STOCKS

News


మళ్లీ ‘జారుడు బల్ల’పై ఎగుమతుల విలువ!

Tuesday 16th October 2018
news_main1539665861.png-21191

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు సెప్టెంబర్‌లో మళ్లీ పడిపోయాయి. 2017 సెప్టెంబర్‌తో పోల్చితే 2018 సెప్టెంబర్ ఎగుమతుల్లో అసలు వృద్ధి నమోదుకాలేదు. ఈ విలువ -2.15 శాతం క్షీణించింది. మార్చి (-0.66 శాతం)  తరువాత ఎగుమతులు క్షీణతలోకి జారడం ఇదే తొలిసారి. ఇదే ధోరణి మున్ముందూ కొనసాగితే, దేశ కరెంట్‌ అకౌంట్‌ లోటు (క్యాడ్‌- ఒక నిర్దిష్ట సంవత్సరంలో దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య నికర వ్యత్యాసం) మరింత తీవ్రమై, డాలర్‌ మారకంలో రూపాయి విలువ మరింత క్షీణించే అవకాశం ఉంది. అంతర్జాతీయ వాణిజ్య పరిస్థితులు కూడా అనిశ్చితిగా ఉండడం ఇక్కడ గమనార్హం.  ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు...

♦ సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ 27.95 బిలియన్‌ డాలర్లు. 2017 ఇదే నెలలో ఈ విలువ 28.56 బిలియన్‌ డాలర్లు. 
♦ దిగుమతులు 10.45 శాతం పెరిగాయి. విలువ రూపంలో 37.9 బిలియన్‌ డాలర్ల నుంచి 41.9 బిలియన్‌ డాలర్లకు పెరిగింది. 
♦ సెప్టెంబర్‌లో ఎగుమతులు-దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 13.98 బిలియన్‌ డాలర్లు. గడచిన ఐదు నెలల్లో ఇది కనిష్టస్థాయి. చమురు ధరలు తీవ్ర స్థాయిలో ఉన్నా... వాణిజ్యలోటు తగ్గడం గమనార్హం.
♦ సెప్టెంబర్‌లో ఎగుమతులకు సంబంధించి మంచి వృద్ధిని నమోదుచేసుకున్న రంగాల్లో పెట్రోలియం ప్రొడక్టులు, ఆర్గానిక్‌, ఇన్‌ఆర్గానిక్‌ కెమికల్స్‌, ఔషధ రంగాలు ఉన్నాయి. 
 ♦ ఇక ఏప్రిల్‌-ఆగస్టు మధ్య ఎగుమతుల విలువలో 12.54 శాతం వృద్ధి నమోదయ్యింది. దిగుమతుల్లో వృద్ధి 16.16 శాతం. ఇక ఏప్రిల్‌-సెప్టెంబర్‌ మధ్య వాణిజ్యలోటు 94.32 బిలియన్‌ డాలర్లు. 
ఆందోళన అక్కర్లేదు...
2017 సెప్టెంబర్లో హై బేస్‌ ఎఫెక్ట్‌ వల్ల 2018 సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ తగ్గినట్లు గణాంకాలు వచ్చాయి. 2017 సెప్టెంబర్‌లో ఎగుమతుల వృద్ధి అసాధారణ రీతిలో 26 శాతంగా నమోదయ్యింది. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) అమలు గడువు ముగింపు నేపథ్యంలో జరిగిన భారీ ఎగుమతులు దీనికి కారణం. ఈ పరిస్థితుల్లో తాజాగా వచ్చిన గణాంకాలను తాత్కాలికమైన ధోరణిగానే పరిగణించవచ్చు. ఎగుమతులు మళ్లీ మంచి వృద్ధి రేటుకు చేరుకోవడం ఖాయం. అక్టోబర్‌ నుంచే ఈ పరిస్థితి ఉంటుంది. ఆర్థిక సంవత్సరం ఆరు నెలల్లో వృద్ధి ధోరణి మున్ముందూ కొనసాగుతుంది.



You may be interested

ఈ-కామర్స్‌ అమ్మకాలు రూ.15,000 కోట్లు

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ: దేశీ ఈ-కామర్స్‌ సంస్థలు పండుగ సీజన్‌ అమ్మకాలలో సంచలనం సృష్టించాయి. గడిచిన 5 రోజుల ఫెస్టివల్‌ సేల్స్‌లో ఏకంగా 64 శాతం వృద్ధిరేటును సాధించినట్లు రెడ్‌సీర్‌ కన్సెల్టింగ్‌ సంస్థ వెల్లడించింది. ఈ సంస్థ నివేదిక ప్రకారం అక్టోబర్ 9 నుంచి 14 వరకు కొనసాగిన పండుగ సీజన్‌ ఆఫర్లలో రూ.15,000 కోట్లు అమ్మకాలు జరిగాయి. గతేడాది ఇదే సమయంలో రూ.10,325 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. మరోవైపు ఈ సీజన్‌లో

డేటా స్టోరేజ్‌ నిబంధనలను అనుగుణంగా 80% కంపెనీలు

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన డేటా లోకలైజేషన్‌ (భారత్‌లోని సమాచారం ఇక్కడే భద్రపర్చడం) నిబంధనలకు అనుగుణంగా ఇప్పటివరకు 80 శాతం కంపెనీలు ఇక్కడే డేటాను భద్రపరుస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడైంది. ఈ నిబంధనలకు అక్టోబరు 15 (సోమవారం) తుది గడువు కాగా, పలు డెబిట్‌/క్రెడిట్‌ కంపెనీలు మినహాయించి దాదాపు మిగిలిన అన్ని కంపెనీలు భారత్‌లోనే డేటాను భద్రపరుస్తున్నట్లు తేలింది. ఇప్పటికే ఈ సంస్థలు పలు

Most from this category