STOCKS

News


చివరి త్రైమాసికంలో జీడీపీ పుంజుకుంటుంది: నీతి ఆయోగ్‌

Wednesday 5th December 2018
news_main1543985985.png-22653

గువహటి: దేశ జీడీపీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో (జనవరి-మార్చి) వేగంగా పుంజుకుంటుందని నీతి ఆయోగ్‌ అంచనా వేసింది. దీంతో 2018-19 సంవత్సరానికి వేసిన అంచనాలను జీడీపీ వృద్ధి రేటు చేరుతుందని నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ తెలిపారు. సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు మొదటి త్రైమాసికంలో నమోదైన 8.2 శాతం నుంచి 7.1 శాతానికి తగ్గిన విషయం తెలిసిందే. గత త్రైమాసికంలో నమోదైన స్థాయిలోనే జీడీపీ వృద్ధి మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌-డిసెంబర్‌)లోనూ ఉండొచ్చన్న అభిప్రాయాన్ని రాజీవ్‌కుమార్‌ వ్యక్తపరిచారు. ‘‘నీతి ఆయోగ్‌ తన సొంత అంచనాలను ఇంకా రూపొందించలేదు. అయితే, ఆర్‌బీఐ పేర్కొన్న 7.4-7.5 శాతం మధ్య జీడీపీ వృద్ధి ఉండొచ్చని భావిస్తున్నాను’’ అని రాజీవ్‌కుమార్‌ చెప్పారు. రేటింగ్‌ సంస్థ క్రిసిల్‌ సైతం 2018-19 సంవత్సరపు భారత జీడీపీ వృద్ధి అంచనాలను 7.5 శాతం నుంచి 7.4 శాతానికి తగ్గించిన విషయం గమనార్హం. 



You may be interested

దోమ కుట్టకుండా.. రూ.6వేల కోట్లు!!

Wednesday 5th December 2018

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: ఇళ్లలో దోమల నివారణకు ఏటా దేశవ్యాప్తంగా జనం పెడుతున్న ఖర్చెంతో తెలుసా? అక్షరాలా ఆరువేల కోట్ల రూపాయలు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. జనాన్ని దోమలు ఎంతలా భయపెడుతున్నాయో చెప్పటానికి ఈ అంకెలు చూస్తే చాలు. అయితే ఇదంతా ఇళ్లలో దోమల నివారణ ఉత్పత్తుల కోసం జనం చేస్తున్న ఖర్చు మాత్రమేనండోయ్‌!!. ఇక  కార్యాలయాలు, షాపులు, వాణిజ్య సముదాయాలు, వీధుల్లో ప్రభుత్వ సంస్థలు చేస్తున్న

చమురు మంట తగ్గినా... గృహోపకరణాలు చల్లారలేదు

Wednesday 5th December 2018

న్యూఢిల్లీ: చమురు ధరలు శాంతించాయి... డాలర్‌తో రూపాయి కొంచెం బలం పుంజుకుంది. అయినా, గృహోపకరణాల ధరలకు మాత్రం రెక్కలొచ్చాయి. బ్రెంట్‌ క్రూడ్‌ ఇటీవలి కాలంలో బ్యారెల్‌కు 80 డాలర్ల వరకు వెళ్లి తిరిగి 60 డాలర్ల లోపునకు పడిపోగా... డాలర్‌తో 74కు పైగా దిగజారిన రూపాయి తిరిగి 71 లోపునకు వచ్చేసింది. డాలర్‌ మారకంలో రూపాయి పతనం వల్ల ఎలక్ట్రానిక్స్‌, ఇతర గృహోపకరణాల తయారీ సంస్థలకు ఉత్పత్తి వ్యయాలు పెరిగిపోయాయి.

Most from this category