News


గూగుల్ మ్యాప్స్‌లో ఆటో రిక్షా రూట్లు

Tuesday 18th December 2018
news_main1545109543.png-23026

న్యూఢిల్లీ: టెక్నాలజీ దిగ్గజం గూగుల్ తాజాగా తమ మ్యాప్స్ యాప్‌లో ఆటో రిక్షా రూట్లను కూడా పొందుపర్చింది. ఏయే ప్రాంతాలకు ఆటోల్లో ప్రయాణించేందుకు ఎంతెంత చార్జీలవుతాయన్నది ఇది ఉజ్జాయింపుగా చూపిస్తుంది. ఆయా రూట్లలో ఆటో చార్జీలపై ప్రయాణికులు ఒక అంచనాకు వచ్చేందుకు ఈ ఫీచర్ తోడ్పడగలదని గూగుల్ మ్యాప్స్ ప్రోడక్ట్ మేనేజర్ విశాల్ దత్తా తెలిపారు. దీన్ని సోమవారం నుంచి ముందుగా ఢిల్లీలో అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారాయన. ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్‌ విభాగం నుంచి సేకరించిన చార్జీల పట్టిక ఆధారంగా మ్యాప్స్ యాప్‌లో చార్జీలను పొందుపర్చినట్లు పేర్కొన్నారు. ‘‘ఎక్కువగా వినియోగించే ప్రజా రవాణా సాధనాలను మ్యాప్స్‌లో అందుబాటులో ఉంచాలన్నది మా ఉద్దేశం. చాలా మందికి తాము వెళ్లే ప్రదేశం ఎంత దూరంలో ఉంది, మెరుగైన రూట్ ఏది, ఏయే రవాణా సాధనంలో చార్జీలు ఎంతెంత అవుతాయన్నది అంతగా తెలియదు. ఇలాంటి వారికి ఆటో, బస్సు లేదా మెట్రో మొదలైన వాటిల్లో దేని ద్వారా త్వరితగతిన, తక్కువ చార్జీలతో గమ్యస్థానాలకు చేరుకోవచ్చో తెలుసుకునేందుకు ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది’’ అని దత్తా వివరించారు. 

గూగుల్ కొత్త క్యాంపస్‌.. న్యూయార్క్ సిటీలో దాదాపు బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో కొత్త క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ వెల్లడించింది. గూగుల్ హడ్సన్‌ స్క్వేర్‌గా వ్యవహరించే ఈ క్యాంపస్‌ 2020 నాటికి అందుబాటులోకి రాగలదని, ఆ తరువాతి పదేళ్లలో న్యూయార్క్‌ సిటీలోని తమ ఉద్యోగుల సంఖ్య రెట్టింపై 14,000కు చేరగలదని వివరించింది. ప్రస్తుతం న్యూయార్క్‌లో కంపెనీకి సుమారు 7,000 మంది ఉద్యోగులు ఉన్నారు. అమెజాన్‌, యాపిల్‌ వంటి టెక్ దిగ్గజాలు నిపుణులను ఆకర్షించే క్రమంలో అమెరికాలోని ఇతర ప్రాంతాల్లో భారీగా కార్యకలాపాలు విస్తరిస్తున్న నేపథ్యంలో తాజాగా కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేసే ఆల్ఫాబెట్ కూడా అదే బాట పట్టడం గమనార్హం. You may be interested

బైజూస్‌కు 540 మిలియన్‌ డాలర్ల నిధులు

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: ఎడ్యుకేషన్‌ స్టార్టప్‌ బైజూస్‌ తాజాగా 540 (రూ.3,888 కోట్లు) మిలియన్‌ డాలర్ల నిధులను సమీకరించింది. దీంతో సంస్థ వ్యాల్యూషన్‌ 3.6 బిలియన్‌ డాలర్లతో (రూ.25,920 కోట్లు), దేశంలో నాలుగో అతిపెద్ద స్టార్టప్‌గా నిలిచింది. పేటీఎం, ఓలా, ఓయో రూమ్స్‌ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. నాస్పర్స్‌, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డు (సీపీపీఐబీ), జనరల్‌ అట్లాంటిక్‌ తాజా నిధుల సమీకరణ కార్యక్రమంలో పాల్గొని బైజూస్‌లో పెట్టుబడులు పెట్టాయి.

ఎల్‌ఐసీ-ఐడీబీఐ డీల్‌పై పిటిషన్‌ తిరస్కృతి

Tuesday 18th December 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐలో (ఇండస్ట్రియల్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా) 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ (లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) చేస్తున్న ప్రయత్నాల్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు సోమవారం కొట్టేసింది. ఆల్‌ ఇండియా ఐడీబీఐ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను జస్టిస్‌ విభూ భక్రూ తిరస్కరించారు. షేర్‌హోల్డింగ్‌లో మార్పు వల్ల ఐడీబీఐకు ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంక్‌ హోదా పోతుందని బ్యాంక్‌ ఆఫీసర్స్‌

Most from this category