STOCKS

News


టెలికంకు మరో మూడు త్రైమాసికాలు నష్ట కాలమే: సీవోఏఐ

Monday 15th October 2018
news_main1539581258.png-21151

న్యూఢిల్లీ: టెలికం రంగానికి మరో మూడు త్రైమాసికాల పాటు నష్టాలు తప్పవని సెల్యులర్‌ ఆపరేటర్స్‌ అసోసియేషన్‌ (సీవోఏఐ) తెలిపింది. అధిక లెవీలు, నిలకడలేని టారిఫ్‌లు నష్టం కలిగిస్తున్నట్టు పేర్కొంది. ‘‘ప్రస్తుతమున్న పరిస్థితుల ప్రకారం చూస్తే... కనీసం మరో మూడు క్వార్టర్లలో నష్టాలు ఉండనున్నాయి. ఎందుకంటే, ఈ పరిశ్రమ దీర్ఘకాల ఆరోగ్యం దృష్ట్యా ప్రస్తుత టారిఫ్‌లు దీర్ఘకాలం పాటు కొనసాగించడం సాధ్యం కాదన్నది నా అభిప్రాయం’’అని సీవోఏఐ డైరెక్టర్‌ జనరల్‌ రాజన్‌ మాథ్యూస్‌ అన్నారు. అధిక లైసెన్స్‌ ఫీజు, స్పెక్ట్రం వినియోగ చార్జీలు, రేడియో తరంగాలకు అప్‌ఫ్రంట్‌ చెల్లింపులు ఆపరేటర్ల ఇబ్బందులకు కారణమని చెప్పారు. ఆర్థిక పనితీరు పరంగా టెలికం పరిశ్రమకు 2018-19 చాలా కఠినమైన సంవత్సరంగా ఉంటుందన్నారు. ‘‘ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో రెండు త్రైమాసికాల్లో నష్టాలను చవిచూశాం. వచ్చే రెండు త్రైమాసికాల్లో నాటకీయంగా ఏదో జరగాల్సిందే. కానీ, అది జరగదని తెలుసు’’ అని మాథ్యూస్‌ పేర్కొన్నారు. 2016లో రిలయన్స్‌ జియో సేవల ఆరంభంతో పరిశ్రమ రూపురేఖలే మారిపోయిన విషయం తెలిసిందే. తొలుత డేటా, కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌లు అన్నీ ఉచితంగా అందించిన జియో, ఆ తర్వాత చాలా తక్కువ రేటుకే నెలవారీ, త్రైమాసిక డేటా, వాయిస్‌, ఎస్‌ఎంఎస్‌లతో కూడిన ప్లాన్లతో విధ్వంసం సృష్టిస్తూనే ఉంది. టారిఫ్‌లు ఇంకా తగ్గుతాయా లేక స్థిరపడతాయా? అన్న ప్రశ్నకు... ఇప్పటికే అందుబాటు ధరలకు చేరినట్టు చెప్పారు. 



You may be interested

మ్యూచువల్‌ ఫండ్స్‌ ‘సిప్‌’ పెట్టుబడుల్లో భారీ వృద్ధి

Monday 15th October 2018

న్యూఢిల్లీ: ఈక్విటీ మార్కెట్లు కరెక్షన్‌లో ఉన్నాగానీ ఇన్వెస్టర్లు రెట్టించిన ఉత్సాహంతో మ్యూచువల్‌ ఫండ్స్‌లోకి పెట్టుబడులు గుమ్మరించారు. మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు సెప్టెంబర్‌ నెలలో సిప్‌ పెట్టుబడులు పెద్ద ఎత్తున వచ్చాయి. గతేడాది ఇదే నెలలో వచ్చిన నిధులతో పోలిస్తే 40 శాతం అధికంగా రూ.7,727 కోట్ల పెట్టుబడులు తరలివచ్చాయి. అంటే, మార్కెట్ల కరెక్షన్‌ను ఇన్వెస్టర్లు పెట్టుబడులకు అవకాశంగా చూసినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఆగస్ట్‌లో సిప్‌ పెట్టుబడులు రూ.7,658 కోట్లు,

పెద్ద పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్‌

Monday 15th October 2018

న్యూఢిల్లీ: దేశంలోని ఏడు పెద్ద పట్టణాల్లో ఇళ్లకు డిమాండ్‌ నెలకొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో అమ్మకాలు 15 శాతం పెరిగాయి. డీమోనిటైజేషన్‌, జీఎస్టీ, రెరా తాలూకూ ప్రభావాల నుంచి ప్రాపర్టీ మార్కెట్‌ కోలుకుంటున్నట్టు అనరాక్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్స్‌ తెలిపింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, ముంబై మెట్రోపాలిటన్‌ ప్రాంతం, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌, పుణె నగరాల్లో కలిపి చూస్తే నివాస గృహాల విక్రయాలు ఈ ఏడాది జూలై-సెప్టెంబర్‌ కాలంలో

Most from this category