STOCKS

News


భారత్‌ జీడీపీ అంచనాలను తగ్గించిన ఫిచ్‌

Friday 22nd March 2019
news_main1553239843.png-24752

వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఇండియా జీడీపీ వృద్ది రేటు అంచనాను ఫిచ్‌ రేటింగ్స్‌ 7 శాతం నుంచి 6.8 శాతానికి తగ్గించింది. ఎకానమీలో అనుకున్నదానికన్నా ఎక్కువ బలహీనత కనిపించవచ్చని అందుకే వృద్ధి అంచనా తగ్గిస్తున్నామని తెలిపింది. అయితే అంచనా తగ్గించినా, 6.8 శాతం వృద్ది రేటు ఆమోదయోగ్యమేనని తెలిపింది. ఆపై ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 7. 1 శాతంగా నమోదు కావచ్చని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర వృద్ధి రేటు అంచనాలను 7.8 శాతం నుంచి 7.2 శాతానికి తగ్గిస్తున్నట్లు ఫిచ్‌ గత డిసెంబర్‌లో ప్రకటించింది. అదే సమయంలో 2019-20, 2020-21 సంవత్సరాల అంచనాలను సైతం వరుసగా 7.3 నుంచి 7 శాతానికి, 7.3 నుంచి 7.1 శాతానికి తగ్గిస్తున్నామని తెలిపింది. తాజాగా వచ్చే ఏడాది అంచనాను మరికాస్త తగ్గించి, 2020-21 ఏడాది అంచనాలను యథాతధంగా ఉంచింది.

వడ్డీరేట్లు తగ్గిస్తూ ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయాన్ని ఫిచ్‌ సమర్ధించింది. ద్రవ్యోల్బణం తగ్గుతున్నందున రేట్‌కట్‌ సబబేనని పేర్కొంది. ఈ క్యాలెండర్‌ సంవత్సరంలో మరోమారు 25 బీపీఎస్‌ మేర రేట్‌కట్‌ ఉండొచ్చని అంచనా వేస్తున్నామని ఫిచ్‌ తన నివేదికలో పేర్కొంది. ద్రవ్యోల్బణం అదుపులో ఉండడం, అంతర్జాతీయ మానిటరీ పాలసీల సరళీకరణతో మరో రేట్‌కట్‌కు ఆర్‌బీఐ మొగ్గు చూపవచ్చని పేర్కొంది. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు, వినిమయం ఊపందుకుంటాయని తెలిపింది. 


 



You may be interested

ఆర్‌ఐఎల్‌ షేరు ఇంకా పెరుగుతుందా?

Friday 22nd March 2019

ఈ నెల్లో మార్కెట్‌ పరుగులను మించి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ షేరు ర్యాలీ జరిపింది. సుమారు నెల రోజుల్లో దాదాపు 23 శాతం లాభపడింది. మార్చి20న షేరు బీఎస్‌ఈలో ఆల్‌టైమ్‌ హై 1386రూపాయలను తాకింది. ఈ రేంజ్‌లో షేరు దూసుకుపోవడంతో ఇకపై ఎలాంటి ప్రదర్శన జరుపుతుందో? ఈ స్థాయిల వద్ద కొనవచ్చా? అని అనేక సందేహాలు రిటైలర్స్‌ మదిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో షేరు లాభాల పరుగు కొనసాగుతుందని ఎక్కువమంది అనలిస్టులు,

‘కేటీఎమ్‌’లో వాటా విక్రయించనున్న బజాజ్‌ ఆటో

Friday 22nd March 2019

జూన్‌ కల్లా లావాదేవీ పూర్తి !  న్యూఢిల్లీ: ఆస్ట్రియా మోటార్‌ సైకిల్‌ కంపెనీ, కేటీఎమ్‌ ఏజీలో బజాజ్‌ ఆటోకు ఉన్న 48 శాతం వాటా చేతులు మారనున్నది. ఈ వాటాను కేటీఎమ్‌ ఏజీ మాతృ కంపెనీ, కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌లో అధిక (62 శాతం)వాటా ఉన్న పియరర్‌ ఇండస్ట్రీ ఏజీకి బజాజ్‌ ఆటో విక్రయించనున్నది. ఈ మేరకు పియరర్‌ ఇండస్ట్రీ ఏజీకి, బజాజ్‌ ఆటో కంపెనీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన

Most from this category