News


కార్మికులకు కనీస పెన్షన్‌ రూ.2,000?

Monday 28th January 2019
news_main1548700155.png-23856

ఉద్యోగుల పెన్షన్‌ స్కీమ్‌ (ఈపీఎస్‌) కింద ఇస్తున్న కనీన పింఛన్‌ను రూ.2,000 చేసే అంశాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సభ్యులు ఈపీఎస్‌లో భాగమన్న విషయం తెలిసిందే. కనీసం పదేళ్ల సర్వీసు ఉండి, రిటైర్‌ అయిన కార్మికులకు ఈపీఎఫ్‌వో పరిధిలోని ఈపీఎస్‌ పథకం కింద పెన్షన్‌ అందుతుంది. అత్యున్నత స్థాయిలోని కమిటీ కనీస పెన్షన్‌ పెంపు ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. దీన్ని కేంద్ర ఆర్థిక శాఖ తీవ్రంగా పరిశీలిస్తున్నట్టు కమిటీ సభ్యులు మీడియాకు సమాచారం ఇచ్చారు. 

 

ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీమ్‌ (ఎన్‌పీఎస్‌) కింద పెన్షన్‌ అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.9,000 కోట్లను వ్యయం చేస్తోంది. తాజా ప్రతిపాదనను ఆమోదిస్తే ఈ వ్యయం ఏటా రూ.12,000 కోట్లకు పెరుగుతుంది. అధిక పెన్షన్‌ రూపేణా పడే భారాన్ని ప్రస్తుత నిధుల పరిమాణంతో భరించడం కష్టమేనని ఈ కమిటీలో ఓ సభ్యుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే, దీనిపై నిర్ణయం కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో ఉందని, ప్రభుత్వం అదనపు భారం భరిస్తే సానుకూల నిర్ణయం తీసుకోవచ్చని తెలిపాయి. కార్మిక శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ప్రభుత్వం గేతడాది ఓ కమిటీని ఏర్పాటు చేసి, పెన్షణ్‌ అంశంపై సమీక్ష చేసి నివేదిక ఇవ్వాలని కోరినట్టు ఆ వర్గాలు తెలిపాయి. 

 

ఉద్యోగులు అధిక పెన్షన్‌ కోరుకునేట్టు అయితే, తమ ప్రావిడెంట్‌ ఫండ్‌ కిట్టీ నుంచి పెన్షన్‌ ప్రయోజనాలను రిటైరయ్యేంత వరకు ఉపసంహరించుకోకుండా ఆర్థిక శాఖ నియంత్రణ విధించొచ్చని కమిటీలోని ఓ సభ్యడు తెలిపారు. ఈపీఎస్‌ కింద 60 లక్షల మంది పెన్షనర్లు ఉండగా, ఇందులో 40 లక్షల మంది ప్రతీ నెలా రూ.1,500 కంటే తక్కువే పెన్షన్‌ అందుకుంటున్న పరిస్థితి ప్రస్తుతం ఉంది. ఈ 40 లక్షల మందిలోనూ 18 లక్షల మంది కనీస పెన్షన్‌ రూ.1,000 పొందతున్న లబ్ధిదారులు కావడం గమనార్హం. ప్రభుత్వం వద్ద రూ.3 లక్షల కోట్ల పెన్షన్‌ నిధులు ఉన్నాయి. కనీస పెన్షన్‌ను రూ.3,000 నుంచి 7,500 మధ్య నిర్ణయించాలంటూ కార్మిక సంఘాలు, అఖిల భారత ఈపీఎస్‌95 పెన్షనర్ల సంఘర్షణ సమితి డిమాండ్‌ చేస్తున్నాయి. ఈపీఎస్‌ కింద ఇస్తున్న పెన్షన్‌ కనీస అవసరాలకు కూడా చాలడం లేదని పార్లమెంటరీ ప్యానెల్‌ సైతం స్పష్టం చేసింది. ఈపీఎఫ్‌ సభ్యుల మూల వేతనం, డీఏలో 12 శాతం ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు వెళుతుంది. ఉద్యోగ సంస్థ సమకూర్చే 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌ ఖాతాకు, 3.67 ఉద్యోగుల భవిష్య నిధి ఖాతాకు వెళతాయి. You may be interested

మంగళవారం వార్తల్లోని షేర్లు

Tuesday 29th January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా మంగ‌ళ‌వారం ప్రభావితమ‌య్యే షేర్ల వివ‌రాలు పెర్సిస్టెంట్ సిస్టమ్స్:- రూ.225 కోట్ల బై-బ్యాక్ ఇష్యూకు బోర్డు ఆమోదం తెలిపింది. ఐఎల్‌&ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేష‌న్స్‌:- ద్రవ్యకొర‌త కార‌ణంగా ఎన్‌సీడీల‌పై డిబెంచ‌ర్ల హోల్డర్లకు చెల్లించాల్సిన వ‌డ్డీని చెల్లించ‌డంలో విఫ‌ల‌మైంది. నెట్‌వ‌ర్క్ 18 మీడియా అండ్ ఇన్వెస్ట్‌మెంట్‌:- కంపెనీ రూ.1000 కోట్ల రుణ స‌దుపాయాల‌కు ప్రముఖ రేటింగ్ సంస్థ ఇక్రా ఎఎఎ(స్టిరత్వం) రేటింగ్‌ను కేటాయించింది. న్యూజెన్ సాఫ్ట్‌వేర్ టెక్నాల‌జీస్‌:- ఉత్తర‌ప్రదేశ్‌లో నోయిడాలోని నూతన కార్యాల‌య భ‌వన నిర్మాణానికి 4,067

ఎన్నికల ముఖచిత్రం మారుతోందా... మరి మార్కెట్ల పరిస్థితి?

Monday 28th January 2019

దేశంలో అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌లో మారుతున్న సమీకరణాలు... ఇన్వెస్టర్లలో అప్పుడే ఆందోళన కలిగిస్తున్నాయి. కేంద్రంలో అస్థిర ప్రభుత్వం ఏర్పడే అవకాశాల సంకేతాలు, ఇటీవలి కీలక రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి దేశీయ, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులపై ఒత్తిడికి దారితీయవచ్చని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. ప్రభుదాస్‌ లీలాధర్‌ మార్కెట్‌ పట్ల అప్రమత్త ధోరణి వ్యక్తం చేసింది. హంగ్‌ ప్రభుత్వం, బలహీన భాగస్వాములతో ఏర్పడవచ్చని... థర్డ్‌ ఫ్రంట్‌ ఆధ్వర్యంలోని ప్రభుత్వం అయితే, ప్రతీ

Most from this category