STOCKS

News


ధంతేరాస్‌లో మెరిసిన పసిడి

Tuesday 6th November 2018
news_main1541481129.png-21743

న్యూఢిల్లీ: పసిడి కొనుగోళ్లకు శుభప్రదమైన రోజుగా భావించే ధంతేరాస్‌లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. ధరలు భారీగా ఉండడం, దీనికితోడు వ్యవస్థలో నగదు లభ్యత (లిక్విడిటీ) సమస్యలు ఉండడంతో ధంతేరాస్‌నాడు అమ్మకాలు అంతంతమాత్రంగానే ఉండచ్చని అంచనాలు వెలువడ్డాయి. అయితే ఇందుకు భిన్నమైన పరిస్థితి ఏర్పడింది. పండుగల సీజన్‌ కొనసాగుతుందన్నందు, వచ్చే వారాల్లో పసిడి, ఆభరణాల కొనుగోళ్లు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనావేస్తున్నారు. ఆభరణాలకన్నా, నాణేలకు అధికంగా డిమాండ్‌ ఉందని వారు తెలిపారు. 

రూపాయి బలహీనత బలంగా...
రూపాయి బలహీనత వల్ల వచ్చే వారాల్లో పసిడి 10 గ్రామలుకు రూ.35,000 నుంచి రూ. 40,000 వరకూ పెరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఈ వార్తలు పసిడి డిమాండ్‌ను పునరుద్ధరించాయి. గత ఏడాదితో పోల్చితే అమ్మకాలు 10 శాతం అధికంగా ఉంటాయని బావిస్తున్నాం
- నితిన్‌ ఖండేల్‌వాల్‌, ఏఐజీజేడీసీ చైర్మన్‌



You may be interested

ఏఎఫ్‌పీతో ఫేస్‌బుక్ జట్టు

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: తప్పుడు వార్తల వ్యాప్తిని అరికట్టే దిశగా, వాస్తవాల ధృవీకరణ కోసం సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్ తాజాగా భారత్‌లో ఏజెన్సీ ఫ్రాన్స్‌ ప్రెస్‌ (ఏఎఫ్‌పీ)తో జట్టు కట్టింది. ఎన్నికల వేళ తమ ప్లాట్‌ఫాంపై వదంతుల వ్యాప్తిని అరికట్టేందుకు ఈ ఒప్పందం తోడ్పడగలదని ఫేస్‌బుక్‌ న్యూస్ పార్ట్‌నర్‌షిప్ హెడ్ (భారత విభాగం) మనీష్ ఖండూరి తెలిపారు. ఇప్పటికే ఇంగ్లీష్, బెంగాలీలో కంటెంట్‌ పరిశీలన కోసం బూమ్ సంస్థతో భాగస్వామ్యం ఉందని

పవర్‌​‍గ్రిడ్‌ నికర లాభం రూ.2,309 కోట్లు

Tuesday 6th November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ విద్యుత్‌ పంపిణీ సంస్థ, పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ నికర లాభం (స్డాండ్‌అలోన్‌) ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 8 శాతం ఎగసింది. గత క్యూ2లో రూ.2,141 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 2,309 కోట్లకు పెరిగిందని పవర్‌ గ్రిడ్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.7,493 కోట్ల నుంచి రూ.8,690 కోట్లకు ఎగసింది. పవర్ ట్రాన్సిమిషన్‌ విభాగం ఆదాయం రూ.5,771 కోట్ల నుంచి రూ.7,104

Most from this category