STOCKS

News


ప్రధాని ఆర్థిక సలహా మండలికి భల్లా రాజీనామా

Wednesday 12th December 2018
news_main1544592036.png-22851

న్యూఢిల్లీ: కేంద్రం స్థాయిలో ఆర్థిక వేత్తల రాజీనామా పరంపర కొనసాగుతోంది. ఆర్‌బీఐ గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ రాజీనామా చేసి 24 గంటలు కూడా గడవకముందే ప్రధాన మంత్రి ఆర్థిక సలహా మండలిలో (పీఎంఈఏసీ) సభ్యుడైన ప్రముఖ ఆర్థిక నిపుణుడు సుర్జిత్‌ భల్లా తాను సైతం రాజీనామా చేసినట్టు మంగళవారం ప్రకటించారు. డిసెంబర్‌ 1 నుంచి పీఎంఈఏసీ తాత్కాలిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్టు భల్లా ట్వీట్‌ చేశారు. భల్లా రాజీనామాను ప్రధానమంత్రి ఆమోదించినట్టు ఆయన కార్యాలయ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. 
1952 నుంచి భారత్‌లో ఎన్నికలు అనే పుస్తకంపై తాను పనిచేస్తు‍న్నానని, సీఎన్‌ఎన్‌ ఐబీఎన్‌లో తాను చేరిన డిసెంబర్‌ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని భల్లా తెలిపారు. ప్రభుత్వ విధానాలకు మద్దతుదారుగా ఉండే ఈ ఆర్థిక వేత్త ఇటీవలి జీడీపీ గణాంకాల ప్రకటన విషయంలో నీతి ఆయోగ్‌ పాత్రపై విమర్శలు చేశారు. నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ రాజీవ్‌కుమార్‌ సమక్షంలో కేంద్ర ముఖ్య గణాంక అధికారి ప్రవీణ్‌ శ్రీవాస్తవ గత నెల 28న సెప్టెంబర్‌ క్వార్టర్‌ జీడీపీ గణాంకాలను ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై భల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆరుగురు సభ్యులతో కూడిన ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి అనేది స్వతంత్ర సంస్థ. ఆర్థిక అంశాల్లో ప్రధానమంత్రికి సలహాలు ఇవ్వడం దీని బాధ్యత. ఈ మండలికి బిబేక్‌దేబ్రాయ్‌ నేతృ‍త్వం వహిస్తున్నారు. గతంలో ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్‌ సుబ్రమణ్యన్‌, నీతి ఆయోగ్‌ వైస్‌ చైర్మన్‌ అరవింద్‌ పనగరియా కూడా తమ పదవులకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.



You may be interested

టియాగో ఎక్స్‌జెడ్‌ ప్లస్‌ విడుదల

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌ తన పాపులర్‌ వాహనం టియాగోలో కొత్త వేరియంట్‌ను మంగళవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది.  ‘టియాగో ఎక్స్‌జెడ్‌ ప్లస్‌’ పేరుతో విడుదలైన ఈ కారు పెట్రోల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.5.57- 5.64 లక్షలు కాగా, డీజిల్‌ వేరియంట్‌ ధరల శ్రేణి రూ.6.31- 6.38 లక్షలుగా ప్రకటించింది. ఈ సందర్భంగా కంపెనీ ప్యాసింజర్‌ వాహన విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌ (సేల్స్‌, మార్కెటింగ్‌, కస్టమర్‌ సపోర్ట్‌) ఎస్‌.ఎన్‌.బర్మన్‌

భారత్‌లో 38 శాతం బ్రిటన్‌ కంపెనీల పెట్టుబడులు

Wednesday 12th December 2018

న్యూఢిల్లీ: బ్రిటన్‌ కంపెనీల్లో 38 శాతం 2017లో భారత్‌లో కొత్తగా పెట్టుబడులు పెట్టాయి. 2016-18 మధ్య ప్రైవేటు రంగంలో 51,118 ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. అంతకుముందు 18 నెలల కాలంతో పోలిస్తే ఇది 14 శాతం అధికమని ‘స్టెర్లింగ్‌ అసెట్స్‌-బ్రిటన్‌ మీట్స్‌ ఇండియా’ నివేదిక తెలియజేసింది. భారత్‌లో బ్రిటన్‌ తన పెట్టుబడులను ఇతోధికం చేయడం ద్వారా అతిపెద్ద పాశ్చాత్య ఇన్వెస్టర్‌గా నిలిచినట్టు పేర్కొంది. బ్రిటన్‌ కంపెనీలు భారత్‌లో గత శతాబ్దకాలంలో

Most from this category