STOCKS

News


వేతనాల్లో మహిళలకు అన్యాయమే

Friday 8th March 2019
news_main1552024372.png-24486

- పురుషులతో పోలిస్తే 19 శాతం తక్కువ
- మాన్‌స్టర్ శాలరీ సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: అన్ని రంగాల్లోనూ మహిళల ప్రాతినిధ్యం పెరుగుతున్నప్పటికీ.. వేతనాల విషయం వచ్చేసరికి మాత్రం పురుషుల ఆధిక్యతే కొనసాగుతోంది. భారత్‌లో పురుషుల, మహిళల వేతనాల మధ్య వ్యత్యాసం భారీగా ఉంటోంది. పురుషులతో పోలిస్తే మహిళల వేతనాలు 19 శాతం తక్కువగా ఉంటున్నాయి. కన్సల్టెన్సీ సంస్థ మాన్‌స్టర్‌ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. పురుషులు, మహిళల వేతనాల వ్యత్యాసాలకు కొలమానమైన మాన్‌స్టర్‌ శాలరీ సూచీ (ఎంఎస్‌ఐ) 19 శాతంగా ఉన్నట్లు సంస్థ తెలిపింది. మహిళలతో పోలిస్తే పురుషులు సగటున రూ. 46.19 ఎక్కువ వేతనం అందుకుంటున్నట్లు పేర్కొంది. 2018 గణాంకాల ప్రకారం పురుషులకు గంటకు సగటు వేతనం రూ. 242.49గా ఉండగా, మహిళలకు కేవలం రూ. 196.3గా నమోదైంది. ఈ వ్యత్యాసాలు అన్ని రంగాల్లోనూ ఉన్నాయి. అత్యధికంగా ఐటీ/ఐటీఈఎస్‌లో ఈ వ్యత్యాసం 26 శాతం మేర పురుషులకు అనుకూలంగా ఉండగా, తయారీ రంగంలో 24 శాతంగా ఉంది. సాధారణంగా మహిళల ప్రాతినిధ్యం ఎక్కువగా కనిపించే హెల్త్‌కేర్‌, సామాజిక సేవ వంటి రంగాల్లో కూడా వారికన్నా పురుషులకే ఎక్కువగా (21 శాతం అధికం) వేతనాలు ఉంటున్నాయని మాన్‌స్టర్‌ సర్వేలో పేర్కొంది. ఆర్థిక సేవలు, బ్యాంకింగ్, బీమా (బీఎఫ్‌ఎస్‌ఐ)లో మాత్రమే ఈ వ్యత్యాసం కాస్త తక్కువగా 2 శాతం స్థాయిలో ఉంది. పేచెక్‌డాట్‌ఇన్‌, ఐఐఎం అహ్మదాబాద్‌ సహకారంతో మాన్‌స్టర్ ఇండియా ఈ సూచీ నిర్వహిస్తోంది.

అనుభవాన్ని బట్టి పెరిగే వ్యత్యాసాలు...
ఎన్నాళ్ల అనుభవం ఉంటే అంత ఎక్కువగా పురుషులు, మహిళల వేతనాల మధ్య తేడా ఉంటోంది. తొలినాళ్లలో వ్యత్యాసం ఒక మోస్తరు స్థాయిలోనే ఉన్నప్పటికీ.. ఏళ్లు గడిచే కొద్దీ ఇది పెరుగుతోంది. ఉదాహరణకు 10 ఏళ్ల అనుభవం ఉన్న వారిని తీసుకుంటే మహిళల కన్నా పురుషుల వేతనాలు 15 శాతం ఎక్కువగా ఉంటున్నాయి. 2017లో 20 శాతంగా ఉన్న వ్యత్యాసం గతేడాది స్వల్పంగా ఒక్క శాతం మాత్రమే తగ్గింది. స్త్రీ, పురుషుల వేతనాల మధ్య అసమానతలను తొలగించేందుకు మరిన్ని చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని ఇది సూచిస్తోందని మాన్‌స్టర్‌డాట్‌కామ్‌ సీఈవో (ఏపీఏసీ, గల్ఫ్‌ విభాగం) అభిజిత్ ముఖర్జీ చెప్పారు. కార్పొరేట్ ప్రపంచంలో మహిళల స్థితిగతులపై మాన్‌స్టర్‌డాట్‌కామ్‌ నిర్వహించిన మరో సర్వే ప్రకారం.. పనిచేసే సంస్థల్లో తమ పట్ల వివక్ష ఉంటోందని దాదాపు 60 శాతం ఉద్యోగినులు భావిస్తున్నట్లు తేలింది.You may be interested

ఫోక్స్‌వ్యాగన్‌పై రూ.500 కోట్ల జరిమానా

Friday 8th March 2019

న్యూఢిల్లీ: పర్యావరణానికి హాని కలిగించినందుకు జర్మనీ వాహన దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్‌కు జాతీయ హరిత ట్రిబ్యునల్‌ (ఎన్‌జీటీ) రూ.500 కోట్ల జరిమానా వడ్డించింది. ఫోక్స్‌వ్యాగన్‌ కంపెనీ తన డీజిల్‌ కార్లలో చీట్‌ డివైస్‌ను ఉపయోగించడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించిందని ఎన్‌జీటీ పేర్కొంది. పర్యావరణ పరీక్షలను తప్పుదోవ పట్టించే సాఫ్ట్‌వేర్‌ను ఫోక్స్‌వ్యాగన్‌ తన కార్లలో వినియోగించిందని, ఈ కార్ల అమ్మకాలను భారత్‌లో నిషేధించాలంటూ ఐలావాడి అనే స్కూల్‌ టీచర్‌, మరికొందరు ఫిర్యాదు

తొలిసారిగా రూ. 20 నాణేలు

Friday 8th March 2019

రూ. 1, 2, 5, 10 కాయిన్స్‌లో కొత్త సిరీస్‌ న్యూఢిల్లీ: కేంద్రం తొలిసారిగా రూ.20 నాణేలను ఆవిష్కరించింది. 12 కోణాల బహుభుజ ఆకృతిలో ఉండే ఈ నాణెంపై.. ధాన్యపుగింజలు ముద్రించి ఉంటాయి. దేశీయంగా వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా దీన్ని డిజైన్ చేసినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో తెలిపారు. దీనితో పాటు రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10

Most from this category