News


ఎగుమతులు పెరిగినా.. వాణిజ్యలోటు భయాలు

Friday 16th November 2018
news_main1542348659.png-22087

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు అక్టోబర్‌లో (2017 అక్టోబర్‌తో పోల్చి) 17.86 శాతం పెరిగాయి. విలువ రూపంలో చూస్తే 26.98 బిలియన్‌ డాలర్లు. అయితే ఇదే కాలంలో దిగుమతులు భారీగా 17.62 శాతం పెరిగి 44.11 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి ఎగుమతులు-దిగుమతులకు మధ్య నికర వ్యత్యాసం 17.13 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. అక్టోబర్‌లో వాణిజ్యలోటు 14.61 బిలియన్‌ డాలర్లు.  గురువారం వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే...

♦ గత ఏడాది అక్టోబర్‌లో మరీ తక్కువ ఎగుమతులు జరగడం (బేస్‌ఎఫెక్ట్‌) ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో వృద్ధి రేటు భారీగా కనబడ్డానికి కారణమని ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా ఎక్స్‌పోర్ట్‌ ఆర్గనైజేషన్స్‌, ఇంజనీరింగ్‌ ఎక్స్‌పోర్ట్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ప్రతినిధులు వ్యాఖ్యానించడం గమనార్హం. 
♦ అక్టోబర్‌లో ఎగుమతులు పెరిగినా, నెలవారీగా చూస్తే తగ్గాయి. సెప్టెంబర్‌లో ఎగుమతుల విలువ 27.95 బిలియన్‌ డాలర్లు. 
♦ అక్టోబర్‌ ఎగుమతుల్లో మంచి ఫలితాలను సాధించిన రంగాల్లో పెట్రోలియం (49.3 శాతం), ఇంజనీరింగ్‌ (8.87 శాతం), రసాయనాలు (34 శాతం) ఫార్మా (13 శాతం), రత్నాలు, ఆభరణాలు (5.5 శాతం) వంటివి ఉన్నాయి. 
♦ అయితే కాఫీ, బియ్యం, పొగాకు, జీడిపప్పు, ఆయిల్‌సీడ్స్‌సహా పలు వ్యవసాయ సంబంధ ఉత్పత్తుల ఎగుమతులు ప్రతికూలతను నమోదుచేసుకున్నాయి. 
♦ అక్టోబర్‌లో చమురు దిగుమతులు 52.64 శాతం పెరిగి 14.21 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతులు 6 శాతం పెరిగి 29.9 బిలియన్‌ డాలర్లు పెరిగాయి.

ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య...
కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌-అక్టోబర్‌ మధ్య ఎగుమతులు 13.27 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 191 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు ఇదే కాలంలో 16.37 శాతం పెరిగి 302.47 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. వెరసి రెండింటి మధ్యా నికర వ్యత్యాసం- వాణిజ్యలోటు 111.47 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో వాణిజ్యలోటు 91.28 బిలియన్‌ డాలర్లు. కాగా ఏప్రిల్‌- అక్టోబర్‌ మధ్య చమురు దిగుమతులు 50.48 శాతం పెరిగి 83.94 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.
------------- 

 భారీగా తగ్గిన పసిడి దిగుమతులు
మరోవైపు అక్టోబర్‌లో పసిడి దిగుమతులు భారీగా 42.9 శాతం తగ్గాయి. విలువలో 1.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో పసిడి దిగుమతుల విలువ 2.95 బిలియన్‌ డాలర్లు. డాలర్‌ మారకంలో రూపాయి విలువ పడిపోవడం పసిడి డిమాండ్‌ను తగ్గించింది. ఇది ‍కరెంట్‌ అకౌంట్‌లోటుకు ప్రతికూల అంశమే. ఆభరణాల పరిశ్రమ నుంచి ప్రధానంగా పసిడికి డిమాండ్‌ ఉంది. ఆభరణాల పరిశ్రమ నుంచి ఎగుమతులు ఈ నెల్లో 5.5 శాతం పెరిగాయి. విలువ రూపంలో ఇది 34.9 బిలియన్‌ డాలర్లు. 
---------------

సెప్టెంబర్‌లో 19 శాతం పెరిగిన సేవలు...
ఇదిలావుండగా, సెప్టెంబర్‌కు సంబంధించి సేవల రంగం గణాంకాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసింది. ఈ నెలలో సేవల ఎగుమతులు 19 శాతం పెరిగాయి. విలువ రూపంలో 16.38 బిలియన్‌ డాలర్లు. దిగుమతులు 18 శాతం పెరిగాయి. విలువ 9.95 బిలియన్‌ డాలర్లు. ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకూ భారత్‌ సేవల ఎగుమతులు విలువ 101.07 బిలియన్‌ డాలర్లు. ఇదే కాలంలో దిగుమతుల విలువ 62.57 బిలియన్‌ డాలర్లు. 



You may be interested

ఇన్ఫోసిస్‌ తాత్కాలిక సీఎఫ్‌వోగా జయేష్‌ సంగ్రజ

Friday 16th November 2018

న్యూఢిల్లీ: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌... తాత్కాలిక చీఫ్‌ ఫైనాన్షియల్‌ ఆఫీసర్‌గా (సీఎఫ్‌ఓ) జయేష్‌ సంగ్రజను  నియమించుకుంది. కంపెనీ తదుపరి సీఎఫ్‌వోను ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోందని స్టాక్‌ ఎక్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఎండీ రంగనాథ్‌ కంపెనీ సీఎఫ్‌వోగా ఆగస్ట్‌లో రాజీనామా చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. రంగనాథ్‌ రాజీనామా పరిశ్రమను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆయన రాజీనామాతో ఇన్ఫోసిస్‌ మేనేజ్‌మెంట్‌లో నిలకడపై సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి.

ఆల్‌టైమ్ గరిష్టానికి స్మార్ట్‌ఫోన్స్ అమ్మకాలు

Friday 16th November 2018

న్యూఢిల్లీ: ఈ ఏడాది జులై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ఆల్‌టైం గరిష్ట స్థాయికి చేరాయి. గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 9.1 శాతం వృద్ధితో 4.26 కోట్లుగా నమోదయ్యాయి. మొత్తం మొబైల్ ఫోన్ మార్కెట్లో ఫీచర్ ఫోన్స్‌కి సరిసమానంగా స్మార్ట్‌ఫోన్స్‌ 50 శాతం మేర వాటా సాధించడం ఇదే తొలిసారని రీసెర్చ్ సంస్థ ఐడీసీ వెల్లడించింది. చైనా స్మార్ట్‌ఫోన్స్ తయారీ సంస్థ షావోమి అత్యధికంగా 1.17 కోట్ల యూనిట్లు,

Most from this category