STOCKS

News


భారత్‌లో గూగుల్ 'షాపింగ్‌'

Friday 14th December 2018
news_main1544763693.png-22920

న్యూఢిల్లీ: రిటైలర్లు అందించే ఆఫర్లు, వివిధ ఉత్పత్తుల రేట్లను పోల్చి చూసుకునేందుకు ఉపయోగపడే 'షాపింగ్‌' ఫీచర్‌ను టెక్ దిగ్గజం గూగుల్ భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘గూగుల్ షాపింగ్’ హోమ్‌ పేజీలో కొంగొత్త ట్రెండింగ్ ఉత్పత్తులు, డీల్స్‌ మొదలైనవి ఉంటాయని సంస్థ వివరించింది. దేశీయంగా 40 కోట్ల మంది పైగా ఇంటర్నెట్ యూజర్లు ఉన్నప్పటికీ.. వీరిలో మూడింట ఒక వంతు యూజర్లు మాత్రమే ఆన్‌లైన్ షాపింగ్ చేస్తున్నారని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ (ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ విభాగం) సురజిత్ చటర్జీ తెలిపారు. కొత్తగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి దగ్గర్నుంచి తరచూ కొనుగోళ్లు చేసే వారిదాకా అన్ని వర్గాల వారికీ ఉపయోగపడేలా 'షాపింగ్‌' ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఇటు రిటైలర్లు అటు కొనుగోలుదారులకు మధ్య వారధిలా ఇది ఉంటుందన్నారు. గూగుల్ షాపింగ్‌లో తమ ఉత్పత్తులను లిస్టింగ్ చేసేందుకు రిటైలర్లు ప్రత్యేకంగా రుసుములేమీ చెల్లించనక్కర్లేదని ఆయన పేర్కొన్నారు. 



You may be interested

వారం కనిష్టానికి పసిడి

Friday 14th December 2018

ప్రపంచమార్కెట్లో పసిడి ధర శుక్రవారం వారం కనిష్టస్థాయి వద్ద కదలాడుతోంది. ఆసియాలో ఉదయం గం.10:00లకు ఔన్స్‌ పసిడి ధర 1డాలరు స్వల్ప నష్టంతో 1246.40డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది.గత రాత్రి అమెరికా మార్కెట్లో డాలర్‌ బలపడటంతో అక్కడి మార్కెట్లో పసిడి ధర వారం రోజుల కనిష్టానికి తగ్గింది. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ వచ్చే ఏడాదికాలానికి వృద్ధిరేటును, ద్రవ్యోల్బణ అంచనాలకు తగ్గించడంతో యూరో బలహీనపడింది. ఇది డాలర్‌ బలపడటానికి కారణమైంది. ‘‘ఈసీబీ అధ్యక్షుడు

ముకేశ్ అంబానీ రిటైల్ జోరు..

Friday 14th December 2018

జ్యుయలరీ నుంచి మొదలుపెడితే దుస్తులు, ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలు, పాదరక్షలు, నిత్యాసవర సరుకులు... ఇలా అన్నింటికీ వేరువేరు ఆఫ్‌లైన్‌ స్టోర్లు నిర్వహిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌... ఈ బలాన్ని ఆన్‌లైన్‌కు ఉపయోగించుకోవటానికి సన్నాహాలు చేస్తోంది. వీటన్నిటినీ ఆన్‌లైన్‌లోకి తేవటానికి తన మరో ప్రధాన ఆయుధమైన రిలయన్స్‌ జియోను ఎంచుకుంటోంది. ఇంటింటికీ జియో ద్వారా ఇంటర్నెట్‌ అందిస్తున్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌... దాని ద్వారానే ఆన్‌లైన్‌ వ్యాపారం వృద్ధి చెందుతుందని భావిస్తోంది. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల

Most from this category