STOCKS

News


భారత్‌లో నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం

Friday 12th October 2018
news_main1539318732.png-21074

న్యూఢిల్లీ: భారత్‌ను నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రానికి వేదికగా ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్‌) ఎంచుకుంది. ఈ కేంద్రాన్ని ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆవిష్కరించారు. ప్రభుత్వం, వ్యాపార సంస్థలను ఒకే తాటిపైకి తీసుకొచ్చి నూతన టెక్నాలజీ విధానాలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ కేంద్రం పనిచేయనుంది. ఈ కేంద్రం మహారాష్ట్రలో ఏర్పాటు కానుంది. డ్రోన్లు, కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌), బ్లాక్‌చెయిన్‌ టెక్నాలజీలను తొలి మూడు ప్రాజెక్టులుగా పరిగణనలోకి తీసుకుంది. వీటిలో ముందుగా ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), మెషిన్‌లర్నింగ్‌, బ్లాక్‌చెయిన్‌పై ఎక్కువగా దృష్టి పెట్టనున్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ ప్రకటించింది. జాతీయ స్థాయిలో ప్రభుత్వ సహకారంతో, దిగ్గజ వ్యాపార సంస్థలు, విద్యారంగం, స్టార్టప్‌లు, అంతర్జాతీయ సంస్థలతో కలసి నూతన విధానాలను రూపొందించడంతోపాటు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఙానాలకు ప్రోటోకాల్స్‌ తీసుకురానున్నట్టు డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం తరఫున నీతి ఆయోగ్‌ ఈ భాగస్వామ్యాన్ని సమన్వయపరుస్తుంది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర ప్రభుత్వాలతో డబ్ల్యూఈఎఫ్‌ భాగస్వామ్యం కుదుర్చుకుంది. మరిన్ని రాష్ట్రాలతోనూ ఈ విధమైన భాగస్వామ్యం రానున్న రోజుల్లో ఉంటుందని డబ్ల్యూఈఎఫ్‌ తెలిపింది. ‘‘ఏ విధంగా మనం తయారు చేస్తాం, ఏ విధంగా వినియోగించుకుంటాం, ఏ విధంగా సంప్రదింపులు చేస్తాం, ఏ విధంగా జీవిస్తామన్న దాన్ని నాలుగో పారిశ్రామిక విప్లవం మార్చివేయనుంది’’ అని డబ్ల్యూఈఎఫ్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ క్లౌస్‌ష్వాబ్‌ తెలిపారు. భారత్‌ అతిపెద్ద టెక్నాలజీ శక్తిగా మారుతోందని, అందుకే నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించడానికి గర్వంగా ఉందన్నారు. మానవుడి కేంద్రంగా టెక్నాలజీ ప్రగతి సాధించాలంటే, మనం తప్పనిసరిగా కలసికట్టుగా, చుర్గుగా పనిచేయాలని, కనీస అవసరమైన సూత్రాలను, పాలసీ ప్రమాణాలను తీసుకురావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల వినియోగంపై మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ సహకారంతో పనిచేయనుంది.  
 4వ పారిశ్రామిక విప్లవంతో మరిన్ని ఉద్యోగాలు: ప్రధాని
నాలుగో పారిశ్రామిక విప్లవం ఉద్యోగాల స్వరూపాన్ని మార్చేస్తుందని, మరిన్ని ఉపాధి అవకాశాలు అందివస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. టెక్నాలజీ అభివృద్ధితో ఉద్యోగాలు పోతాయన్న భయాలను తేలికపరిచే ప్రయత్నం చేశారు. నాలుగో పారిశ్రామిక విప్లవ కేంద్రం ఆవిష్కరణ అనంతరం ఆయన మాట్లాడారు. నాలుగో పారిశ్రామిక విప్లవ ఫలాలను పొందేందుకు విధానాల్లో  మార్పులు తీసుకువచ్చేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ‘‘మన వైవిధ్యం, జనాభా సంఖ్య పరంగా సానుకూలత, వేగంగా వృద్ధి చెందే మార్కెట్‌, డిజిటల్‌ మౌలిక సదుపాయాలు అనేవి పరిశోధన, అమలు విషయంలో భారత్‌ను ప్రపంచ కేంద్రంగా మార్చగలిగే సామర్థ్యాలున్నవి’’ అని పేర్కొన్నారు. గత పారిశ్రామిక విప్లవాల్లో భారత్‌ పాల్గొనలేకపోయినందున, నాలుగో పారిశ్రామిక విప్లవంతో భారత్‌ పాత్ర ఆశ్చర్యకరమైన రీతిలో ఉంటుందని చెప్పారు. ‘‘మొదటి రెండు పారిశ్రామిక విప్లవాల సమయంలో భారత్‌ స్వతంత్ర దేశం కాదు. మూడో పారిశ్రామిక విప్లవం సందర్భంలో స్వాతంత్ర్యం కారణంగా వచ్చిన సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఉంది’’ అని ప్రధాని వివరించారు. ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌, మెషిన్‌ లర్నింగ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌, బ్లాక్‌ చెయిన్‌, బిగ్‌డేటా అనేవి భారత్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళతాయన్నారు. తమ ప్రభుత్వం సాధించిన విజయాలను వివరిస్తూ... దేశంలో టెలీ సాంద్రత 93 శాతానికి చేరిందని, 50 కోట్ల మంది మొబైల్స్‌ వాడుతున్నారని చెప్పారు. ప్రపంచంలో ఎక్కువగా డేటా వినియోగించే దేశం మనదని, అదే సమయంలో చౌక రేట్లున్నాయన్నారు. దేశంలో 120 కోట్ల మందికి ఆధార్‌ ఉందని, 2.5 లక్షల గ్రామ పంచాయతీలకు ఆప్టిక్‌ ఫైబర్‌ అనుసంధానత త్వరలోనే పూర్తవుతుందన్నారు. 



You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌పై అధ్యయానికి ఐసీఏఐ కమిటీ

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను కేంద్రం చక్కదిద్దే ప్రయత్నాల్లో ఉన్న నేపథ్యంలో.. దీనికి దారి తీసిన వ్యవస్థాగత అంశాలను అధ్యయనం చేయాలని ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్‌ (ఐసీఏఐ) నిర్ణయించింది. ఇందుకోసం తొమ్మిది మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌ సంక్షోభంలో వ్యవస్థాగత అంశాలను అధ్యయనం చేసి, వాటిని సరిదిద్దేందుకు.. వ్యవస్థను చక్కబెట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలను ఈ కమిటీ సిఫార్సు చేయనుందని ఐసీఏఐ పేర్కొంది. గత

ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 3 నుంచి

Friday 12th October 2018

న్యూఢిల్లీ: ఐడీబీఐ బ్యాంక్‌ షేర్ల కోసం ఎల్‌ఐసీ ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌ 3 నుంచి ప్రారంభం కానున్నది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా ఒక్కొక్క ఐడీబీఐ బ్యాంక్‌ షేర్‌ను రూ.61.73 ధరకు ఎల్‌ఐసీ కొనుగోలు చేయనున్నదని ఐడీబీఐ బ్యాంక్‌ తెలిపింది. ఈ  ఓపెన్‌ ఆఫర్‌ డిసెంబర్‌​14న ముగుస్తుంది. ఓపెన్‌ ఆఫర్‌లో భాగంగా 26 శాతం వాటాకు సమానమైన 204, 15, 12, 929 షేర్లను ఎల్‌ఐసీ కొనుగోలు చేస్తుంది. ఐడీబీఐ బ్యాంక్‌లో

Most from this category