STOCKS

News


వృద్ధి రేట్లు పెరిగాయ్‌...

Friday 1st February 2019
news_main1549008689.png-23947

- 2016-17, 2017-18పై సవరణ గణాంకాలు
న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)కి సంబంధించి గడచిన రెండు ఆర్థిక సంవత్సరాల వృద్ధి రేట్లను కేంద్ర గణాంకాల శాఖ (సీఎస్‌ఓ) ఎగువ ముఖంగా సవరించింది. వీటిని క్లుప్తంగా చూస్తే...

- 2017-18లో వృద్ధి రేటు తొలి గణాంకాల ప్రకారం 6.7 శాతం. తాజాగా ఈ రేటును 7.2 శాతానికి సవరించడం జరిగింది. వ్యవసాయ రంగంలో పంట ఉత్పత్తులకు సంబంధించి తాజా గణాంకాల సానుకూలత దీనికి దోహదపడింది.
- 2016-17లో వృద్ధి రేటు 7.1 శాతం నుంచి 8.2 శాతానికి పెరిగింది.
- జీడీపీ విలువ ఈ కాలంలో (2011-12 స్థిర ధరల ప్రకారం) 122.98 లక్షల కోట్ల నుంచి 131.80 లక్షల కోట్లకు ఎగసింది.
- ఈ రెండు ఆర్థిక సంవత్సరాల్లో తలసరి ఆదాయం రూ.1,04,659 నుంచి రూ.1,14,958కి పెరిగింది.
- ఇదే కాలంలో పెట్టుబడుల కార్యకలాపాలకు సంబంధించి విలువ రూ.47.41 లక్షల కోట్ల నుంచి రూ. 55.27 లక్షల కోట్లకు ఎగసింది.  
- మేలో వెలువరించిన ముందస్తు అంచనాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతం. ఈ ఏడాది మే నెల చివర్లో వాస్తవ గణాంకాలు వెలువడతాయి. 2020లో సవరిత అంచనాలూ వస్తాయి.



You may be interested

రూ.లక్ష కోట్ల వసూళ్లతో జీఎస్‌టీ బోణి

Friday 1st February 2019

న్యూఢిల్లీ: వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు జనవరి నెలలో రూ.లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2019 జనవరి స్థూల వసూళ్లు అంచనాల మేరకు నమోదయ్యాయి. డిసెంబర్‌లో నెలలో ఉన్న రూ.94,725 కోట్లు, నవంబర్‌లో ఉన్న రూ.89,825 కోట్లతో పోలిస్తే గణనీయంగా పెరిగినట్టు ఆర్థిక శాఖ పేర్కొంది. ‘‘రైతులు, పేదలు, మధ్యతరగతికి ప్రయోజనం చేకూరే విధంగా జీఎస్‌టీ కౌన్సిల్‌ పలు

ఫిబ్రవరి 28న వ్యక్తిగతంగా హాజరవ్వండి

Friday 1st February 2019

సహారా చీఫ్‌కు సుప్రీం ఆదేశం న్యూఢిల్లీ: సహారా చీఫ్‌ సుబ్రతా రాయ్‌, ఇతర డైరెక్టర్లు ఫిబ్రవరి 28వ తేదీన అత్యున్నత న్యాయస్థానం- సుప్రీంకోర్టు ముందు హాజరుకానున్నారు. ఈ మేరకు గురువారం చీఫ్‌ జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. సహారాకు సంబంధించి రెండు అనుబంధ సంస్థలు- డిపాజిటర్ల నుంచి నిబంధలను వ్యతిరేకంగా నిధుల సమీకరణ, వీటి పునఃచెల్లింపుల్లో వైఫల్యం కేసు సుప్రీంకోర్టు ముందు ఉన్న సంగతి

Most from this category