STOCKS

News


వడ్డీ రేట్లు తగ్గించాలి

Friday 18th January 2019
news_main1547789573.png-23654

- ద్రవ్య లభ్యత పరిస్థితులను మెరుగుపరచాలి
- అప్పుడే వృద్ధికి బలం
- ఆర్‌బీఐకి సీఐఐ, ఫిక్కీ సూచనలు

న్యూఢిల్లీ: దేశ వృద్ధి రేటుకు ఊతమిచ్చేందుకు కీలకమైన వడ్డీ రేట్లను, నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించాలని దేశ పారిశ్రామిక సంఘాలు ఆర్‌బీఐని కోరాయి. కీలకమైన మానిటరీ పాలసీ సమీక్షకు ముందు దేశ పారిశ్రామిక ప్రతినిధులతో ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంతదాస్‌ గురువారం ముంబైలో సమావేశమై వారి అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. ద్రవ్యోల్బణం కనిష్ట స్థాయికి దిగొచ్చినందున రుణాలపై అధిక వ్యయాలను తగ్గించాలని, కఠిన ద్రవ్య లభ్యత పరిస్థితులను సులభతరం చేసే దిశగా చర్యలు చేపట్టాలని పారిశ్రామికవేత్తలు ఈ సందర్భంగా కోరారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి ఆరవ ద్వైమాసిక పాలసీ సమీక్ష ఫిబ్రవరి 7న జరగనుంది. ప్రస్తుతం సీఆర్‌ఆర్‌ 4 శాతం (బ్యాంకు డిపాజిట్లలో ఆర్‌బీఐ వద్ద ఉంచాల్సిన నిష్పత్తి), రెపో రేటు 6.5 శాతంగా (బ్యాంకులకు ఆర్‌బీఐ ఇచ్చే రుణాలపై రేటు) ఉన్నాయి.
సీఐఐ సూచనలు ఇవీ...
‘‘నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌)ని కనీసం అర శాతమయినా తగ్గించాలి. ద్రవ్యోల్బణం స్థిరంగా కనిష్ట స్థాయిల్లో కొనసాగుతున్నందున రెపో రేటును సైతం అరశాతం తగ్గించడాన్ని పరిశీలించాలి. తద్వారా రుణాలపై అధిక వ్యయ భారాన్ని తగ్గించాలి. ఎంఎస్‌ఎంఈ, ఇన్‌ఫ్రా రంగానికి రుణ సదుపాయాన్ని పెంచాలి’’ అని సీఐఐ సూచించింది. ద్రవ్యలభ్యత పెంపునకు ఆర్‌బీఐ తీసుకున్న చర్యలను ప్రశంసించింది. ఎంఎస్‌ఎంఈ రంగం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లను పరిష్కరించేందుకు, బ్యాంకులు కోరే అదనపు హామీలను పరిమితం చేసే అంశాన్ని పరిశీలించాలని కోరింది. సరైన హామీలు ఇచ్చినప్పుడు వ్యక్తిగత హామీలు ఇవ్వాల్సిన అవసం లేకుండా చూడాలని కోరింది. సీఐఐ ప్రెసిడెంట్‌ డిసిగ్నేట్‌ ఉదయ్‌ కోటక్‌ ఆధ్వర్యంలో ఈ సూచనలు చేశారు. కొనుగోలు దారులకు క్రెడిట్‌ సదుపాయం కల్పించే లెటర్స్‌ ఆఫ్‌ అండర్‌టేకింగ్‌లను (ఎల్‌ఓయూ) ఎంఎస్‌ఎంఈలకు కూడా జారీ చేసేలా బ్యాంకులను ఆదేశించాలని కోరింది. బలహీన బ్యాంకుల విషయంలో కచ్చితమైన దిద్దుబాటు కార్యాచరణను పునఃసమీక్షించాలని, కనీసం ఆయా బ్యాంకులను నేషనల్‌ హౌసింగ్‌ బ్యాంకుకు రుణాలిచ్చేందుకు అయినా అనుమతించాలని కోరింది. దీనివల్ల హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలకు నిధుల లభ్యత పెరుగుతుందని అభిప్రాయపడింది.
వృద్ధిని కూడా చూడాలి...
రెపో రేటు, సీఆర్‌ఆర్‌ను తగ్గించాలని మరో పారిశ్రామిక సంఘం ఫిక్కీ కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ను కోరింది. దీని వల్ల దేశంలో పెట్టుబడులు పుంజుకుంటాయని, వినియోగాన్ని పెంచి వృద్ధికి తోడ్పడతాయని ఫిక్కీ ప్రెసిడెంట్‌ సందీప్‌ సోమాని పేర్కొన్నారు. ‘‘వృద్ధిపై దృష్టి సారించేలా సర్దుబాటుతో కూడిన మానిటరీ పాలసీ అవసరం. మానిటరీ పాలసీ ఉద్దేశ్యాలు కేవలం ధరల స్థిరత్వానికే పరిమితం కాకూడదు. వృద్ధి రేటు, కరెన్సీ మారకం స్థిరత్వానికి కూడా అవసరమే’’ అని సందీప్‌ సోమాని సూచించారు.You may be interested

భవిష్యత్తు ఏఐ ప్రకటనలదే

Friday 18th January 2019

వీక్షకుల మూడ్‌ను బట్టి యాడ్స్‌ రూ.61 వేల కోట్లను దాటిన అడ్వర్టయిజింగ్‌ పరిశ్రమ ఐఏఏ చైర్మన్, వరల్డ్‌ ప్రెసిడెంట్‌ శ్రీనివాసన్‌ స్వామి   హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: వార్తా పత్రికలు, రేడియో, టెలివిజన్, ఇంటర్నెట్, మొబైల్స్‌.. ఇదీ సింపుల్‌గా అడ్వర్టయిజింగ్‌ మాధ్యమాల వరుస క్రమం! కానీ ఇపుడు ఈ జాబితాలో ఆర్టిఫిషల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) చేరుతోంది. ఇప్పటికే పలు అంతర్జాతీయ బ్రాండ్లు ఏఐ ఆధారిత ప్రకటనలపై పరిశోధన చేస్తున్నాయని, కొన్ని సంస్థలు త్వరలోనే దేశంలో

పెట్రోలియం వ్యాపారంలోకి అదానీ గ్రూపు

Friday 18th January 2019

- జర్మన్‌ సంస్థ బీఏఎస్‌ఎఫ్‌తో జట్టు - రూ.16,000 కోట్లతో ముంద్రాలో కెమికల్‌ ప్లాంటు న్యూఢిల్లీ: గౌతం అదానీకి చెందిన అదానీ గ్రూపు పెట్రో కెమికల్స్‌ రంగంలోకి అడుగుపెడుతోంది. జర్మనీ దిగ్గజ కంపెనీ బీఏఎస్‌ఎఫ్‌తో కలసి గుజరాత్‌లోని ముంద్రా జిల్లాలో 2 బిలియన్‌ యూరోలతో (రూ.16,000 కోట్లతో) పెట్రో కెమికల్‌ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఇరు సంస్థలు ఈ మేరకు గురువారం ‘వైబ్రంట్‌ గుజరాత్‌ గ్లోబల్‌ సమ్మిట్‌ 2019’ వేదికగా అవగాహన

Most from this category