STOCKS

News


క్యూ1లో వృద్ధి 7.6 శాతం: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌

Friday 31st August 2018
news_main1535693901.png-19820

న్యూఢిల్లీ: భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికం (ఏప్రిల్‌-జూన్‌)లో 7.6 శాతంగా నమోదవుతుందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ తన తాజా నివేదికలో పేర్కొంది. శుక్రవారం మొదటి త్రైమాసిక గణాంకాలను కేంద్రం విడుదల చేస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక వెలువడింది. దీనికి లో-బేస్‌ ఎఫెక్ట్‌ కారణమని వివరించింది. గత ఏడాది ఇదే కాలంలో జీడీపీ కేవలం 5.6 శాతంగా నమోదుకావడం గమనార్హం. క్రూడ్‌ ధరల పెరుగుదల భారత్‌ వృద్ధికి సవాలు విసురుతున్న అంశమని పేర్కొంది. 



You may be interested

రిసార్ట్స్ విభాగంలోకి ఓయో

Friday 31st August 2018

ముంబై: హోటల్స్ చెయిన్ ఓయో తాజాగా రిసార్ట్స్‌ వంటి ఆతిథ్య రంగంలోకి ప్రవేశించింది. ఇందుకోసం పాలెట్ రిసార్ట్స్ పేరిట కొత్త బ్రాండ్‌ ప్రారంభించింది. గదులు, ప్రైవేట్ విల్లాలు, బీచ్‌లు, స్పా మొదలైనవి ఆఫర్ చేసే రిసార్ట్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు ఓయో పేర్కొంది. ముందుగా పాండిచేరీలోని ఒక ప్రాపర్టీతో (పాలెట్ రిసార్ట్స్‌-లె పాండీ) కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ఒక ప్రకటనలో వివరించింది. క్రమంగా దేశవిదేశాల్లో ఇతర పర్యాటక ప్రాంతాలకు కూడా

‍క్యాష్‌ ఈజ్‌ కింగ్‌!

Friday 31st August 2018

న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దు అనంతరం నగదు రూపంలో ఇంటింటి పొదుపులు గణనీయంగా పెరిగాయి. 2017-18లో స్థూల జాతీయ డిస్పోజబుల్‌ ఇన్‌కమ్‌ (జీఎన్‌డీఐ- ఆదాయపు పన్నులు తదితర వ్యయాల తర్వాత ఖర్చులకు, పొదుపుకు కుటుంబం వద్ద ఉండే మొత్తమే డిస్పోజబుల్‌ ఇన్‌కమ్‌)తో పోల్చిచూస్తే, నగదు రూపంలో ఇంటింటి పొదుపు 2.8 శాతానికి పెరిగింది. ఇది ఏడేళ్ల గరిష్ట స్థాయి రేటు. రిజర్వ్‌ బ్యాం‍క్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) తాజా గణాంకాలు

Most from this category