STOCKS

News


2019 బడ్జెట్‌పై నిపుణుల అంచనాలు

Tuesday 22nd January 2019
news_main1548179692.png-23736

కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ప్రవేశపెట్టే బడ్జెట్‌పై సామాన్యుల్లో ఎంతో ఆసక్తి నెలకొంది. ఎన్నికల ముందు బడ్జెట్‌ కావడంతో కచ్చితంగా ప్రజలను సంతోషపరిచే నిర్ణయాలు ఉంటాయన్న అంచనాలు ఎక్కువయ్యాయి. దేశంలో పెట్టుబడుల వాతావరణం ఏటేటా ఇనుమడిస్తుండడం, కొత్త ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్స్‌, స్టాక్‌ మార్కెట్ల వైపు అడుగులు వేస్తున్న పరిస్థితులను చూస్తున్నాం. ఈ క్రమంలో ఇన్వెస్టర్ల వర్గానికి మేలు చేసే నిర్ణయాలు ఉంటాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2019 బడ్జెట్‌ నుంచి ఏం ఆశించొచ్చ దానిపై పలువురి నిపుణుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి...

 

ఎస్టీటీ తొలగించొచ్చు...
ఇది ఎన్నికల సంవత్సరం. గ్రామీణ ప్రాంతానికి మరిన్ని ప్రయోజనాలు, పన్ను తగ్గింపులు ఉండొచ్చు. డెలివరీ ట్రేడ్లపై సెక్యూరిటీ లావాదేవీల పన్ను (ఎస్‌టీటీ) తొలగించడం లేదా కార్పొరేట్‌ పన్ను లేదా డివిడెండ్‌ పంపిణీ పన్ను తగ్గింపు అన్నవి మార్కెట్లకు ఉత్సాహాన్నిస్తాయి. ఈ మూడూ జరిగితే ఉత్తమంగా ఉంటుంది.

- ఏకే ప్రభాకర్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ రీసెర్చ్‌ హెడ్‌

 

ఎస్‌టీటీ తొలగిస్తే ప్రయోజనం
ఈ బడ్జెట్‌ ఎక్కువగా ప్రజామోదంగా ఉంటుంది. సాగు రుణాల మాఫీ, ఆదాయ పన్ను శ్లాబుల సరళీకరణ అన్నవి కీలకం. ఎస్‌టీటీ హేతుబద్ధీకరణ లేదా తొలగింపు అన్న డిమాండ్‌ చాలా ఏళ్ల నుంచి ఉంది. ఇది మార్కెట్‌ వ్యాప్తంగా ఇన్వెస్టర్లకు ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. ఫైనాన్షియల్‌ మార్కెట్లలో పాల్గొనే వారిలో ఎక్కువ మంది స్వల్ప కాలంలో ధరల పరంగా ఉన్న అంతరాల నుంచి లబ్ధి పొందడం ద్వారా జీవించే వారే. వీరిపై పన్ను భారం పడుతోంది. ఎస్‌టీటీ కారణంగా చిన్న ట్రేడర్లు దీర్ఘకాలం పాటు లాభాల్లోనే కొసాగడం సాధ్యం కాదు.

- నిఖిల్‌ కామత్‌, జెరోదా సహ వ్యవస్థాపకుడు 

 

మరిన్ని ఫండ్స్‌కు సెక్షన్‌ 80సీ అర్హత
ఈక్విటీ లింక్డ్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఫండ్స్‌లో పెట్టుబడులకు మాత్రమే సెక్షన్‌ 80సీ కింద ఆదాయపన్ను మినహాయింపు ప్రయోజనం ఉంది. లార్జ్‌క్యాప్‌ ఈటీఎఫ్‌ల్లో చేసే పెట్టుబడులకూ సెక్షన్‌ 80సీ ప్రయోజనం విస్తరించాలి. యాక్టివ్‌గా పనిచేసే ఈఎల్‌ఎస్‌ఎస్‌ వంటి వాటితో పోలిస్తే పాసివ్‌గా పనిచేసే ఈటీఎఫ్‌లతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. వీటిల్లో తక్కువ ఎక్స్‌పెన్స్‌ రేషియో ఇన్వెస్టర్లకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తుంది. 

