STOCKS

News


ప్రభుత్వ బ్యాంకులకు మరో రూ.54,000 కోట్లు

Monday 5th November 2018
news_main1541393919.png-21704

న్యూఢిల్లీ: మొండిబకాయిల సమస్యతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ రంగ బ్యాంకు(పీఎస్‌బీ)లకు తగినంత మూలధనం సమకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తాజా త్రైమాసికంలో ఆయా బ్యాంకుల పనితీరు ఆధారంగా నిధులను ఇవ్వనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది రెండో విడత మూలధన నిధుల్లో భాగంగా రుణ వృద్ధి పెంచేందుకు... ప్రధానంగా చిన్న, మధ్య తరహా సంస్థ(ఎంఎస్‌ఎంఈ)లకు రుణాలే లక్ష్యంగా కేంద్రం చర్యలు చేపట్టనుంది. ఎంఎస్‌ఎంఈలకు రూ. కోటి వరకూ రుణాలను కేవలం 59 నిమిషాల్లో మంజూరు చేసేందుకుగాను ప్రత్యేక వెబ్‌సైట్‌ను ప్రధాన మంత్రి మోదీ ఇటీవలే ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి(క్యూ2)సంబంధించి పీఎస్‌బీల ఆర్థిక ఫలితాల వెల్లడి ఈ వారంలో(ఒకట్రెండు మినహా) పూర్తయ్యే అవకాశం ఉంది. దీని ఆధారంగా ఆర్థిక శాఖ ఆయా బ్యాంకులతో మూలధన నిధుల విషయమై చర్చలు జరపనున్నట్లు సమాచారం. పీఎస్‌బీల అవసరాలకు అనుగుణంగా నవంబర్‌ చివరికి లేదా డిసెంబర్‌ ప్రథమార్థంనాటికి దాదాపు రూ.54,000 కోట్ల మూలధనం విషయంలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడించాయి. రెండేళ్లలో పీఎస్‌బీలకు రూ.2.11 లక్షల మూలధన నిధులను ఇచ్చేందుకు గతేడాది అక్టోబర్‌లో కార్యాచరణను కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో రూ.1.35 లక్షల కోట్లను రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల ద్వారా సమకూర్చనుండగా... మిగతా నిధులను బ్యాంకులు మార్కెట్‌ నుంచి సమీకరించుకోవాల్సి ఉంటుంది. కాగా, ఈ రెండు మార్గాల్లో కాకుండా మిగతా మొత్తాన్ని(దాదాపు రూ.18,000 కోట్లు) కేంద్రం నేరుగా అందించనుంది. కాగా, ఇప్పటికే ఈ ప్రణాళికలో భాగంగా రూ.82,000 కోట్లను రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల ద్వారా పీఎస్‌బీలకు అందించింది. ఇటీవలే రూ.11,336 కోట్లను 5 పీఎస్‌బీలకు సమకూర్చింది. మరో రూ.54,000 కోట్ల తాజా మూలధనంపై కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుంది. 



You may be interested

త్వరలో టీసీఐఎల్‌ ఐపీవో

Monday 5th November 2018

న్యూఢిల్లీ: టెలికం రంగానికి సంబంధించి ఇంజనీరింగ్‌ అండ్‌ కన్సల్టెన్సీ సేవలు అందించే ‘టెలికమ్యూనికేషన్స్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌ (టీసీఐఎల్‌)’లో 25 శాతం వాటాను ఐపీవో ద్వారా విక్రయించాలని కేంద్ర ఆర్థిక శాఖ భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి-మార్చి క్వార్టర్లో ఐపీవో ఉండొచ్చని ఓ సీనియర్‌ అధికారి మీడియాకు తెలిపారు. నాలుగు ప్రభుత్వరంగ సంస్థలను లిస్ట్‌ చేయడంతోపాటు, టీసీఐఎల్‌ ఐపీవోకు సంబంధించి పని ఆరంభమైనట్టు చెప్పారు. ‘‘టీసీఐఎల్‌ ఐపీవోను ప్రస్తుత

మూడు నెలల్లో 76కి రూపాయి: యూబీఎస్‌

Monday 5th November 2018

ముంబై: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు అధిక స్థాయుల్లోనే కొనసాగే అవకాశాల నేపథ్యంలో రాబోయే మూడు నెలల్లో డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 76 స్థాయిని తాకొచ్చని స్విస్‌ బ్రోకరేజి సంస్థ యూబీఎస్ ఒక నివేదికలో పేర్కొంది. విదేశీ పెట్టుబడుల రాక తగ్గడం, అధిక క్రూడ్ రేట్లు తదితర అంశాల కారణంగా రూపాయి ఇప్పటికే 74 స్థాయిని తాకిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఇప్పటిదాకా రూపాయి మారకం విలువ

Most from this category