రూపాయి బలపడడం ఖాయం!
By D Sayee Pramodh

ఎమిరేట్స్ ఎన్బీడీ పీజేఎస్సీ అంచనా
దేశీయ కరెన్సీ ఈ ఏడాదిలో అధ్వాన్న ప్రదర్శన చేస్తూ వస్తోంది. చాలా మంది అనలిస్టులు రూపాయి మరింత బలహీనపడుతుందని అంచనాలు వేస్తున్నారు. అయితే రూపాయిపై ఖచ్ఛితమైన అంచనాలు వెలువరిస్తుందని భావించే ఎమిరేట్స్ ఎన్బీడీ పీజేఎస్సీ మాత్ర భిన్న స్వరం వినిపిస్తోంది. ఈ ఏడాది చివరకల్లా రూపాయి బలపేతమవుతుందని ఎమిరేట్స్ బ్యాంక్ అంచనా వేస్తోంది. రూపాయి క్షీణతకు కారణాలైన క్రూడాయిల్ ధరల పెరుగుదల, డాలర్ బలపడడంఅనే జోడు గుర్రాలు క్రమంగా జోరు కోల్పోతున్నాయని తెలిపింది. సమీప భవిష్యత్‌లో ఈ రెండింటి ప్రభావం తగ్గుముఖం పడుతుందని బ్యాంకు డైరెక్టర్ అదిత్య పుగాలియా చెప్పారు. ద్రవ్యోల్బణంపై నిశిత పరిశీలన జరిపే ఆర్బీఐ కారణంగా వచ్చే మూడునెలల్లో రూపాయికి మద్దతు లభిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. సెప్టెంబర్ చివరకు డాలర్‌తో రూపాయి మారకం విలువ 67.5 స్థాయికి, ఏడాది చివరకు 67 స్థాయికి వస్తుందని ఆయన అంచనా వేశారు. రూపాయి వచ్చే ఏడాది కల్లా 71 స్థాయికి దిగజారుతుందని మాక్కై్వరీ, డీబీఎస్హోల్డింగ్స్ అంచనాలు వేస్తుండగా, 72కు చేరవచ్చని బార్క్లేస్ అభిప్రాయపడింది. ఎక్కువమంది అనలిస్టుల అభిప్రాయాల సరాసరి ప్రకారం ఈ ఏడాది చివరకు రూపాయి 68.20 వద్ద ఉండవచ్చు. రూపాయి నిజ విలువ లెక్క ఆధారంగా చూస్తే 64-66 రేంజ్లో ఉండాలని యూబీఎస్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఆదిత్య పుగాలియా అభిప్రాయాలు, అంచనాలు..
- రూపాయి 69 స్థాయి కిందకు దిగజారకపోవచ్చు. నిజానికి 69 స్థాయిలో రూపాయి ఉండడం వల్ల ఎగుమతులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. అందుకే రూపాయి క్షీణతపై విత్తమంత్రి ఎలాంటి వ్యాఖ్యలు చేయడంలేదు. రూపాయి ప్రస్తుత శ్రేణిలో ఉండడం ప్రభుత్వానికి సమ్మతమే.
- ఈ ఏడాది ఆర్బీఐ మరోమారు రేట్లను పెంచవచ్చు. దీంతో రూపాయికి కాస్త వెసులుబాటు కలుగుతుంది.
- వాణిజ్యయుద్ధంలో భారత్‌కు కూడా వాటా ఉంటుంది. ప్రస్తుతం అందరి దృష్టి యూఎస్ఏ- చైనా మీదనే కేంద్రీకృతమై ఉంది. ఇది క్రమంగా యూఎస్- ఇతర ప్రపంచం అనే రూపుదిద్దుకుంటుంది. రూపాయి బలహీనపడడం వాణిజ్యయుద్ధ ప్రభావాలను కాస్త చల్లబరుస్తుంది.
- దేశీయ సీఏడీ అంచనాల కన్నా విస్తృతమైంది. కానీ ఇది పెద్ద సమస్యకాబోదు. ఆర్బీఐ వద్ద సరిపడినన్ని ఫారెక్స్ నిల్వలున్నాయి.
- 2013-14తో పోలిస్తే ఇప్పటి పరిస్థితి భిన్నంగా ఉంది. అప్పుడు యూఎస్ఏ ఉద్దీపనల ఉపసంహరణ ఆరంభమవుతుండగా, ఇప్పుడు మధ్యలో ఉన్నాము.
You may be interested
సుందరం ఏఎమ్‌సీ బెట్స్ ఇవే..!
Thursday 12th July 2018ముంబై: గతేడాది సూచీలు బ్రహ్మాండమైన ర్యాలీని నమోదుచేయగా.. నిఫ్టీ 29 శాతం, నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 47 శాతం ర్యాలీ చేసి ఆశ్చర్యం కలిగించినట్లు సుందరం అసెట్ మేనేజ్మెంట్ సీఐఓ ఎస్ కృష్ణ కుమార్ అన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో జీవితకాల గరిష్టస్థాయిలను నమోదుచేసి అక్కడ నుంచి 10 శాతం వరకు కరెక్ట్ అయిన సూచీలు క్రమంగా పుంజుకుని మళ్లీ ఆస్థాయి వద్దకు చేరుకోగా.. ఇదే సమయంలో 12-20 శాతం
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాప్ @100 బిలియన్ డాలర్లు
Thursday 12th July 2018వరుసగా 5రోజూ ర్యాలీ చేస్తున్న రిలయన్స్ షేర్లు సరికొత్త హైని నమోదు చేసిన షేర్లు ముంబై:- రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ గురువారం 100 బిలియన్ డాలర్లు మార్కును చేరుకుంది. దేశంలోనే టీసీఎస్ తరువాత 100 బిలియన్ డాలర్ల మార్కును చేరుకున్న రెండో కంపెనీగా రిలయన్స్ కంపెనీ రికార్డు సృష్టించింది. నేటి బీఎస్ఈ ఇంట్రాడేలో కంపెనీ షేర్లు 5శాతం లాభపడటంతో కంపెనీ విలువ 6.87లక్షల కోట్లకు అంటే 100 బిలియన్ డాలర్ల పైకి చేరుకుంది.