STOCKS

News


సీపీఎస్‌ఈల్లో వాటాల విక్రయంపై కేంద‍్రం కసరత్తు

Monday 13th May 2019
news_main1557730055.png-25705

 

  • ప్రక్రియ నాలుగు నెలల్లో పూర్తి చేయడంపై దృష్టి
  • లిస్టులో ఎయిరిండియా, స్కూటర్స్ ఇండియా, బీఈఎంఎల్ మొదలైన సంస్థలు

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో (సీపీఎస్‌ఈ) వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని వేగవంతం చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆసక్తి గల ఇన్వెస్టర్లకు సమాచార పత్రాలు జారీ చేసిన నాలుగు నెలల్లోగా విక్రయ ప్రక్రియ పూర్తయ్యేలా చేయడంపై కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. "ప్రస్తుతం వ్యూహాత్మక వాటాల విక్రయానికంటూ విధానం అమల్లో ఉన్నప్పటికీ.. దీన్ని మరికాస్త క్రమబద్ధీకరించాల్సి ఉంది. ప్రక్రియంతా 3-4 నెలల్లోగా పూర్తయ్యేలా చూడాల్సి ఉంది. ఒకవేళ 4 నెలల్లోగా పూర్తి కాకపోతే సదరు ప్రతిపాదనను పక్కన పెట్టాలన్న అభిప్రాయం ఉంది" అని ప్రభుత్వ అధికారి ఒకరు తెలిపారు. ‍అయితే, ఎయిరిండియా వంటి భారీ సంస్థల విక్రయానికి మాత్రం ప్రాథమిక సమాచార పత్రం (పీఐఎం) జారీ చేసిన రోజు నుంచి కనీసం ఆరు నెలల వ్యవధైనా ఉండాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు వివరించారు. ఒకటికి మించి సీపీఎస్‌ఈల విక్రయాన్ని ఏకకాలంలో చేపట్టే విధంగా ప్రక్రియను రూపొందించడంపై కసరత్తు చేస్తున్నట్లు అధికారి పేర్కొన్నారు. పెద్ద సంస్థలకు మాత్రం ఆరు నెలల దాకా గడువు పొడిగించే అవకాశం ఉందన్నారు. 
    వ్యూహాత్మక వాటాల విక్రయం కోసం షార్ట్‌లిస్ట్ చేసిన సంస్థల్లో ఎయిరిండియా, దాని అనుబంధ సంస్థ ఏఐఏటీఎస్‌ఎల్‌, బీఈఎంఎల్‌, స్కూటర్స్ ఇండియా, భారత్‌ పంప్స్ కంప్రెసర్స్‌తో పాటు ఉక్కు దిగ్గజం సెయిల్‌కి చెందిన భద్రావతి, సేలం, దుర్గాపూర్ యూనిట్స్ కూడా  ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా దాదాపు రూ. 90,000 కోట్ల నిధుల సమీకరణ లక్ష్యాన్ని కేంద్రం నిర్దేశించుకుంది. పెట్టుబడులు, ప్రభుత్వాస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఇప్పటికే పవన్‌ హన్స్‌, భారత్ పంప్స్ అండ్ కంప్రెసర్స్‌, హిందుస్తాన్ ఫ్లూరోకార్బన్స్ మొదలైన సంస్థలకు గతేడాదే పీఐఎంలు జారీ చేసింది. పూర్తి స్థాయిలో అమ్మకానికి అనుమతులన్నీ సిద్ధంగా ఉన్న వాటిల్లో హిందుస్తాన్ న్యూస్‌ప్రింట్‌, హెచ్‌ఎల్‌ఎల్ లైఫ్ ‍కేర్‌, సెంట్రల్ ఎలక్ట్రానిక్స్‌, బ్రిడ్జ్ అండ్ రూఫ్ ఇండియా మొదలైనవి ఉన్నాయి. You may be interested

ఐటీసీ ఫలితాలు ఎలా ఉండొచ్చు?

Monday 13th May 2019

ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం ఐటీసీ సోమవారం ఫలితాలు ప్రకటించనుంది. ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు, అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.. - ఐసీఐసీఐ డైరెక్ట్‌: నికర లాభం పదిశాతం పెరిగి రూ. 3226.5 కోట్లకు చేరవచ్చు. నికర విక్రయాల్లో 8.3 శాతం వృద్ధి ఉండొచ్చు. ఎబిటాలో 9.9 శాతం మెరుగుదల అంచనా.  - కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌: స్టాండలోన్‌ లాభం 7.8 శాతం పెరిగి రూ. 3160.4 కోట్లకు చేరవచ్చు. నికర విక్రయాల్లో 7.4 శాతం, ఎబిటాలో

ఒడిదుడుకుల వారం..!

Monday 13th May 2019

- చైనా ఉత్పత్తుల‌పై భారీగా సుంకాన్ని పెంచిన అమెరికా - అమెరికా–ఇరాన్‌ల మధ్య కమ్ముకుంటున్న యుద్ధమేఘాలు  - సోమవారం సీపీఐ, మంగళవారం డబ్ల్యూపీఐ ద్రవ్యోల్బణ గణాంకాలు - డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఐటీసీ, యూపీఎల్‌, హిందాల్కో, బజాజ్‌ ఆటో ఫలితాలు ఈవారంలోనే.. ముంబై: అంతర్జాతీయ పరిణామాలు, కొనసాగుతున్న సార్వత్రిక ఎన్నికల వేడి, స్థూల ఆర్థిక అంశాల నేపథ్యంలో.. ఈవారం మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు అంచనావేస్తున్నాయి. ‘చైనా ఉత్పత్తుల‌పై అమెరికా

Most from this category