News


400 బిలియన్‌ డాలర్లకు పెరిగిన ఫారెక్స్‌ నిల్వలు

Saturday 22nd September 2018
news_main1537593110.png-20472

ముంబై: విదేశీ మారక నిల్వలు (ఫారెక్స్‌) సెప్టెంబర్‌ 14తో అంతమైన వారానికి 1.207 బిలియన్‌ డాలర్లు పెరిగి 400.489 బిలియన్‌ డాలర్లకు చేరుకున్నాయి. అంతకుముందు వారంలో ఫారెక్స్‌ నిల్వలు 819 మిలియన్‌ డాలర్ల క్షీణతతో 399.282 బిలియన్‌ డాలర్లకు తగ్గిన విషయం గమనార్హం. ఈ ఏడాది ఏప్రిల్‌ 13తో ముగిసిన వారంలో నమోదైన 426 బిలియన్‌ డాలర్ల ఫారెక్స్‌ నిల్వలు రికార్డు స్థాయి కాగా, ఆ తర్వాత నుంచి క్షీణత మొదలైంది. ఇక బంగారం నిల్వలు సైతం సెప్టెంబర్‌ 14తో ముగిసిన వారంలో 144 మిలియన్‌ డాలర్లు పెరిగి 20.378 బిలియన్‌ డాలర్ల విలువకు చేరినట్టు ఆర్‌బీఐ గణాంకాల ఆధారంగా తెలుస్తోంది. 



You may be interested

జీఎంఆర్‌కు గ్రీస్‌ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్ట్‌

Saturday 22nd September 2018

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: జీఎంఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అనుబంధ సంస్థ అయిన జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌కు గ్రీస్‌ విమానాశ్రయ అభివృద్ధి కాంట్రాక్ట్‌ దక్కింది. ఈ మేరకు గ్రీస్‌ ప్రభుత్వం లేఖను అందించిందని జీఎంఆర్‌ ఒక ప్రకటనలో తెలిపింది. క్రీటా ద్వీపంలోని హెరాక్‌లిఆన్‌ ఎయిర్‌పోర్ట్‌ డిజైన్, నిర్మాణం, ఫైనాన్స్‌తో పాటూ కార్యకలాపాల నిర్వహణ బాధ్యత కూడా జీఎంఆర్‌కే దక్కిందని జీఎంఆర్‌ గ్రూప్‌ ఎనర్జీ అండ్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ బిజినెస్‌ చైర్మన్‌ శ్రీనివాస్‌ బొమ్మిడాల తెలిపారు. మొత్తం

ఎఫ్‌పీఐల కేవైసీ నిబంధనల సవరణ

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ)కు సంబంధించి సవరించిన కేవైసీ నిబంధనలను సెబీ విడుదల చేసింది. ఎన్‌ఆర్‌ఐలు, దేశీయంగా నివసించే పౌరులు ఎఫ్‌పీఏల్లో అనియంత్రిత వాటా కలిగి ఉండేందుకు సెబీ తాజాగా అనుమతించింది. కేవైసీ (మీ కస్టర్‌ ఎవరన్నది తెలుసుకోవడం)కి సంబంధించి రెండు సర్క్యులర్‌లను విడుదల చేసింది. గతంలో విడుదల చేసిన మార్గదర్శకాలపై ఎఫ్‌పీఏల్లో ఆందోళన తలెత్తడం, నిబంధనల పాటింపు విషయంలో గందరగోళం కారణంగా రూ.4 లక్షల కోట్ల మేర

Most from this category