STOCKS

News


ఈ ఏడాది బంగారం, వెండిలో ర్యాలీ: కార్వీ

Wednesday 6th February 2019
news_main1549477262.png-24055

ఈ ఏడాది బంగారం, వెండి ర్యాలీ చేస్తాయని కార్వీ గ్రూపులో భాగమైన కార్వీ కన్సల్టెంట్స్‌ అంచనా వేసింది. ఇన్వె‍స్టర్లు తమ పెట్టుబడి నిర్ణయాలపై అవగాహన కల్పించేందుకు ఈ సంస్థ తన 11వ వార్షిక కమోడిటీ అండ్‌ కరెన్సీ రిపోర్ట్‌ 2019ను విడుదల చేసింది. 2017లో బేస్‌ మెటల్స్‌ మంచి ర్యాలీ చేయగా, 2018లో మాత్రం ఈ ట్రెండ్‌ కొనసాగని విషయం తెలిసిందే. దేశీయ రూపాయి విలువ క్షీణించడం మరింత సమస్యాత్మకంగా మారింది. అయితే, ఈ ఏడాది కమోడిటీ మార్కెట్లలో మిశ్రమ ధోరణి ఉంటుందని కార్వీ కన్సల్టెంట్స్‌ అంచనా. 2019లో ఫెడ్‌ నుంచి రెండు సార్లు వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని, ఇది బంగారంలో పెట్టుబడులు పెరిగేందుకు దారితీస్తుందని తన నివేదికలో పేర్కొంది.


 
‘‘అంతర్జాతీయంగా ఆర్థిక అనిశ్చితులు ఉన్నందున, సురక్షిత సాధనాల కొనుగోలుకు మొగ్గు చూపడం వల్ల 2019లో బంగారం, వెండి మంచి పనితీరు చూపించే అవకాశం ఉంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలను మాత్రం సరఫరా, డిమాండ్‌, వాతావరణం, కనీస మద్దతు ధరలు, కొనుగోళ్లు, టారిఫ్‌లు, లెవీలు వంటి ప్రభుత్వ విధానాలు నిర్ణయించనున్నాయి. దేశీయ పరిస్థితులే రానున్న సంవత్సరంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల ధరలను శాసించనున్నాయి. ఈ అంశాల నేపథ్యంలో... అమెరికా-చైనా వాణిజ్య ఉద్రిక్తతల ప్రభావం ధరల పరంగా మూడో పరిణామం’’ అని కార్వీ స్టాక్‌ బ్రోకింగ్‌ కమోడిటీస్‌, కరెన్సీస్‌ సీఈవో రమేష్‌ వరకేద్కర్‌ తెలిపారు.
 
అంచనాలు...

  • 2019లో చమురు ధరలు రోలర్‌కోస్టర్‌ రైడ్‌ మాదిరిగా ఉండొచ్చు. ఒకవైపు ఓపెక్‌, రష్యా ఉత్పత్తికి కోత విధిస్తే, మరోవైపు అమెరికా ఉత్పత్తిని పెంచుతోంది. 
  • డిమాండ్‌ తగ్గడంతో కాపర్‌ ధరలు బలహీనంగా ట్రేడ్‌ కావచ్చు. 
  • అల్యూమినియం కొన్ని నెలల పాటు ప్రతికూలంగా ఉండొచ్చు. రష్యాలో దిగ్గజ అల్యూమినియం కంపెనీ రూసల్‌ సరఫరా పెంచడమే కారణం.
  • సరఫరా పరిస్థితులు కఠినంగా మారడం, ఎగుమతులకు డిమాండ్‌ బలంగా ఉండడంతో కాటన్‌ ధరలు ఈ ఏడాది బలంగా ఉండొచ్చు. 
  • సాగు పెరగడంతో ఈ ఏడాది ద్వితీయార్థంలో సోయాబీన్‌కు అమ్మకాల ఒత్తిడి ఉంటుంది.
  • జీలకర్ర, గోరుచిక్కుడు ట్రెండ్‌ మొత్తం మీద పాజిటివ్‌గా ఉంటుంది. You may be interested

రానున్న దశాబ్దంలో ఎన్నో అవకాశాలు: దమానీ

Wednesday 6th February 2019

భారత మార్కెట్ల విషయంలో ప్రముఖ ఇన్వెస్టర్‌ రమేష్‌ దమానీ బుల్లిష్‌ ధోరణి వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేనన్ని పెట్టుబడుల అవకాశాలను భారత ఆర్థిక వ్యవస్థ వచ్చే పదేళ్ల కాలంలో కల్పిస్తుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 25-30 ఏళ్ల కాలంలో దేశీయ ఈక్విటీ మార్కెట్లు ఎన్నో రెట్లు పెరిగిన విషయాన్ని ప్రస్తావించారు. దమాని 1989లో స్టాక్‌ మార్కెట్లోకి ప్రవేశించినప్పుడు సెన్సెక్స్‌ 800గా ఉంటే, అదిప్పుడు 36,000 మార్క్‌పైన

క్రెడిట్‌ కార్డు ఇలా వాడితే.. పరపతి పెరిగినట్టే!

Wednesday 6th February 2019

క్లిష్ట సమయాల్లోనూ ఖర్చు చేసేందుకు ఉపయోగపడే ఆధారం క్రెడిట్‌ కార్డు. క్రెడిట్‌ కార్డుతో కొనుగోళ్లపై ఇటీవలి కాలంలో వివిధ సంస్థలు ఎక్కువ డిస్కౌంట్లు కూడా ఇస్తున్న సందర్భాలను చూస్తున్నాం. అయితే, క్రెడిట్‌ కార్డు అంటే మనసులో ఆందోళన పెట్టుకోకుండా, తమ క్రెడిట్‌ స్కోరు పెంచుకునేందుకు ఇదొక మంచి సాధనంగా చూడొచ్చు. ట్రాన్స్‌యూనియన్‌ సిబిల్‌ 2018 మూడో త్రైమాసికం నివేదిక ప్రకారం... బ్యంకు కార్డుల యాక్సెస్‌ పొందుతున్న వారి శాతం జీవిత

Most from this category