News


జీడీపీ వృద్ధి రేటు మరింత పైకి

Saturday 22nd September 2018
news_main1537592858.png-20469

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి జీడీపీ వృద్ధి అంచనాలను అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ ‘ఫిచ్‌’ పెంచింది. గతంలో 7.4 శాతంగా అంచనా వేయగా, తాజాగా దాన్ని 7.8 శాతం చేసింది. జూన్‌ త్రైమాసికంలో జీడీపీ రేటు మెరుగ్గా నమోదవడమే తమ అంచనాల సవరణకు కారణమని తెలిపింది. నిజానికి జూన్‌ త్రైమాసికానికి జీడీపీ 7.7 శాతం వృద్ధి రేటు నమోదు చేయవచ్చని ఫిచ్‌ అంచనా వేయగా, వాస్తవ వృద్ధి 8.2 శాతంగా నమోదైంది. అయితే, పెరుగుతున్న ముడిచమురు దిగుమతుల బిల్లు, అధిక వడ్డీ రేట్లు ఆందోళనకర అంశాలుగా పేర్కొంది. ఇక 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాల్లో జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 0.2 శాతం తగ్గించి 7.3 శాతానికి ఫిచ్‌ సవరించింది. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై తన వైఖరిని వెల్లడించింది. ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యంలో (4 శాతానికి అటూ, ఇటూ 2 శాతం అదనం) గరిష్టానికి చేరుకోవచ్చని, అధిక డిమాండ్‌ రూపాయిపై ఒత్తిళ్లకు దారితీస్తుందని అంచనా వేసింది. బ్యాంకుల బలహీన బ్యాలన్స్‌ షీట్లు, ఆర్థిక పరిస్థితులు కఠినంగా మారడం, చమురు దిగుమతుల బిల్లు పెరగడం వంటివి ఆర్థిక రంగ భవిష్యత్‌ వృద్ధికి సవాళ్లుగా ఫిచ్‌ పేర్కొంది. రూపాయి ఈ ఏడాది ఇంత వరకు దారుణ పనితీరు చూపించిన ఆసియా కరెన్సీగా అభివర్ణించింది.
అంతర్జాతీయ వృద్ధిపై ప్రభావం
అంతర్జాతీయ వృద్ధి విషయాన్ని ఫిచ్‌ ప్రస్తావిస్తూ... అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం డౌన్‌సైడ్‌ రిస్క్‌ను పెంచుతోందని అభిప్రాయం వ్యక్తం చేసింది. 2019 సంవత్సరానికి చైనా వృద్ధి రేటు అంచనాలను ఫిచ్‌ 0.2 శాతం తగ్గించి 6.1 శాతం చేసింది. అంతర్జాతీయ వృద్ధి రేటు సైతం 2018లో 3.3 శాతం, 2019లో 3.1 శాతంగా ఉంటుందని అంచనా వేసింది. తాజాగా 200 బిలియన్‌ డాలర్ల విలువైన చైనా దిగుమతులపై ట్రంప్‌ 10 శాతం టారిఫ్‌లు విధించడం వల్ల అంతర్జాతీయ ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపిస్తుందని పేర్కొంది. 



You may be interested

 రూపీ.. 72.20 వద్ద ముగింపు

Saturday 22nd September 2018

ముంబై: డాలర్ అమ్మకాల నేపథ్యంలో వరుసగా రెండో రోజు కూడా రూపాయి బులిష్ ట్రెండ్ కొనసాగించింది. శుక్రవారం డాలర్‌తో పోలిస్తే 17 పైసలు బలపడి 72.20 వద్ద ముగిసింది. శుక్రవారం ఇంట్రా డేలో 71.70 గరిష్ట స్థాయి, 72.48 కనిష్ట స్థాయిని కూడా తాకింది. దేశీ స్టాక్ మార్కెట్ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనైన నేపథ్యంలో చివరికి 72.20 వద్ద క్లోజయ్యింది. అమెరికా టారిఫ్‌లపై చైనా తీసుకోబోయే చర్యలపై దృష్టి పెట్టిన

ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌పై ఫోరెన్సిక్‌ ఆడిట్‌

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: స్టీల్‌ రంగంలోని ఆధునిక్‌ ఇండస్ట్రీస్‌ కంపెనీ ఖాతాలపై ఫోరెన్సిక్‌ ఆడిట్‌ నిర్వహణకు సెబీ శుక్రవారం ఆదేశించింది. అనుమానిత 331 షెల్‌ కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఉంది. దీంతో ఈ కంపెనీ ఖాతా పుస్తకాల్లో దుర్వినియోగం జరిగినట్టు అనుమానిస్తున్న సెబీ ఫోరెన్సిక్‌ ఆడిట్‌కు ఆదేశించడం గమనార్హం. ఓ స్వతంత్ర ఫోరెన్సిక్‌ ఆడిటర్‌ను నియమించాలని స్టాక్‌ ఎక్సేంజ్‌లను ఆదేశించింది. కంపెనీ ఆర్థిక వివరాలు, వ్యాపారాలకు సంబంధించి ఏదైనా తప్పుదోవ పట్టించడం

Most from this category