STOCKS

News


రూ.1,331కే గోఎయిర్‌ టికెట్‌...

Wednesday 7th November 2018
news_main1541576052.png-21766

న్యూఢిల్లీ:- బడ్జెట్‌ విమానయాన సంస్థ గోఎయిర్‌ రూ.1,313(అన్నీ కలుపుకొని) ధరకే విమాన టికెట్‌ను ఆఫర్‌ చేస్తోంది. ఈ డిస్కౌంట్‌లో భాగంగా మొత్తం 13 లక్షల సీట్లను ఆఫర్‌ చేస్తున్నామని గోఎయిర్‌ తెలిపింది. ఈ టికెట్లకు బుకింగ్స్‌ ఈ నెల 5 నుంచే ఆరం‍భమయ్యాయని, ఈ నెల 18 వరకూ టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని గోఎయిర్‌ సీఈఓ కార్నిలిస్‌ వీస్‌జివిక్‌ పేర్కొన్నారు. ఇలా బుక్‌ చేసుకున్న టికెట్లతో  వచ్చే ఏడాది నవంబర్‌ 4 వరకూ ప్రయాణించవచ్చని వివరించారు. తాము నిర్వహించే అన్ని రూట్లలో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని, మొదట వచ్చిన వారికి మొదట ప్రాతిపదికన టికెట్లను కేటాయిస్తామని తెలిపారు. 2005, నవంబర్‌లో కార్యకలాపాలు ప్రారంభించామని, విమాన సర్వీస్‌లను ఆరంభించి 13 సంవత్సరాలైన సందర్భంగా 13 లక్షల సీట్లను ఈ ఆఫర్‌లో అందిస్తున్నామని వివరించారు. ఈ రూ.1,313 ఆఫర్‌ టికెట్లను గోఎయిర్‌ వెబ్‌సైట్‌, గో ఎయిర్‌టికెటింగ్‌కౌంటర్లు, గోఎయిర్‌ కాల్‌సెంటర్‌, ట్రావెల్‌ ఏజెంట్ల ద్వారా పొందవచ్చని పేర్కొన్నారు.  వాడియా గ్రూప్‌నకు చెందిన ఈ కంపెనీ 23 దేశీయ మార్గాల్లో, రెండు అంతర్జాతీయ మార్గాల్లో విమాన సర్వీస్‌లను నిర్వహిస్తోంది.



You may be interested

తక్షణం రూ.1.2 లక్షల కోట్లు కావాలి

Wednesday 7th November 2018

 ప్రభుత్వ రంగ బ్యాంకుల మూలధన అవసరాలపై క్రిసిల్ నివేదిక ముంబై: అంతర్జాతీయ బ్యాంకింగ్‌ ప్రమాణాలను పాటించే క్రమంలో ప్రభుత్వ రంగ బ్యాంకులకు (పీఎస్‌బీ) రాబోయే అయిదు నెలల్లో రూ. 1.2 లక్షల కోట్ల మేర మూలధనం అవసరమవుతుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో పేర్కొంది. పీఎస్‌బీలు బలహీన మార్కెట్ వేల్యుయేషన్స్‌, మొండిబాకీలతో కుదేలైన నేపథ్యంలో ఇందులో సింహభాగం భారం ప్రభుత్వమే మోయాల్సి ఉంటుందని తెలిపింది. అయితే, ఒకవేళ ప్రభుత్వం ఈ

వచ్చే ఏడాదీ వడ్డీరేట్లు పైపైకే

Wednesday 7th November 2018

- భారత్‌పై మూడీస్‌ అంచనా... - కఠిన ద్రవ్య విధానాల - బాటనే కొనసాగుతుందని విశ్లేషణ న్యూఢిల్లీ: భారత్‌లో వచ్చే ఏడాదీ వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ ఏజెన్సీ మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీసెస్‌ మంగళవారం పేర్కొంది. దేశం 2019లో వృద్ధి బాటనే పయనించినా,  ఆర్థికంగా కొంత క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనక తప్పదని విశ్లేషించింది.  కఠిన  ఆర్థిక ద్రవ్య విధానాల బాటన దేశం కొనసాగుతుందని పేర్కొన్న మూడీస్‌, రాజకీయ ఇబ్బదులు, ఆర్థిక, ద్రవ్య సంస్కరణలపై అనిశ్చితి

Most from this category