జీడీపీ అంచనాల్ని తగ్గించిన ఫిచ్
By Sakshi

ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2018-19) సంబంధించి ఇండియా జీడీపీ వృద్ధి రేటు అంచనాల్లో కోత విధించింది. 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గించింది. అలాగే 2019-20 ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 7 శాతానికి, 2020-21 ఆర్థిక సంవత్సరపు జీడీపీ వృద్ధి రేటు అంచనాలను 7.3 శాతం నుంచి 7.1 శాతానికి పరిమితం చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ2లో దేశ జీడీపీ వృద్ధి రేటు మందగించిన నేపథ్యంలో ఫిచ్ వృద్ధి రేటు అంచనాల కోత ప్రాధాన్యం సంతరించుకుంది. కాగా క్యూ2లో జీడీపీ వృద్ధి రేటు 7.1 శాతంగా నమోదయ్యింది. క్యూ1లో వృద్ధి రేటు 8.2 శాతంగా ఉంది.
డిసెంబర్ 5న రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. 2018-19 ఆర్థిక సంవత్సరం రెండో అర్ధ భాగంలో 7.2-7.3 శాతం శ్రేణిలో ఉండొచ్చని పేర్కొంది. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ భాగంలో వృద్ధి రేటు 7.5 శాతంగా నమోదు కావొచ్చని తెలిపింది. ప్రైవేట్ రంగంలో వినియోగం నెమ్మదించడం, నికర ఎగుమతులు తగ్గడం కారణంగా జీడీపీపై ప్రతికూల ప్రభావం పడిందని పేర్కొంది.
రుణ లభ్యత తగ్గడం, అధిక వడ్డీ వ్యయాలపై ఫిచ్ ఆందోళన వ్యక్తం చేసింది. ‘మొండి బకాయిలతో బ్యాంకింగ్ వ్యవస్థ ఇంకా సతమతమౌతోంది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ డిఫాల్ట్ కారణంగా ఎన్‌బీఎఫ్‌సీలకు ద్రవ్య లభ్యత కఠినతరమైంది’ అని పేర్కొంది. వృద్ధికి దోహదపడేలా పాలసీ నిర్ణయాలు ఉండాలని తెలిపింది. అంతర్జాతీయంగా కఠిన ద్రవ్య విధానాల వల్ల రూపాయిపై ఒత్తిడి పెరగొచ్చని అంచనా వేసింది. 2019 చివరి నాటికి అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి 75 స్థాయికి బలహీన పడొచ్చని పేర్కొంది. కాగా ప్రస్తుతం ఇండియన్ రూపాయి 71 స్థాయి దిగువకు పడిపోయింది.
You may be interested
మార్కెట్ పతనానికి 5 కారణాలు
Thursday 6th December 2018ముంబై: దేశీ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం గ్యాప్డౌన్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక శాతానికి మించి నష్టాలను నమోదుచేశాయి. నిఫ్టీ 10,700 పాయింట్ల మార్కును కోల్పోయి 10,641 పాయింట్ల ఇంట్రాడే కనిష్టస్థాయిని నమోదుచేసింది. సెన్సెక్స్ 350 పాయింట్ల మేర నష్టపోయి 35,534 వద్దకు చేరుకుంది. ఇంతటి పతనానికి ఐదు ప్రధాన కారణాలను దలాల్ స్ట్రీట్ పండితులు వెల్లడించారు. అవేంటంటే.. ఆసియా మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు చైనాకు చెందిన మొబైల్ దిగ్గజ
ఈ నెల 13 నుంచి భెల్ షేర్ల బైబ్యాక్
Thursday 6th December 2018న్యూఢిల్లీ: భెల్ షేర్ల బైబ్యాక్ ఈ నెల 13 నుంచి ప్రారంభమై 27న ముగియనున్నది. . ఈ షేర్ల బైబ్యాక్‌లో భాగంగా భెల్ కంపెనీ 5.16 శాతం వాటాకు సమానమైన 18.93 కోట్ల షేర్లను బైబ్యాక్ చేయనున్నది. ఈ షేర్ల బైబ్యాక్ కోసం ఈ కంపెనీ రూ.1,628 కోట్లు కేటాయించింది. టెండర్ ఆఫర్ మార్గంలో షేర్లను బైబ్యాక్ చేస్తామని, రూ. 2 ముఖ విలువ గల ఒక్కో షేర్‌ను బైబ్యాక్