STOCKS

News


వృద్ధి వేగం తగ్గింది...

Saturday 1st December 2018
news_main1543644280.png-22550

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (జూలై, ఆగస్టు, సెప్టెంబర్‌) మందగించింది. 7.1 శాతంగా నమోదయ్యింది. గడచిన మూడు త్రైమాసికాల్లో ఇంత తక్కువ వృద్ధి రేటు ఇదే తొలిసారి. రెండవ త్రైమాసిక కాలంలో డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత, క్రూడ్‌ ధరల తీవ్రత వంటి అంశాలు వృద్ధి స్పీడ్‌ను తగ్గిస్తాయని ఎస్‌బీఐ రిసెర్చ్‌ ఇక్రా వంటి పలు ఆర్థిక సంస్థలు విశ్లేషించాయి. అందుకుతగినట్లుగానే తాజా ఫలితాలు వెలువడ్డాయి. అక్టోబర్‌- డిసెంబర్‌ త్రైమాసికంలో వృద్ధి రేటు 7 శాతం. ఆ తరువాత జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు 7.7 శాతం. ఏప్రిల్‌-జూన్‌ మధ్య ఇది 8.2 శాతంగా ఉంది. శుక్రవారం కేంద్రం తాజా గణాంకాలను విడుదల చేసింది.
7.1 శాతం వృద్ధి ఎలా అంటే...
2011- 2012 సంవత్సరం ప్రాతిపదికన (బేస్‌) కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్‌ఓ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికం వృద్ధి రేటు 6.3 శాతం. విలువల్లో చూస్తే, రూ.31.72 లక్షల కోట్లు. ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ త్రైమాసికంలో విలువ రూ.33.98 లక్షల కోట్లు. అంటే ఈ విలువ 7.1 శాతం పెరిగిందన్నమాట. కాగా జీవీఏ (గ్రాస్‌ వ్యాల్యూ యాడెడ్‌) ప్రకారం విలువ రూ.29.39 లక్షల కోట్ల నుంచి రూ.31.40 లక్షల కోట్లకు పెరిగింది. వృద్ధి రేటు ఇక్కడ 6.9 శాతమే. మొత్తం ఆర్థిక వ్యవస్థను జీడీపీ ప్రతిబింబిస్తే, రంగాల వారీగా దేశవ్యాప్త వినిమయ పరిస్థితులును జీవీఏ ప్రతిబింబిస్తుంది. 

కీలక విభాగాల్లో వృద్ధి ఇలా...
తయారీ: వృద్ది రేటు 7.1 శాతం నుంచి 7.4 శాతానికి పెరిగింది. 
నిర్మాణం: వృద్ధి రేటు 3.1 శాతం నుంచి 7.8 శాతానికి ఎగసింది. 
వ్యవసాయం: ఇక వ్యవసాయ రంగం 2.6 శాతం నుంచి 3.8 శాతానికి ఎగసింది. 
మైనింగ్‌ అండ్‌ క్వారీయింగ్‌: సెప్టెంబర్‌ త్రైమాసికంలో ఈ రంగం అసలు వృద్ధిలేకపోగా - 2.4 శాతం క్షీణత నమోదుచేసుకుంది. అయితే గత ఏడాది ఇదే కాలంలో ఈ రంగం 6.9 శాతం వృద్ధిరేటును నమోదుచేసుకుంది.  వర్షాకాల అడ్డంకుల ప్రభావం దీనిమీద పడిందని భావించవచ్చని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ట్వీట్‌ చేశారు. 
 జీఎఫ్‌సీఎఫ్‌: పెట్టుబడులకు సంబంధించి స్థూల స్థిర మూలధనం జీడీపీలో వార్షికంగా 1.3 శాతం పెరిగింది.
 ఎగుమతులు: రెండవ త్రైమాసికంలో ఎగుమతులు 13.4 శాతం ఎగశాయి
 ప్రభుత్వ వినియోగం: గణనీయంగా 12.7 శాతం పెరిగింది. 

ఏప్రిల్‌-సెప్టెంబర్‌లో 7.6 శాతం...
కాగా మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు కొంత సానుకూలంగా నమోదుకావడంతో ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంది. 
ప్రపంచంలో ‘వేగం’ మాత్రం మనమే!
మరోవంక, ప్రపంచవ్యాప్తంగా వృద్ధి రేటులో అగ్ర స్థానంలో మాత్రం భారత్‌ కొనసాగుతోంది.  జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో చైనా వృద్దిరేటు 6.5 శాతమే. దీనితో ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాను భారత్‌ కొనసాగిస్తున్నట్లు అయ్యింది. 

నిరాశ కలిగిస్తోంది: సుభాష్‌ చంద్ర గార్గ్‌
రెండవ త్రైమాసికంలో 7.1 శాతం వృద్ధి నిరాశ కలిగించిందని ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్‌ చంద్ర గార్గ్‌ ట్వీట్‌ చేశారు. అయితే మొత్తం ఆరు నెలలు కలుపుకుంటే వృద్ధిరేటు (7.6 శాతం) బాగున్నట్లేననీ ఆయన విశ్లేషించారు. ప్రపంచంలోనే ఇది వేగవంతమైన వృద్ధి రేటు అన్న విషయాన్ని గమనించాలన్నారు. 

సమంజసమే: ​ ఆర్థికశాఖ
ఈ గణాంకాలు సమంజసమేనని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది. అధిక క్రూడ్‌ ధరలు, బలహీన రూపాయి సవాళ్లు విసిరినప్పటికీ తగిన ఆమోదనీయమైన వృద్ధి రేటును దేశం సాధించిందని ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 



You may be interested

భారత ఇంధన అవసరాలకు మరింత సహకారం

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: భారత్‌ తన ఇంధన అవసరాలను అధిగమించేందుకు అవసరమైతే మరింతగా పెట్రోలియం ఉత్పత్తులను సరఫరా చేస్తామని సౌదీ రాజు మహమ్మద్‌ బిన్‌ సల్మాన్‌ బిన్‌ అబ్దుల్‌ అజీజ్‌ స్నేహ హస్తం ప్రకటించారు. ఈ మేరకు సౌదీ మీడియా కథనాలను ప్రచురించింది. అర్జెంటీనియా రాజధాని బ్యూనోస్‌ ఎయిర్స్‌లో జి-20 సదస్సు సందర్భంగా సల్మాన్‌ నివాసంలో ఇరు దేశాధినేతలు భేటీ అయ్యారు. రాజకీయ, భద్రత, ఆర్థికం, పెట్టుబడులు, వ్యవసాయం, ఇంధన, సాంస్కృతిక, టెక్నాలజీ

ద్రవ్యలోటు భయాలు

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: దేశంలో ద్రవ్యలోటు భయాలు నెలకొన్నాయి. 2018-19 సంవత్సరంలో ద్రవ్యలోటు ఎంత ఉండాలని కేం‍ద్ర బడ్జెట్‌ నిర్దేశించుకుందో, ఆ స్థాయిని ఇప్పటికే దాటిపోవడం దీని నేపథ్యం. ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలు మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు. 2018-19లో (ఏప్రిల్‌-మార్చి) ద్రవ్యలోటు రూ.6.24 లక్షల కోట్లుగా ఉండాని కేంద్ర బడ్జెట్‌ నిర్దేశించింది. అయితే ఇది అక్టోబర్‌ నాటికే నాటికే 6.48 లక్షల కోట్లకు పెరిగిపోయింది. అంటే బడ్జెట్‌

Most from this category