News


టోకు ధరలూ పెరిగాయ్‌!

Friday 15th March 2019
Markets_main1552622083.png-24617

న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణంతోపాటు టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణమూ ఫిబ్రవరిలో స్వల్పంగా పెరిగింది. ఫిబ్రవరిలో (2018 ఫిబ్రవరితో పోల్చి) టోకు వస్తువుల బాస్కెట్‌ ధరల స్పీడ్‌ 2.93 శాతంగా ఉంది. ఈ ఏడాది జనవరిలో టోకు ద్రవ్యోల్బణం 2.76 శాతం ఉంటే,  2018 ఫిబ్రవరిలో 2.74 శాతంగా నమోదయ్యింది. కూరగాయలు, తృణధాన్యాలుసహా ఆహార వస్తువుల ధరల్లో పెరుగుదల తాజా గణాంకాలపై ప్రభావం చూపింది. ఈ వారం ప్రారంభంలో వెలువడిన రిటైల్‌ ద్రవ్యో‍ల్బణం కూడా నాలుగు నెలల గరిష్ట స్థాయి 2.57 శాతానికి పెరిగిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం గురువారం విడుదల చేసిన గణాంకాలను పరిశీలిస్తే...
- ఆహార ఉత్పత్తులకు సంబంధించి ‍టోకు ద్రవ్యోల్బణం ఫిబ్రవరిలో 4.28 శాతానికి చేరింది. జనవరిలో ఈ స్పీడ్‌ 2.34 శాతమే. నెలవారీగా చూస్తే, తృణధాన్యాలు, ధాన్యం, గోధుమలు, పప్పు ధాన్యాలు, కూరగాయలు, పండ్లు గుడ్లు, మాంసం, చేపల వంటి ఇతర ప్రొటీన్‌ ఆధారిత ఉత్పత్తుల ధరలు పెరిగాయి.
- ఫ్యూయెల్‌ అండ్‌ పవర్‌ విభాగంలో రేటు జనవరిలో 1.85 శాతం ఉంటే, ఫిబ్రవరిలో 2.23 శాతానికి చేరింది. 
- కాగా డిసెంబర్‌ టోకు ద్రవ్యోల్బణాన్ని తొలి అంచనా 3.8 శాతం నుంచి 3.46 శాతానికి తగ్గింది.  

ఆర్‌బీఐ నిర్ణయంపై దృష్టి...
ఇటు టోకు ద్రవ్యోల్బణం... అటు రిటైల్‌ ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ, ఇవి రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత లక్ష్యాల మేరకు ఉండడం వల్ల (ప్లస్‌ లేదా మైనస్‌ 2తో 4 శాతం వద్ద) రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం) తగ్గింపు దిశగానే ఆర్‌బీఐ అడుగులు వేయవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు.   వృద్ధికి ఊతం అందించడంలో భాగంగా  ఆర్‌బీఐ సరళతర వడ్డీరేట్ల విధానానికి మొగ్గు చూపుతుందన్నది వారి విశ్లేషణ.  పారిశ్రామిక ఉత్పత్తి  సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు జనవరిలో కేవలం 1.7 శాతంగా నమోదయిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. తయారీ, క్యాపిటల్‌, వినియోగ వస్తువుల రంగాలూ పూర్తిగా నిరాశాజనకంగా ఉండడాన్ని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 



You may be interested

పాజిటివ్‌ స్టార్ట్‌

Friday 15th March 2019

అమెరికా-చైనాల మధ్య వాణిజ్య ఒప్పందం ఖరారయ్యిందనేవార్తలతో ఆసియా మార్కెట్లు జోరుగా పెరిగిన నేపథ్యంలో నాలుగురోజులపాటు పెద్ద ర్యాలీ జరిపిన భారత్‌ సూచీలు శుక్రవారం సైతం పాజిటివ్‌గా ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 100 పాయింట్ల లాభంతో 37,855 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో 11376 పాయింట్ల వద్ద మొదలయ్యింది. కొద్ది నిముషాల్లోనే 10,400పైకి నిఫ్టీ ఎగబాకడం విశేషం. కొటక్‌ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్లు

ఎగరని విమానాలు.. చార్జీలకు రెక్కలు

Friday 15th March 2019

- 25 శాతం దాకా పెరిగే అవకాశం - 20 శాతం విమానాలను నిలిపివేసిన ఎయిర్‌లైన్స్‌ - పైలట్ల కొరత, ఇంజిన్ల సమస్యలు మొదలైన అంశాలు కారణం న్యూఢిల్లీ: పలు సమస్యలతో దేశీ ఎయిర్‌లైన్స్‌ పెద్ద సంఖ్యలో విమానాలను నిలిపివేయాల్సి వస్తుండటంతో.. విమాన ప్రయాణ చార్జీలు గణనీయంగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్వల్పకాలికంగా చార్జీలు 25 శాతం దాకా పెరగవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. వివిధ కారణాలతో ఇండిగో, జెట్‌ ఎయిర్‌వేస్, స్పైస్‌జెట్‌ దగ్గరున్న వాటిలో

Most from this category