STOCKS

News


జీఎస్‌టీ వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లు

Tuesday 2nd April 2019
news_main1554180643.png-24920

- మార్చిలో రికార్డు స్థాయి వసూళ్లు

న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరానికి (2018-19) వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ) వసూళ్లు రూ.11.77 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఈకాలంలో సగటున నెలకు 9.2 శాతం వృద్ధి రేటును సాధించి రూ.98,114 కోట్లుగా నమోదైనట్లు ఆర్థికమంత్రిత్వశాఖ సోమవారం ప్రకటించింది. ఈఏడాది మార్చిలో అత్యధికంగా రూ.1.06 లక్షల కోట్లు వసూళ్లు అయినట్లు ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. తయారీ, వినియోగం గణనీయంగా పెరుగుతుందనడానికి ఇది సంకేతమని అన్నారయన. అనేక వస్తు, సేవలపై రేట్లు భారీగా తగ్గినప్పటికీ.. పండుగల సీజన్‌, పన్ను ఎగవేత నిరోధక చర్యల తీవ్రతరం వంటి అంశాలు వసూళ్ల పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఇక గతేడాది ఏప్రిల్‌, అక్టోబర్‌, జనవరి, మార్చి నెలల్లో లక్ష కోట్ల మార్కును అధిగమించాయి. 2019-20 ఆర్థిక సంవత్సరం లక్ష్యం విషయానికి వస్తే.. కేంద్ర జీఎస్‌టీ 6.10 లక్షల కోట్లు, పరిహార సెస్ రూ.1.01 లక్షల కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.50,000 కోట్లుగా నిర్థారించుకుంది.

మార్చిలో సరికొత్త రికార్డు
జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన జూలై 1, 2017 నుంచి ఇప్పటి వరకు మునుపెన్నటూ లేని విధంగా ఒక్క మార్చిలోనే 75.95 లక్షల రిటర్నులు దాఖలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. మార్చి నెల్లో కేంద్ర జీఎస్‌టీ రూ.20,353 కోట్లు, రాష్ట్రాల జీఎస్‌టీ వసూళ్లు రూ.27,520 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్‌టీ రూ.50,418 కోట్లు, సెస్ రూ.8,286 కోట్లు వసూలు కాగా.. మొత్తం కలిపి రూ.1.06 లక్షల కోట్లకు చేరుకుని రికార్డు నెలకొంది. అంతక్రితం ఏడాది మార్చితో పోల్చితే 15.6 శాతం వృద్ధి నమోదైంది. 



You may be interested

పదేళ్ల గరిష్ఠానికి ‘గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌’

Tuesday 2nd April 2019

మార్కెట్లో ఆశనిరాశలకు ప్రతిరూపంగా భావించే గ్రీడ్‌ అండ్‌ ఫియర్‌ సూచీ ప్రస్తుతం పదేళ్ల గరిష్ఠ ఆశావహ ధృక్పథాన్ని చూపుతోందని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది. 2009 తర్వాత సూచీలో ‘గ్రీడ్‌’(ఆశావహ ధృక్పధం) ఈ రేంజ్‌లో నమోదు కావడం ఇదే ప్రథమమని తెలిపింది. గతేడాది అక్టోబర్లో సూచీ తీవ్రమైన ‘ఫియర్‌’(నిరాశాపూరిత వాతావరణం)ను నమోదు చేసింది. ఆ సమయంలో స్థానిక ఈక్విటీలపై అందరికీ భారీ భయాలు నెలకొన్నాయి. అప్పటి నుంచి క్రమంగా ఈక్విటీలో మార్పు వచ్చి

మార్కెట్లోకి 2019 ‘రెనో కాప్చర్‌’

Tuesday 2nd April 2019

- ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలు ముంబై: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘రెనో’ తాజాగా తన ప్రీమియం ఎస్‌యూవీ ‘కాప్చర్‌’ మోడల్‌లో నూతన వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఇంతకుముందు కంటే ఈకారులో మెరుగైన భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసినట్లు కంపెనీ ప్రకటించింది. పాదచారుల భద్రతా ప్రమాణాల వంటి అన్ని రకాల దేశీ భద్రతా చట్టాలకు అనుగుణంగా ఈ నూతన వెర్షన్‌ రూపొందినట్లు తెలిపింది. ధరల శ్రేణి రూ.9.5లక్షలు–రూ.13లక్షలుగా ప్రకటించింది. ఎలక్ట్రానిక్ బ్రేక్

Most from this category