STOCKS

News


ఆగస్టులో మెరుగైన ప్రభుత్వ ద్రవ్య పరిస్థితి

Wednesday 26th September 2018
news_main1537938295.png-20575

న్యూఢిల్లీ: రాబడులు, వ్యయాలకు సంబంధించి కేంద్ర ఫైనాన్షియల్‌ పరిస్థితి ఆగస్టులో మెరుగుపడింది. మంగళవారం విడుదలైన తాజా గణాంకాలను చూస్తే,  ద్రవ్యలోటు (ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం) ఆగస్టు నాటికి 2018- 19 బడ్జెట్లో అంచనా వేసిన మొత్తంలో 94.7 శాతానికి చేరింది. గతేడాది ఇదే నెలకు అప్పటి (2017-18) బడ్జెట్‌ అంచనాల్లో 96.1 శాతంగా ఉంది. వివరాల్లోకి వెళితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా (2018-19 జీడీపీ విలువలో 3.3 శాతం) ఉండాలని  బడ్జెట్‌ నిర్దేశించింది. అయితే మొదటి ఐదు  నెలల్లో (ఏప్రిల్‌-ఆగస్టు) ఈ లోటు రూ.5.91 లక్షల కోట్లుగా నమోదైంది. 



You may be interested

ఆహార శుద్ధి పరిశ్రమలోకి బిలియన్‌ డాలర్ల ఎఫ్‌డీఐ: బాదల్‌

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: ఆహార శుద్ధి రంగంలోకి ఈ ఏడాది ఇప్పటికే బిలియన్‌ డాలర్లకు (రూ.7,200 కోట్లు) పైగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) వచ్చాయని కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ తెలిపారు. ‘‘2014లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే నాటికి ఆహార శుద్ధి పరిశ్రమలోకి వస్తున్న ఎఫ్‌డీఐలు ఏటా 500 మిలియన్‌ డాలర్లుగా ఉండేవి. ఈ ఏడాది బిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించాం. ఈ మార్గంలో చాలా దూరం ప్రయాణించాల్సి

త్వరలో ‘ఫ్లెయిర్‌’ ఐపీఓ

Wednesday 26th September 2018

న్యూఢిల్లీ: పెన్నులు తయారు చేసే ఫ్లెయిర్‌ రైటింగ్‌ ఇండస్ట్రీస్‌ త్వరలో ఐపీఓకు (ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌) వస్తోంది. ఐపీఓ ముసాయిదా పత్రాలను ఈ కంపెనీ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెబీకి ఇటీవలే సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.330 కోట్లు విలువ గల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. అంతేకాకుండా ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) మార్గంలో షేర్లు జారీ చేసి రూ.120 కోట్లు సమీకరించనుంది.

Most from this category