STOCKS

News


ఎకానమీలో రికవరీ

Thursday 6th September 2018
news_main1536213472.png-20012

భారత ఆర్థిక వ్యవస్థపై ఎడెల్‌వీజ్‌ అంచనా
నాలుగు త్రైమాసికాలుగా భారత ఆర్థిక వ్యవస్థ పురోగతి పథాన పయనిస్తోందని ఆర్థిక సేవల దిగ్గజం ఎడెల్‌వీజ్‌ తెలిపింది. వృద్ధి వివిధరంగాల్లో విస్తరించిందని గణాంకాలు వివరిస్తున్నాయని వెల్లడించింది. జీఎస్‌టీ, నోట్లరద్దుతో ఏర్పడిన ఆటుపోట్లు తగ్గాయని తెలుస్తోందని పేర్కొంది. ప్రపంచ ఎకానమీతో పోలిస్తే భారత ఆర్థిక వ్యవస్థ మరింత ఆరోగ్యవంతమైన ప్రగతి సాధిస్తోందని తెలిపింది. వర్ధమాన మార్కెట్లలో భారత్‌ బాగుందని కొనియాడింది. కంపెనీ ఎర్నింగ్స్‌లో పురోగతి రావాల్సిఉందని తెలిపింది.
ఎకానమీపై ఎడెల్‌వీజ్‌ నివేదికలో ప్రధానాంశాలు...
- ప్రస్తుతం దేశీయ ఆర్థిక వ్యవస్థ పాత గాయాల నుంచి బయటపడ్డట్లు చెప్పవచ్చు. అయితే మరింత ముందుకు సాగాలంటే మాత్రం డిమాండ్‌ ఊపందుకోవడం తప్పనిసరి.
- స్థిరమైన రేటుతో డిమాండ్‌ పెరగకపోతే ఎకానమీ గాడి తప్పవచ్చు.
- రికవరీకి ప్రధాన కారణమైన ప్రభుత్వ వ్యయంలో పెరుగుదల క్రమంగా తగ్గుముఖం పడుతోంది. 
- ఇకమీదట పురోగతిని ప్రైవేట్‌ వ్యయం ముందుండి నడిపించాల్సిఉంటుంది. ప్రైవేట్‌ పెట్టుబడులు ఊపందుకోకపోతే రికవరీ ఆవిరి అయ్యే ప్రమాదం ఉంది.
- స్థూల ఆర్థిక అంశాలు మాత్రం ఇంకా కోలుకోలేదు. వీటిలో ఇంకా సవాళ్లున్నాయి. 
- క్యాడ్‌, విత్తలోటు, బాండ్‌ ఈల్డ్స్‌లో పెరుగుదల ప్రమాదఘంటికలు మోగిస్తోంది.
- పరోక్ష పన్నుల వసూళ్లు స్తబ్దుగా ఉండడం, విదేశీ నిధుల ప్రవాహం సన్నగిల్లడం పరిస్థితిని దిగజారుస్తున్నాయి. ఇదే సమయంలో ప్రపంచ ఎకానమీకి సవాళ్లు ఎదురుకావడం మంచిదికాదు.
- మార్కెట్లకు ఎర్నింగ్స్‌ వృద్ధి అతిపెద్ద సవాలు కానుంది. గత రెండేళ్లుగా ఎర్నింగ్స్‌ వృద్ధి చాలా అస్థిరంగా ఉంది. జూన్‌ త్రైమాసికంలో కొంచెం మెరుగుపడినా ఆశించిన స్థాయికి ఎర్నింగ్స్‌ చేరలేదు.
- స్థూల ఆర్థిక గణాంకాలను నిశితంగా పరిశీలిస్తుండాలి. ఇవి మరింత అధ్వాన్నంగా తయారైతే ఎకానమీలో పురోగతి మొత్తం మంటకలిసిపోతుంది.You may be interested

రేటింగ్‌ తగ్గింపుతో జీ ఎంటర్‌ప్రైజెస్‌ డౌన్‌!

Thursday 6th September 2018

ఏడాది కనిష్టాన్ని తాకిన షేరు ధర ముంబై:- ప్రముఖ రేటింగ్‌ సంస్థ మోర్గార్‌స్టాన్లీ... ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలోని జీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరుపై రేటింగ్‌ను తగ్గించడంతో ఆ షేరు ఇంట్రాడేలో ఏడాది కనిష్టానికి పతనమైంది. నేడు జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు బీఎస్‌ఈలో రూ.483.25ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. మోర్గార్‌స్టాన్లీ ప్రస్తుతం జీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరుకు ఉన్న ‘‘ఓవర్‌ వెయిట్‌’’ రేటింగ్‌ను ‘‘అండర్‌ వెయిట్‌’’కు సవరించడంతో పాటు షేరు టార్గెట్‌ కొనుగోలు ధరను రూ.610ల

10 శాతం పతనానికి సిద్దంగా ఉండండి!

Thursday 6th September 2018

ఇన్వెస్టర్లకు ఎడెల్‌వీజ్‌ సూచన దేశ ఎకానమీ వృద్ది రేటు ఆశించినట్లే పరుగులు తీస్తోంది కానీ కంపెనీల ఎర్నింగ్స్‌ మాత్రం ఇంకా అస్థిరంగానే ఉన్నాయని ప్రముఖ బ్రోకింగ్‌ దిగ్గజం ఎడెల్‌వీజ్‌ అబిప్రాయపడింది. మార్కెట్లో పెరిగిన వాల్యూషన్లకు తగినట్లు ఫలితాలు లేవని తెలిపింది. దీంతో ఎప్పుడైనా సూచీల్లో 10 శాతం కరెక‌్షన్‌ తప్పకపోవచ్చని అంచనా వేసింది.  దేశీయ సూచీలపై ఎడెల్‌ వీజ్‌ నివేదికలో ముఖ్యాంశాలు.. - కంపెనీల ఫలితాలు మెరుగైతే ఇతర నెగిటివ్‌ అంశాలన్నీ మరుగునపడతాయి.  - కానీ

Most from this category