STOCKS

News


బడ్జెట్‌ కన్నా ఎన్నికలే కీలకం

Thursday 31st January 2019
news_main1548923628.png-23928

జేఎం ఫైనాన్షియల్‌
శుక్రవారం ప్రవేశపెట్టే మధ్యంతర బడ్జెట్‌ కన్నా రాబోయే సాధారణ ఎన్నికలే మార్కెట్‌కు కీలకమని జేఎం ఫైనాన్షియల్స్‌ ప్రతినిధి సుహాస్‌ హరినారాయణ్‌ అభిప్రాయపడ్డారు. మధ్యంతర బడ్జెట్లో ప్రభుత్వానికి పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉంటాయన్నారు. గత బడ్జెట్లో చెప్పిన ఎంఎస్‌పీ ఫార్ములాను ప్రభుత్వం సమర్ధవంతంగా అమలు చేయలేకపోయిందని, ఈ ప్రభావం గతేడాది జరిగిన రాష్ట్రాల ఎన్నికల్లో కనిపించిందని తెలిపారు. అందువల్ల ఈ బడ్జెట్లో ఎక్కువమందిని ఆకర్షించే చర్యలకే ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చే ఛాన్సులున్నాయన్నారు. అలాగని భారీ మార్పులు, పథకాలు ఉండకపోవచ్చని, ఓటాన్‌ అకౌంట్‌ కన్నా కొంత విస్తృతంగా ఉండొచ్చని చెప్పారు. రైతులకు ప్యాకేజీ, ప్రత్యక్ష పన్నుల్లో వెసులుబాటు వంటి చర్యలుంటాయని అంచనా వేశారు.

ఈ దఫా విత్తలోటు పెరిగేందుకు అవకాశాలున్నాయన్నారు. జీఎస్‌టీతో ఆశించినంత ఆదాయాలు సమకూరకపోవడం, టెలికం స్పెక్ట్రం వేలంలో అనుకున్నంత సొమ్ము రాకపోవడం, సబ్సిడీల వ్యయం ఎక్కువ కావడం, పెట్టుబడుల ఉపసంహరణ అనుకున్నంతగా జరగకపోవడంతో లోటు పెరగవచ్చని చెప్పారు. ఈ దఫా బడ్జెట్లో విత్తలోటు టార్గెట్‌ను 20 బీపీఎస్‌ మేర ప్రభుత్వం అందుకోలేకపోవచ్చన్నారు. అయితే ఈ ప్రభావాన్ని మార్కెట్లు ఇప్పటికే జీర్ణించుకోవడం మొదలు పెట్టాయని తెలిపారు. ఒకవేళ ప్రభుత్వ పన్ను ఆదాయాలు అనూహ్యంగా పెరగడం, ఆర్‌బీఐ మూలధన సాయం అందించడం లాంటివి చేస్తే మాత్రం లోటు అనుకున్న లక్ష్యంలోపే ఉండొచ్చని తెలిపారు. 
ఎన్నికల సందర్భంగా ప్రైవేట్‌ బ్యాంకులు, ఎంపికచేసిన ఐటీ కంపెనీలు, ఇండస్ట్రియల్స్‌, రియల్టీ రంగాలపై ఓవర్‌వెయిట్‌గా ఉన్నామని వెల్లడించారు. You may be interested

డీహెచ్‌ఎఫ్‌ఎల్ గ్రూప్‌లో ఫండ్స్‌ పెట్టుబడులు రూ. 8,650 కోట్లు

Thursday 31st January 2019

తీవ్ర ఆందోళనలో మ్యూచువల్‌ ఫండ్స్‌ నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ రంగానికి చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టిన పలు మ్యూచువల్‌ ఫండ్స్‌ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు ఆందోళన చెందుతున్నాయి. గతేడాది చివర్లో ఐల్‌ఎల్‌అండ్‌ఎఫ్‌సీ సంక్షోభంలో దెబ్బతిన్న ఫండ్స్‌...ఈ ఏడాది ప్రారంభం‍లోనే డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ గ్రూప్‌ మీద రూ.31వేల కోట్ల నిధుల అక్రమ మళ్లింపు ఆరోపణలు రావడంతో ఈ అసెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు తీవ్ర ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోంటున్నాయి.  డిసెంబర్‌ త్రైమాసికం నాటికి పలు 22  మ్యూచువల్‌ ఫండ్లు

ఐటీ షేర్ల ర్యాలీ..ఇన్ఫోసిస్‌ 3 శాతం జంప్‌

Thursday 31st January 2019

అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌....వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్‌ వేసిన ప్రయోజనాన్ని అత్యధికంగా ఐటీ షేర్లు అందిపుచ్చుకున్నాయి. గురువారం ఎన్‌ఎస్‌ఈలోని ఐటీ ఇండెక్స్‌...ఇతర రంగాల సూచీలకంటే అధికంగా 1.5 శాతం పెరిగింది. ఈ సూచీలో భాగమైన ఇన్ఫోసిస్‌ టెక్నాలజీస్‌ 3 శాతంపైగా లాభపడి నెలల గరిష్టస్థాయి రూ. 750 వద్దకు చేరింది. మరో హెవీవెయిట్‌ ఐటీ షేరు టీసీఎస్‌ 1.3 శాతం జంప్‌ చేసింది. టెక్‌ మహింద్రా 2.7

Most from this category