STOCKS

News


భారత్‌కు మూడీస్‌ ‘క్రెడిట్‌ నెగటివ్‌’!

Wednesday 10th October 2018
news_main1539148194.png-20998

న్యూఢిల్లీ: పెట్రోల్‌, డీజిల్‌పై ఎక్సైజ్‌ సుంకాల కోత ప్రభుత్వ ఆదాయాలకు గండి కొడుతుందని అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తన తాజా నివేదికలో విశ్లేషించింది. ఇది భారత్‌కు ‘క్రెడిట్‌ నెగటివ్‌’ అని పేర్కొంది. ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- వ్యలోటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) లో 3.3 శాతంగా ఉండాలన్న కేంద్ర బడ్జెట్‌ లక్ష్యాలను ప్రస్తావిస్తూ, ఇది 3.4 శాతానికి పెరిగే అవకాశం ఉందని తెలియజేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్రవ్యలోటు 6.24 లక్షల కోట్లుగా (2018-19 జీడీపీ విలువలో 3.3 శాతం) ఉండాలని  బడ్జెట్‌ నిర్దేశించింది. అయితే మొదటి ఐదు  నెలల్లో (ఏప్రిల్‌-ఆగస్టు) ఈ లోటు రూ.5.91 లక్షల కోట్లుగా ఉంది. పెట్రోల్‌, డీజిల్‌పై లీటర్‌కు రూ.1.5 ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రూ.10,500 కోట్ల మేర కేంద్రం ఆదాయాలకు గండికొడుతుందని వార్తలు వెలువడుతున్న సంగతి తెలిసిందే. ఆయా అంశాలపై మూడీస్‌ తాజా ప్రకటనలో వెలువరించిన ముఖ్యాంశాలివీ...
♦ తమ ప్రైసింగ్‌లో లీటరుకు రూపాయి తగ్గించుకోవాలన్న ఆదేశాలు ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు (ఓఎంసీ) ప్రతికూలమైనవే. 
♦ జీడీపీలో కేం‍ద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు 3.4 శాతం ఉంటుందని భావిస్తున్నాం. కేంద్ర-రాష్ట్రాలు రెండూ కలిపితే ఈ లోటు జీడీపీలో 6.3 శాతంగా ఉండే వీలుంది. ప్రభుత్వ మూలధన వ్యయాల కోతకూ ఆయా పరిస్థితులు దారితీయవచ్చు.
♦ అయితే ఫ్యూయెల్‌ ఎక్సైజ్‌ కోత జీడీపీ వృద్ధి రేటుపై మాత్రం స్వల్ప ప్రభావమే చూపుతుంది.  
♦ చమురు ధరలు పెరుగుతున్నాయి. రూపాయి బలహీనపడుతోంది. ప్రభుత్వ వ్యయాలు తగ్గే అవకాశం ఉంది. ఆయా అంశాలు గృహ వినియోగాలపై ప్రతికూలతలు చూపే వీలుంది. అయితే ఎక్సైజ్‌ సుంకాల తగ్గింపు ఈ ప్రతికూలతల తీవ్రతను కొంతమేర తగ్గిస్తుంది. ఆయా అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటో భారత్‌ జీడీపీ వృద్ధి 2018, 2019 ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 7.3 శాతం, 7.5 శాతంగా ఉంటుందని భావిస్తున్నాం. 
♦ గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ పరిస్థితుల ప్రతికూలత, అధిక చమురు ధరలు, దేశీయ క్రెడిట్‌ పరిస్థితుల్లో క్లిష్టత భారత్‌కు తక్షణ సవాళ్లు. 
♦ భారత సావరిన్‌ రేటింగ్‌ను 13 యేళ్ల తరువాత మొట్టమొదటిసారి మూడీస్‌ గత ఏడాది పెంచింది. దీనితో ఈ రేటు ‘బీఏఏ2’కు చేరింది. వృద్ధి అవకాశాలు బాగుండడం, ఆర్థిక, వ్యవస్థీకృత విభాగాల్లో సంస్కరణల కొనసాగింపు రేటింగ్‌ పెంపునకు కారణమని వివరించింది. You may be interested

భారత్‌లోనే పేమెంట్స్ డేటా స్టోరేజి: వాట్సాప్‌

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలకు అనుగుణంగా చెల్లింపుల సంబంధిత డేటాను భారత్‌లోనే భద్రపర్చేలా (డేటా లోకలైజేషన్‌) తగు వ్యవస్థను రూపొందించుకున్నట్లు మొబైల్ మెసేజింగ్ ప్లాట్‌ఫాం వాట్సాప్ వెల్లడించింది. ప్రస్తుతం దేశీయంగా పది లక్షల మందితో ఈ ఫీచర్‌ను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తున్నట్లు పేర్కొంది. త్వరలోనే దేశవ్యాప్తంగా అందరికీ దీన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. వాట్సాప్‌నకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం 130 కోట్ల మంది యూజర్లు ఉండగా అందులో 20 కోట్ల

ఓఎంసీల డివిడెండ్‌లు తగ్గవు

Wednesday 10th October 2018

న్యూఢిల్లీ: ఇంధనాలపై సబ్సిడీ భారం కారణంగా ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (ఓఎంసీ) కేంద్రానికి ఇచ్చే డివిడెండ్లో ఈసారి కోత పడొచ్చన్న వార్తలను కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి ఎస్‌సీ గర్గ్‌ తోసిపుచ్చారు. డిజిన్వెస్ట్‌మెంట్ ఆదాయం తగ్గొచ్చని, సబ్సిడీల్లో కోత పెట్టొచ్చని వస్తున్న వార్తలను ఖండించారు. ఇవన్నీ పూర్తిగా అవాస్తవాలంటూ మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్‌లో ట్వీట్ చేశారు. సబ్సిడీల్లో కోత పెట్టే యోచనేదీ ప్రభుత్వానికి లేదన్నారు. మరోవైపు

Most from this category