News


తగ్గిన హైరింగ్‌ అంచనాలు ..

Thursday 15th November 2018
news_main1542258968.png-22033

ముంబై: దేశీయంగా కరెన్సీ పతనం, చమురు ధరల పెరుగుదల ఆందోళనకరంగా మారిన నేపథ్యంలో  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్థంలో నియామకాల అంచనాలు 3 శాతం మేర తగ్గి 92 శాతానికి చేరాయి. ప్రథమార్ధంలో (ఏప్రిల్‌-సెప్టెంబర్‌) ఇది 95 శాతంగా ఉంది. టీమ్‌లీజ్‌ సంస్థ రూపొందించిన 2018-19 నియామకాల అంచనాల నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నియామకాల సెంటిమెంటుపై 14 నగరాల్లో 19 రంగాలకు చెందిన 750 చిన్న, మధ్య తరహా, పెద్ద సంస్థలు, 2,500 పైచిలుకు ఉద్యోగులపై ఈ అధ్యయనం నిర్వహించారు. నివేదిక ప్రకారం.. ద్వితీయార్ధంలో విద్యుత్‌, ఇంధన రంగంలో 33,100 కొత్త ఉద్యోగాలు, ఆర్థిక సేవల రంగంలో 44,650, మీడియా.. వినోద రంగంలో 46,300 కొత్త నియామకాలు జరగనున్నాయి. నిర్మాణ, రిటైల్‌, టెలికమ్యూనికేషన్స్‌ విభాగాల్లో 3 శాతం, వ్యవసాయ, బీపీవో, ఐటీ రంగాల్లో రెండు శాతం, ఎఫ్‌ఎంసీజీలో 1 శాతం హైరింగ్ తగ్గనుంది. నగరాలవారీగా ముంబైలో అత్యధికంగా 1.66 లక్షలు, ఢిల్లీలో 1.55 లక్షలు, బెంగళూరు 1.52 లక్షలు హైదరాబాద్‌లో 96,000 ఉద్యోగాల కల్పన జరగనుంది.
ఊతమివ్వని జీడీపీ..
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) చెప్పుకోతగ్గ స్థాయిలో వృద్ధి నమోదు చేస్తున్నప్పటికీ ఉద్యోగాల కల్పనకు ఊతమివ్వలేకపోయిందని టీమ్‌లీజ్‌ నివేదికలో పేర్కొంది. అయితే, నియామకాల సంఖ్యను పెంచుకోవాలనుకుంటున్న సంస్థల విషయంలో మాత్రం ప్రపంచ దేశాలతో పోలిస్తే 94 శాతంతో భారత్ మెరుగైన స్థానంలో ఉంది. దేశీయంగా విద్యుత్‌, ఇంధన, ఆర్థిక సేవల రంగాల్లో ఉద్యోగాల అంచనాలు మెరుగ్గా ఉన్నట్లు టీమ్‌లీజ్‌ సర్వీసెస్ సహ వ్యవస్థాపకురాలు, ఎగ్జిక్యూటివ్ వైస్‌ప్రెసిడెంట్‌ రితుపర్ణ చక్రవర్తి తెలిపారు. తృతీయ శ్రేణి నగరాల్లో ఉద్యోగాల అంచనాలు మెరుగ్గా ఉండటం బట్టి చూస్తే.. దేశవ్యాప్తంగా కొత్త జాబ్ మార్కెట్లు అందుబాటులోకి వస్తున్నాయని భావించవచ్చని ఆమె పేర్కొన్నారు. You may be interested

అల్ట్రాటెక్‌ చేతికి బినానీ సిమెంట్‌?

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: రుణ ఊబిలో చిక్కుకున్న బినానీ సిమెంట్‌ విషయమై ఆదిత్య బిర్లా గ్రూపు దాఖలు చేసిన సవరణ బిడ్‌కు జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆమోదం తెలిపింది. ప్రత్యర్థి దాల్మియా భారత్‌ గ్రూపు సంస్థ రాజ్‌పుతాన ప్రాపర్టీస్‌ సమర్పించిన ప్రణాళిక కొందరు రుణ దాతలకు వ్యతిరేకంగా, వివక్షాపూరితంగా ఉందని చైర్మన్‌ జస్టిస్‌ ఎస్‌జే ముఖోపాధ్యాయ ఆధ్వర్యంలోని ఇద్దరు సభ్యుల ఎన్‌సీఎల్‌ఏటీ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ ఏడాది జూలై

స్పైస్‌జెట్‌ నష్టాలు రూ.389 కోట్లు

Thursday 15th November 2018

న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ, స్పైస్‌జెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.389 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. ఇంధన ధరలు పెరగడం, రూపాయి పతనం కారణంగా ఈ స్థాయిలో నష్టాలు వచ్చాయని స్పైస్‌జెట్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.105 కోట్ల నికర లాభం వచ్చిందని స్పైస్‌జెట్‌ సీఎమ్‌డీ అజయ్‌ సింగ్‌ చెప్పారు. గత క్యూ2లో రూ.1,795 కోట్లుగా ఉన్న కార్యకలాపాల ఆదాయం ఈ

Most from this category