STOCKS

News


ఆర్థిక వృద్ధికి 'ఫ్లెక్సిబుల్' వర్కింగ్ ఊతం

Thursday 18th October 2018
news_main1539834080.png-21255

న్యూఢిల్లీ: సరళతర పని విధానాలు (ఫ్లెక్సిబుల్ వర్కింగ్‌) దేశ ఆర్థిక వృద్ధికి ఊతమివ్వనున్నాయి. కార్పొరేట్లు వ్యయాలు తగ్గించుకోవడానికి, ఉద్యోగుల ఉత్పాదకత మెరుగుపడటానికి ఇవి దోహదపడనున్న నేపథ్యంలో 2030 నాటికల్లా ఈ విధానాలతో ఎకానమీకి ఏటా 376 బిలియన్ డాలర్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది. అంతర్జాతీయ వర్క్‌స్పేస్ సంస్థ రీగస్ నిర్వహించిన అధ్యయనంలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. భారత్‌, అమెరికా, ఆస్ట్రేలియా తదితర 16 దేశాల్లో నిర్వహించిన ఈ అధ్యయనం ప్రకారం 2030 నాటికల్లా చాలా మటుకు అభివృద్ధి చెందిన దేశాల్లోని ఉద్యోగుల్లో సుమారు 8-13 శాతం మంది ఫ్లెక్సిబుల్ వర్కింగ్ విధానాల్లో (వర్క్ ఫ్రం హోమ్ మొదలైనవి) పనిచేయనున్నారు. ఆ 16 దేశాల్లో 350 కోట్ల గంటల మేర ప్రయాణ సమయం ఆదా కానుంది. ఫ్లెక్సిబుల్ వర్కింగ్ విధానం ఊపందుకోవడం వల్ల 2030 నాటికి ప్రపంచ ఎకానమీకి 10.04 ట్రిలియన్ డాలర్ల జత కానుంది. భారత్‌, చైనాల్లో ఈ విలువ మరింత ఎక్కువగా ఉండగలదని రీగస్ పేర్కొంది. 



You may be interested

మరోమైలు రాయిని దాటిన ‘హోండా యాక్టివా’

Thursday 18th October 2018

ముంబై: ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్‌ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎంఎస్ఐ)... తాజాగా మరో మైలు రాయిని దాటింది. కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ టూవీలరైన ‘యాక్టివా’ అమ్మకాలు 2 కోట్లకు చేరుకున్నట్లకు ప్రకటించింది. మొదటి కోటి యాక్టివాలను విక్రయించడానికి 15 ఏళ్ల సమయం పట్టగా, ఆ తరువాత కోటి వాహనాల అమ్మకాలకు కేవలం మూడేళ్లలోనే పూర్తిచేయగలిగినట్లు వెల్లడించింది. ఈ సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్‌, చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌

భారత్‌లో ‘వీఎంవేర్‌’ భారీ పెట్టుబడులు

Thursday 18th October 2018

న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ప్రముఖ ఐటీ సంస్థ వీఎంవేర్‌ భారత్‌లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించనున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా వచ్చే 5 ఏళ్లలో 2 బిలియన్‌ డాలర్లు (రూ.14,679 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు వెల్లడించింది. ముఖ్యంగా బెంగళూరు, పూణే ప్రాంతాలలోని కార్యాలయాల విస్తరణకు ఈ నిధులను వినియోగించనుండగా, ఇదే సమయంలో ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్లు సంస్థ సీఈఓ పాట్ జెల్సింగర్ అన్నారు. ‘భారత్‌లో ప్రస్తుతం కంపెనీకి 5,000 మంది

Most from this category