STOCKS

News


జీఎస్‌టీ ఐటీసీ ప్రయోజనానికి గడువు పొడిగింపు

Friday 4th January 2019
news_main1546575623.png-23401

న్యూఢిల్లీ: వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ)  ప్రారంభమైన మొదటి ఆర్థిక సంవత్సరానికి (2017-18) సంబంధించి  పరిశ్రమలు ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ క్లెయిమ్‌ (ఐటీసీ) చేసుకునేందుకు గడువును ఆర్థికశాఖ పొడిగించింది. ఈ గడువును ఈ ఏడాది మార్చి 2019 వరకూ పొడిగిస్తున్నట్లు ఒక ప్రకటన తెలిపింది. అయితే తమ సరఫరాదారు దాఖలు చేసిన రిటర్న్స్‌కు (జీఎస్‌టీఆర్‌-2ఏ- సరఫరాదారు దాఖలు చేసిన సేల్స్‌ రిటర్న్స్‌ ఆధారంగా సిస్టమ్స్‌ ఆటోమేటిక్‌గా సృష్టించేది)  సరిపోలితేనే ఐటీసీ క్లెయిమ్‌ సాధ్యమవుతుంది.  ఇప్పటివరకూ ఐటీసీ క్లెయిమ్‌ ప్రయోజనం పొందడానికి గడువు 2018 అక్టోబర్‌ 25. 2017 జూలై 1 నుంచీ జీఎస్‌టీ అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కాగా 2017 జూలై నుంచి మార్చి 2018 మధ్య ఫైనల్‌ సేల్స్‌ రిటర్న్‌ (జీఎస్‌టీఆర్‌-1)లో ఏదైనా తప్పు దొర్లితే దానిని సరిదిద్దుకోడానికి సీబీఐసీ (ప్రత్యేక్ష పన్నులు, సుంకాల కేంద్ర బోర్డ్‌) అనుమతిచ్చింది.



You may be interested

మల్టీ - బ్రాండ్‌లో ఎఫ్‌డీఐలు అనుమతించలేదు

Friday 4th January 2019

డీఐపీపీ వివరణ న్యూఢిల్లీ: ఈ-కామర్స్ రంగ నిబంధనలకు చేసిన సవరణల ప్రకారం దొడ్డిదారిలో మల్టీ-బ్రాండ్ రిటైల్‌లో ఎఫ్‌డీఐలకు అనుమతిచ్చినట్లు వస్తున్న వార్తలను కేంద్రం తోసిపుచ్చింది. ఇన్వెంటరీ ఆధారిత విధానంలో గానీ లేదా మల్టీ-బ్రాండ్ రిటైల్ రంగంలో గానీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు (ఎఫ్‌డీఐ) అనుమతించలేదని పారిశ్రామిక విధాన, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) గురువారం వివరణనిచ్చింది. ఈ-కామర్స్ సంస్థలు నిర్దేశిత నిబంధనలను అడ్డదారిలో ఉల్లంఘించకుండా ఉండేలా చూసేందుకే ఇటీవలి సవరణల ప్రధానోద్దేశమని పేర్కొంది.

మళ్లీ అగ్రస్థానానికి హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌

Friday 4th January 2019

నిర్వహణ ఆస్తుల్లో ఈ కంపెనీదే పైచేయి -వెల్లడించిన ఆంఫి న్యూఢిల్లీ: అతి పెద్ద మ్యూచువల్‌ ఫండ్‌ కంపెనీగా హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ నిలిచింది. నిర్వహణ ఆస్తుల పరంగా ఇప్పటివరకూ అగ్రస్థానంలో ఉన్న ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ మ్యూచువల్‌ ఫండ్‌ను తోసిరాజని హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ ఈ స్థానానికి దూసుకువచ్చింది. దాదాపు రెండేళ్ల అనంతరం ఈ కంపెనీ ఈ ఘనతను సాధించింది. ఆంఫి (అసోసియేషన్‌ ఆఫ్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ ఇన్‌ ఇండియా) వెల్లడించిన వివరాల ప్రకారం.., -గత

Most from this category