News


ప్రభుత్వ బ్యాంకులకు యథావిధిగా కేంద్రం నిధులు

Saturday 24th November 2018
news_main1543044904.png-22363

న్యూఢిల్లీ: బాసెల్‌-3 నిబంధనలకు అనుగుణంగా మూలధన అవసరాలను చేరుకునే విషయంలో ఆర్‌బీఐ మరో ఏడాది పాటు గడువును సడలించినప్పటికీ... ప్రభుత్వరంగ బ్యాంకులకు యథావిధిగా కేంద్ర ప్రభుత్వం నుంచి మూలధన సాయం అందుతుందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. కాకపోతే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మిగిలిన కాలంలో ఈ మొత్తం రూ.15,000-20,000 కోట్లకు తగ్గుతుందని పేర్కొన్నాయి. గతేడాది అక్టోబర్‌లో ప్రకటించిన నిధుల సాయం ప్రణాళిక పరంగా ఎటువంటి తగ్గింపు ఉండదని స్పష్టం చేశాయి. నిధుల సాయం ప్రభుత్వరంగ బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని పేర్కొన్నాయి. ప్రతీ బ్యాంకుకు సంబంధించి అవసరాలను మదింపు చేసిన అనంతరం ఈ నెలాఖరు నాటికి నిధుల సాయం ప్రణాళికను కేంద్ర ఆర్థిక శాఖ ఖరారు చేయవచ్చని తెలిపాయి. బ్యాంకుల మూలధన పరిరక్షణ నిధి (సీసీ) ప్రస్తుతం 1.875గా ఉండగా, 2.5 శాతానికి 2019 మార్చి నాటికి చేరుకోవాలన్నది నిబంధన. దీన్ని 2020 మార్చి నాటికి ఇటీవల ఆర్‌బీఐ పొడిగించింది. దీంతో ప్రభుత్వరంగ బ్యాంకులకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.35,000 కోట్ల మేర నిధుల అవసరాలు తగ్గనున్నాయి.



You may be interested

పీసీఏతో ఆబ్యాంకులకు అంతా అయిపోలేదు

Saturday 24th November 2018

ముంబై: మొండిబకాయిల (ఎన్‌పీఏ) భారంతో కూరుకుపోయిన 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) దిద్దుబాటు చర్యల ప్రక్రియ (పీసీఏ) కిందకు వెళ్లాయి. అయితే దీనితో రుణాల మంజూరీకి సంబంధించి ఆ బ్యాంకుల పని  అయిపోయినట్లేనని భావించవద్దని అమెరిన్‌ బ్రోకరేజ్‌ సంస్థ- జఫ్రీస్‌ పేర్కొంది. 2015 మార్చిలో మొత్తం రిటైల్‌ రుణాల్లో ఈ 11 బ్యాంకుల వాటా 15 శాతం అయితే, 2018 సెప్టెంబర్‌లో ఈ

ఐటీ షేర్ల ర్యాలీకి అడ్డుపడిన రూపాయి..!

Saturday 24th November 2018

ముంబై: అమెరికా డాలర్‌తో రూపాయి మారకం విలువ 74 స్థాయికి చేరుకున్న సమయంలో జోరుమీద కొనసాగిన ఐటీ రంగ షేర్లు ప్రస్తుతం నష్టాలబాటలో ప్రయాణిస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచి క్రమంగా బలపడుతూ వచ్చిన రూపాయి మారకం విలువ గడిచిన ఏడు సెషన్లలోనూ వరుసగా బలపడి ఐటీ షేర్ల లాభాలను ఆవిరిచేసింది. గడిచిన ఏడు సెషన్లలో రూపాయి దాదాపు 2 శాతం మేర బలపడింది. క్రూడ్‌ ధరలు భారీగా తగ్గడం

Most from this category