STOCKS

News


వచ్చే ఐదేళ్ల పాటు ఎర్నింగ్స్‌ వృద్దిలో జోరు

Wednesday 13th March 2019
news_main1552467164.png-24585

దేశీయ ఎకానమీ సరికొత్త ఫండమెంటల్‌ సైకిల్‌ ఆరంభంలో ఉందని మోర్గాన్‌స్టాన్లీ వ్యూహకర్త రిధమ్‌ దేశాయ్‌ చెప్పారు. ఈ సైకిల్స్‌ కాలపరిమితి దీర్ఘకాలం ఉంటుందని, తాజా సైకిల్‌ కనీసం 5- 7 సంవత్సరాలు కొనసాగవచ్చని తెలిపారు. ఇలాంటి చక్రీయ వలయాల కాలంలో ఎర్నింగ్స్‌ వృద్ధి బలంగా నమోదవుతుందన్నారు. ఇందుకు తగిన రంగం సిద్ధం చేసే క్రమంలో రెండేళ్లుగా రెవెన్యూ వృద్ధి ఊపందుకుంటోందని వివరించారు. ఇంకా లాభాల్లో జోరు పెరగాల్సిఉందన్నారు. ఇవన్నీ గమనిస్తే రాబోయే ఐదు నుంచి ఏడేళ్లలో ఎర్నింగ్స్‌లో 20 శాతం చక్రీయ వార్షిక వృద్ది అవకాశాలున్నాయని చెప్పారు. ఈక్విటీల్లో కాలు మోపేందుకు ఇదే తగిన సమయమని సూచించారు. ఎన్నికల్లో సుస్థిర ప్రభుత్వం ఏర్పడితే మార్కెట్లో మరింత ఉత్సాహం పెరుగుతుందని చెప్పారు. ఇలాంటి స్థానిక చక్రీయ వలయాల కాలంలో కన్జూమర్‌ గూడ్స్‌, ఇండస్ట్రియల్స్‌, ఇంజనీరింగ్‌, నిర్మాణం తదితర రంగాలు మంచి ప్రదర్శన చూపుతుంటాయని తెలిపారు. వీటితో పాటు తాము ప్రత్యేకంగా ఫైనాన్షియల్‌ కంపెనీలు ముఖ్యంగా ఎన్‌బీఎఫ్‌సీలు, కార్పొరేట్‌ బ్యాంకుల షేర్లను కొనుగోలు చేయడంపై దృష్టి పెడుతున్నామని చెప్పారు. రియల్టీ రంగం కూడా చాలా బుల్లిష్‌గా కనిపిస్తోందని దేశాయ్‌ చెప్పారు. You may be interested

లాంగ్‌టర్మ్‌కు స్ట్రాంగ్‌ స్టాక్స్‌

Wednesday 13th March 2019

సెంట్రమ్‌ బ్రోకింగ్‌ సిఫార్సులు దీర్ఘకాలానికి మంచి రాబడులు అందించే ఐదు స్టాకులను సెంట్రమ్‌ బ్రోకింగ్‌ రికమండ్‌ చేస్తోంది. 1. ఏసీసీ: కొనొచ్చు. టార్గెట్‌ రూ. 1820. వాల్యూషన్లు ఆకర్షణీయంగా ఉన్నాయి. క్యాష్‌ఫ్లో ఉత్పత్తి, రిటర్న్‌ రేషియోలు పాజిటివ్‌గా ఉన్నాయి. తాజాగా ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకుంటున్నట్లు ప్రకటించింది. ఇటీవల అంబుజాతో కుదుర్చుకున్న మెటిరియల్‌ సరఫరా ఒప్పందం కంపెనీకి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. డీజిల్‌, పెట్‌కోక్‌ ధరల తరుగుదల కూడా కలిసివచ్చే అంశమే. రాబోయే రోజుల్లో

మళ్లీ 1300డాలర్ల పైకి పసిడి ధర

Wednesday 13th March 2019

బ్రెగ్జిట్‌ ఆందోళనల నేపథ్యంలో పసిడి ధర తిరిగి 1300డాలర్లపైకి చేరుకుంది. నేడు ఆసియాలో ఔన్స్‌ పసిడి ధర 7.50డాలర్లు లాభపడింది. యూరోపియన్ నుంచి బ్రిటన్ వైదొలగటానికి సంబంధించి ప్రధానమంత్రి థెరెసా మే రూపొందించిన ముసాయిదా ఒప్పందాన్ని పార్లమెంటు తిరస్కరించింది. మొత్తం 391 సభ్యులున్న హౌజ్ ఆఫ్ కామన్స్ సభలో థెరెసా ప్రతిపానను 242 మంది సభ్యులు తిరస్కరించారు.  ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగటానికి తుది గడువు అయిన మార్చి 29వ

Most from this category