- అనుగ్రహ్‌ శ్రీవాస్తవ, స్మాల్‌కేస్‌ టెక్నాలజీస్‌ సహ వ్యవస్థాపకుడు

 

సెక్షన్‌ 80సీ లిమిట్‌ రెట్టింపు చేయాలి
సెక్షన్‌ 80సీ కింద ఉన్న రూ.1.5 లక్షల పన్ను మినహాయింపును రెట్టింపు చేయాలి. మరింత మొత్తంలో వైద్య వ్యయాలపై మినహాయింపులు ఉండాలి. వృద్ధులకు హామీతో కూడిన ఆదాయాన్నిచ్చే పథకాలను ప్రవేశపెట్టాలి. ఎస్‌టీటీని రద్దు చేసి, జీఎస్టీపై ఒకటే 15 శాతం పన్ను రేటు గనుక తీసుకొస్తే అది ఈక్విటీ మార్కెట్‌కు జోష్‌నిస్తుంది.

- అభిజిత్‌ భావే, కార్వీ ప్రైవేటు వెల్త్‌ సీఈవోYou may be interested

బుధవారం వార్తల్లోని షేర్లు

Wednesday 23rd January 2019

వివిధ వార్తల‌కు అనుగుణంగా బుధ‌వారం ప్రభావిత‌మ‌య్యే షేర్ల వివ‌రాలు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్‌:- డెన్ నెట్‌వ‌ర్క్స్‌, హాత్‌వే కేబుల్స్ కంపెనీల కొనుగోలుకు కాంపీటీష‌న్ క‌మీష‌న్ ఆఫ్ ఇండియా అనుమ‌తినిచ్చింది. ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ ట్రాన్స్‌పోర్టేష‌న్ నెట్‌వ‌ర్క్స్‌:- కంపెనీలో ద్రవ్యకొర‌త కార‌ణంగా డిబెంచ‌ర్ హోల్డర్లకు జ‌న‌వ‌రి 22వ తేదిన వ‌డ్డీ చెల్లింపుల్లో విఫ‌ల‌మైంది. స‌చేతా మెట‌ల్స్‌:- వివిధ దేశాల నుంచి కంపెనీ మొత్తం రూ.40 కోట్ల విలువైన ఆర్డర్లను ద‌క్కించుకున్నట్లు కంపెనీ తెలిపింది. సైయెంట్‌:- త‌న అనుబంధ సంస్థ

ఫండ్స్‌ పెట్టుబడుల్లో సింహ భాగం ఈ రంగాలదే

Tuesday 22nd January 2019

మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు నిపుణుల పర్యవేక్షణలో పెట్టుబడులు పెట్టి రాబడులు పంచుతుంటాయి. అందుకే సాధారణ ఇన్వెస్టర్లు సరైన అవగాహన లేకుండా నేరుగా షేర్లలో ఇన్వెస్ట్‌ చేసి చేతులు కాల్చుకోకుండా, ఫండ్స్‌ను నమ్ముకోవడం మంచిదని ఆర్థిక సలహాదారులు సూచిస్తుంటారు. కాస్త విషయ పరిజ్ఞానం ఉన్న ఇన్వెస్టర్లు మాత్రం మ్యూచువల్‌ ఫండ్స్‌ మేనేజర్లు తీసుకునే పెట్టుబడి నిర్ణయాలను ఫాలో అయిపోతుంటారు. సొంతంగానే ఇన్వెస్ట్‌ చేసి రాబడులు తెచ్చుకోవాలనుకునే వారు మ్యూచువల్‌ పండ్స్‌ ఏ

Most from this category