STOCKS

News


4 శాతం పెరిగిన పసిడి దిగుమతులు

Saturday 20th October 2018
news_main1540010185.png-21307

న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు ప్రస్తుత  ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో  (ఏప్రిల్‌-సెప్టెంబర్) 4 శాతం పెరిగాయి. విలువ రూపంలో 17.63 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. 2017 ఇదే కాలంలో ఈ విలువ 16.96 బిలియన్‌ డాలర్లు. వాణిజ్యశాఖ ఈ మేరకు తాజా గణాంకాలను విడుదల చేసింది.వార్షికంగా భారత్‌ 800 నుంచి 900 టన్నుల పసిడిని దిగుమతి చేసుకుంటోంది. ఆభరణాల పరిశ్రమ డిమాండ్‌ దీనికి నేపథ్యం. పసిడి దిగుమతులు తగ్గించడానికి కేంద్రం పలు చర్యలు తీసుకుంటోంది. 
కా‍్యడ్‌పై ఆందోళన..
భారత్‌ ప్రధానంగా దిగుమతి చేసుకునే రెండు కమోడిటీల్లో ఒకటి క్రూడ్‌ కాగా, రెండవది పసిడి. అయితే క్రూడ్‌ దిగుమతి తప్పనిసరి. అప్రధానమైన పసిడి దిగుమతులు పెరగడం ఇప్పుడు ఆర్థికవేత్తలను ఆందోళనకు గురిచేస్తోంది. ఈ పరిస్థితులు వాణిజ్యలోటు, కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌)పై ప్రభావం చూపుతాయన్నది వారి ఆందోళనలకు కారణం. ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసమే వాణిజ్యలోటు. ఇక దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిల్వల మధ్య నికర వ్యత్యాసమే కరెంట్‌ అకౌంట్‌లోటు. దేశంపై ఇది రుణ భారం పెంపునకు, తద్వారా దేశీయ మారకపు విలువ కోతకు దారితీస్తుంది. 2018-19 ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య వాణిజ్యలోటు 76.66 బిలియన్‌ డాలర్ల నుంచి 94.32 బిలియన్‌ డాలర్లకు పెరిగిన సంగతి తెలిసిందే. ఇక ‍క్యాడ్‌ 2018-19 మొదటి త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)తో పోల్చితే 2.4 శాతంగా నమోదయ్యింది. 



You may be interested

చైనా ఉక్కు దిగుమతులపై ఆంక్షలు

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: దేశీ ఉక్కు పరిశ్రమను ఆదుకోవడంలో భాగంగా పలు రకాల చైనా దిగుమతులపై ప్రభుత్వం యాంటీ డంపింగ్‌ డ్యూటీని విధించింది. టన్ను ఉక్కుపై 185.51 డాలర్లు (రూ.13,622) చొప్పున డ్యూటీని విధిస్తున్నట్లు ప్రకటించిన రెవిన్యూ శాఖ, ఐదేళ్ల వరకు ఈ సుంకం కొనసాగుతుందని పేర్కొంది. ఉత్పత్తి వ్యయం కంటే తక్కువ ధరకు చైనా భారత్‌లో ఉక్కును విక్రయిస్తుందని ఆరోపిస్తూ.. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, సన్‌ఫ్లాగ్‌ ఐరన్ అండ్‌ స్టీల్, ఉషా మార్టిన్,

ప్రాంతీయ విమానాల్లో డేటా సేవలు..!

Saturday 20th October 2018

న్యూఢిల్లీ: దేశ సరిహద్దులలోని నౌకలు, విమానాలలో డేటా సేవలను అనుమతించే దిశగా ప్రభుత్వం యోచిస్తోంది. ప్రతిపాదిత ఇన్‌-ప్లైట్‌ కనెక్టివిటీ మార్గదర్శకాల ఆధారంగా ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని.. వాయిస్‌, డేటా అనుమతిని పరిగణనలోకి తీసుకుంటున్నామని టెలికాం శాఖ తెలియజేసింది. దేశ సరిహద్దుల అవతల వినియోగానికి సంబంధించి పలు సమస్యలు ఉన్నందున సేవలు సరిహద్దులకు లోబడే ఉండనున్నట్లు వెల్లడించింది. ఈ అంశంపై తుది నిర్ణయాన్ని వెలువరించే ముందుగా మార్పుల నిమిత్తం

Most from this category