STOCKS

News


కట్టుతప్పిన ద్రవ్యలోటు

Friday 28th December 2018
news_main1545971089.png-23276

  • 2018-19 బడ్జెట్‌ లక్ష్యం రూ.6.24 లక్షల కోట్లు 
  • నవంబర్‌ నాటికే రూ.7.16 లక్షల కోట్లకు చేరిక
  • లక్ష్యానికన్నా 15 శాతం పెరుగుదల

న్యూఢిల్లీ: భారత్‌ ద్రవ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కట్టుతప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ప్రారంభమై మార్చి 2019తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో నవంబర్‌ నెలకు వచ్చేసరికే ద్రవ్యలోటు బడ్జెట్‌ నిర్దేశాలను దాటిపోయింది. బడ్జెట్‌ లక్ష్యంలో​ 115 శాతాన్ని తాకింది. వివరాల్లోకి వెళితే...
- ఒక నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం- చేసే వ్యయం మధ్య నికర వ్యత్యాసమే ద్రవ్యలోటు.
- 2018-19  ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ద్రవ్యలోటు ఉండాలని వార్షిక బడ్జెట్‌ నిర్దేశించింది. విలువలో ఇది రూ.6.24 లక్షల కోట్లు.
- అయితే 2018 నవంబర్‌ పూర్తయ్యే నాటికే ఈ లోటు రూ.7.16 లక్షల కోట్లను తాకింది. అంటే లక్ష్యానికన్నా మరో 15 శాతం ఎక్కువయిందన్న మాట. 2017 నవంబర్‌ నాటికి ఈ లోటు 12 శాతం పెరిగి కూర్చుంది.
- అనుకున్న మేరకు పన్ను తదితర ఆదాయాలు కేంద్రానికి లేకపోవడం దీనికి కారణం. అయితే ఆర్థిక​ సంవత్సరం మిగిలిన నాలుగు నెలల్లో ద్రవ్యలోటు లక్ష్యాల మేరకు ఉంటుందని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. జీడీపీ వృద్ధి, ఆదాయాలు పెరగడం ఇందుకు దోహదపడతాయని వారు విశ్వసిస్తున్నారు.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొత్తం కేంద్ర ఆదాయ లక్ష్యం రూ.17.25 లక్షల కోట్లు. నవంబర్‌ నాటికి వచ్చింది రూ.8.70 లక్షల కోట్లు. అంటే లక్ష్యంలో 50.4 శాతం. ఇక వ్యయాలు రూ.16.13 లక్షల కోట్లు. బడ్జెట్‌ అంచనాల్లో 66.1 శాతం.
- పెట్టుబడుల ఉపసంహరణ సహా పలు మార్గాల ద్వారా ద్రవ్యలోటును భర్తీ చేయటానికి కేంద్రం ప్రయత్నిస్తోంది.



You may be interested

జనవరి నుంచి ఏపీ ఆర్‌వోసీ

Friday 28th December 2018

- విజయవాడలో తాత్కాలిక కార్యాలయం - తొలి ఆర్‌వోసీగా డెన్నింగ్‌ కె బాబు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: కొత్త సంవత్సరం జనవరి 1 నుంచి ఆంధ్రప్రదేశ్‌ రిజిష్ట్రార్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (ఆర్‌వోసీ) ప్రారంభం కానుంది. ఏపీ తొలి ఆర్‌వోసీగా డెన్నింగ్‌ కె బాబు, అసిస్టెంట్‌ ఆర్‌వోసీగా ఎల్‌.సాయి శంకర్‌లను నియమిస్తూ కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంసీఏ) జీవోను విడుదల చేసింది. అమరావతిలో సొంత భవనం నిర్మించే వరకూ విజయవాడలోని సూర్యారావుపేటలో

ఇల్లంతా ‘‘ఎంఐ’’ మయం..!

Friday 28th December 2018

- నూతన విభాగాలపై షావోమీ కన్ను - ఫోన్లు, టీవీలతో పాటు ఏసీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మెషిన్లు - త్వరలో వాక్యూమ్‌ క్లీనర్లు, వాటర్‌ ప్యూపిఫయర్లలోకి - ప్రణాళికల రచనలో కంపెనీ ఉన్నత ఉద్యోగులు న్యూఢిల్లీ: చేతిలో ఎంఐ ఫోన్‌... హాల్లో ఎంఐ ఫ్రిజ్‌... కిచెన్‌లో ఎంఐ వాటర్‌ ప్యూరిఫయర్‌... బాల్కనీలో ఎంఐ వాషింగ్‌ మెషిన్‌... బెడ్‌ రూమ్‌లో ఎంఐ ఏసీ... భవిష్యత్తులో ఇదే చూడబోతున్నాం!. చౌక ధరలకే అత్యాధునిక ఫీచర్లతో కూడిన ఎంఐ బ్రాండ్‌

Most from this category