163.png-22549

న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యలోటు భయాలు నెలకొన్నాయి. 2018-19 సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంత ఉండాలని కేం‍ద్ర బడ్జెట్‌ నిర్దేశించుకుందో, ఆ స్థాయిని ఇప్పటికే దాటిపోవడం దీని నేపథ్యం. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2018-19లో (ఏప్రిల్‌-మార్చి) ద్రవ్యలోటు రూ.6.24 లక్షల కోట్లుగా ఉండాని కేంద్ర బడ్జెట్‌ నిర్దేశించింది. అయితే ఇది అక్టోబర్‌ నాటికే నాటికే 6.48 లక్షల కోట్లకు పెరిగిపోయింది. అంటే బడ్జెట్‌ అంచనాల్లో 103.9 శాతం. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో ఈ లోటు బడ్జెట్‌ లక్ష్యంకన్నా దిగువగానే 96.1 శాతంగా ఉంది. కేంద్రానికి ఆదాయాలు తగ్గిపోవడం దీనికి ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సగటున నెలకు లక్ష కోట్ల జీఎస్‌టీ వసూళ్లు జరగాలన్నది కేం‍ద్రం లక్ష్యం. అయితే ఒక్క ఏప్రిల్‌, అక్టోబర్‌ మినహా ఏ నెలలోనూ లక్ష కోట్లు వసూలు కాలేదు. ఇదే పరిస్థితి కొనసాగితే, వృద్ధికి సంబంధించి ప్రభుత్వ వ్యయాలు తగిపోయే అవకాశాలు ఉన్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు.  
లక్ష్య సాధనపై కేంద్రం విశ్వాసం...
అయితే ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే సరికి ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించగలమన్న విశ్వాసాన్ని కేంద్రం వ్యక్తం చేస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో ద్రవ్యలోటు 3.3 శాతానికి మించకూడదన్న లక్ష్యం ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని మించవచ్చన్న ఆందోళనలు ఉన్నాయి. గత ఏడాది జీడీపీలో ద్రవ్యలోటు 3.53 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ‍కేంద్ర బడ్జెట్‌ రెవెన్యూ లక్ష్యం రూ.17.25 లక్షల కోట్లు. అయితే అక్టోబర్‌ వరకూ రూ.7.88 లక్షల కోట్ల రెవెన్యూ వసూళ్లు జరిగాయి. బడ్జెట్‌ లక్ష్యంలో ఇది 45.7 శాతం. వ్యయాలు రూ.14.56 లక్షల కోట్లుగా ఉంది. ఇది బడ్జెట్‌ లక్ష్యంలో 59.6 శాతం.
 



You may be interested

వృద్ధి వేగం తగ్గింది...

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌) మందగించింది. 7.1 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు త్రైమాసికాల్లో ఇంత తక్కువ వృద్ధి రేటు ఇదే తొలిసారి. రెండవ త్రైమాసిక కాలంలో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, క్రూడ్‌ ధరల తీవ్రత వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయని ఎస్‌బీఐ రిసెర్చ్‌ ఇక్రా వంటి పలు ఆర్థిక సంస్థలు

రూపాయికి నాలుగు నెలలనాటి బలం

Saturday 1st December 2018

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరీ కొనసాగుతోంది. శుక్రవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఒకేరోజు 27పైసలు లాభపడి 69.58 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టం నుంచి దాదాపు 30 డాలర్లు పతనం కావడం రూపాయి వేగవంతమైన రికవరీకి దారితీస్తోంది. దీంతోపాటు దేశంలోకి తాజా విదేశీ మూలధన నిధుల రాక కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. సెప్టెంబర్‌, అక్టోబర్‌ నెలల్లో 5 బిలియన్‌ డాలర్లు వెనక్కు

Most from this category