STOCKS

News


ఆరేళ్లలో పది కోట్ల ఉద్యోగాలు

Friday 8th March 2019
news_main1552025750.png-24490

ప్రభుత్వ సంస్కరణల ఫలితమే: సీఐఐ
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఇటీవలి సంస్కరణల కారణంగా మరో ఆరేళ్లలో పది కోట్లకు పైగా  ఉద్యోగాలు వస్తాయని సిఐఐ అంచనా వేస్తోంది. నైపుణ్య స్థాయిలు పెరుగుతున్నాయని, స్టార్టప్‌ల, కొత్త వ్యాపారాల  జోరు పెరుగుతోందని సీఐఐ ప్రెసిడెంట్‌ రాకేశ్‌ భారతి మిట్టల్‌ తెలిపారు. ఉద్యోగాల నాణ్యత పెరగడమే కాకుండా, ఆదాయాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. సులభతర వాణిజ్య విధానాలు, చిన్న వ్యాపార సంస్థలకు పన్ను రేటును 25 శాతానికి తగ్గించడం, వడ్డీరేట్ల తగ్గింపు వంటి అంశాలు.. కొత్త వ్యాపారాలకు, ముఖ్యంగా ఎస్‌ఎమ్‌ఈల వృద్ధికి ఇతోధికంగా తోడ్పడుతున్నాయని వివరించారు. ఎనిమిది రంగాల్లో 2025 కల్లా పది కోట్లకు పైగా ఉద్యోగాలు వస్తాయని అంచనాలున్నాయని తెలిపారు. రిటైల్‌, నిర్మాణ, రవాణా, లాజిస్టిక్స్‌, పర్యాటక, ఆతిధ్య, చేనేత, హస్తకళలు, టెక్సటైల్స్‌, దుస్తులు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఆటోమోటివ్‌ రంగాల్లో ఈ ఉద్యోగాలు వస్తాయని వివరించారు. నిర్మాణ రంగంలో 2015-2025 కాలానికి 2.87 కోట్ల ఉద్యోగవకాశాలు రానున్నాయని తెలిపారు. ప్రస్తుతం 60,000లుగా ఉన్న స్టార్టప్‌ల సంఖ్య​ రెండేళ్లలో లక్షన్నరకు పెరగనున్నదని ఇటీవల జరిగిన సీఐఐ వర్క్‌షాప్‌లో వెల్లడైందని వివరించారు.  2017, సెప్టెంబర్‌ నుంచి గత ఏడాది డిసెంబర్‌ మధ్యకాలంలో 72 లక్షల మందికి సామాజిక భద్రత పథకాల ఫలాలు లభించాయని పేర్కొన్నారు.



You may be interested

పెనాల్టీలకు బ్యాంక్‌ల లోపాలే కారణం: స్విఫ్ట్‌

Friday 8th March 2019

ముంబై: బ్యాంకుల ఆటోమేటెడ్ చెల్లింపు విధానాల్లో లోపాల కారణంగానే వాటిపై రిజర్వ్ బ్యాంక్ జరిమానాలు విధించిందని, తమ వ్యవస్థ వైఫల్యం కాదని స్విఫ్ట్‌ సీఈవో (ఆసియా పసిఫిక్, ఈఎంఈఏ విభాగం) అలెయిన్ రేస్ చెప్పారు. తాము అన్ని బ్యాంకులను పర్యవేక్షించలేమని చెప్పారాయన. అంతర్జాతీయంగా చెల్లింపులకు బ్యాంకులు ఉపయోగించే స్విఫ్ట్ మెసేజింగ్‌ విధానాన్ని సక్రమంగా అమలు చేయనందుకు ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్ సహా 19 బ్యాంకులపై రిజర్వ్ బ్యాంక్ రూ.40 కోట్ల

ఆ సొమ్మును డిపాజిట్‌ చేయండి!

Friday 8th March 2019

ఆ సొమ్మును డిపాజిట్‌ చేయండి! మహికో కేసులో నూజివీడు సీడ్స్‌కు బోంబే హైకోర్టు ఆదేశం రూ.138 కోట్ల నగదు లేదా బ్యాంకు గ్యారంటీ ఇవ్వాలని ఉత్తర్వులు హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మహికో మోన్‌శాంటో బయోటెక్‌ (ఎంఎంబీఎల్‌) కంపెనీ టెక్నాలజీ సమర్థమైనది కాదు కనక దానికి రాయల్టీ చెల్లించాల్సిన పనిలేదంటూ నిలిపేసిన రూ.138 కోట్లను తమ వద్ద డిపాజిట్‌ చేయాలని హైదరాబాద్‌కు చెందిన విత్తన కంపెనీ నూజివీడు సీడ్స్‌ను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. ఈ మొత్తాన్ని

Most from this category