STOCKS

News


స్టార్టప్‌లకు పన్ను మినహాయింపులు

Friday 26th April 2019
news_main1556253173.png-25357

- వాణిజ్య శాఖ ప్రతిపాదనలు
న్యూఢిల్లీ: ఔత్సాహిక వ్యాపారవేత్తలకు తోడ్పాటునిచ్చేలా అంకుర సంస్థలకు పన్నులపరమైన మినహాయింపులతో పాటు పలు ప్రోత్సాహకాలివ్వాలని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ప్రతిపాదించింది. ఇందుకోసం వాణిజ్య శాఖలో భాగమైన.. పరిశ్రమ, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డీపీఐఐటీ) 'స్టార్టప్ ఇండియా విజన్ 2024' పేరుతో ప్రత్యేక పత్రాన్ని రూపొందించింది. 2024 నాటికి కొత్తగా 50,000 స్టార్టప్స్ ఏర్పాటుకు తోడ్పాటునివ్వడం, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 20 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం మొదలైన ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. అలాగే, 2024 కల్లా కొత్తగా 500 ఇన్‌క్యుబేటర్లు, యాక్సెలరేటర్లు, 100 ఇన్నోవేషన్ జోన్స్‌ ఏర్పాటు, సామాజిక బాధ్యత కింద కంపెనీలు కేటాయించే సీఎస్‌ఆర్ నిధులను ఇన్‌క్యుబేటర్స్‌కు కూడా వర్తింపచేయడం వంటి అంశాలు ఈ పత్రంలో ఉన్నట్లు అధికారి ఒకరు తెలిపారు. వీటితో పాటు రూ. 1,000 కోట్లతో హై టెక్నాలజీ స్టార్టప్స్‌కు ఊతమిచ్చేలా ఇండియా స్టార్టప్ ఫండ్ ఏర్పాటు, సీడ్‌ ఫండింగ్ కోసం రూ. 1,000 కోట్ల కేటాయింపు, 2024 కల్లా ఏడు రీసెర్చ్ పార్క్‌లను అందుబాటులోకి తేవడం వంటి ప్రతిపాదనలు డీపీఐఐటీ చేసినట్లు పేర్కొన్నారు. స్టార్టప్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌కు పన్నుపరమైన ప్రోత్సాహకాలు, వస్తు.. సేవల పన్ను రేట్లలో తగ్గింపు, ఎసాప్స్‌కు పన్ను మినహాయింపులు, ఆల్టర్నేట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్స్ పెట్టే అన్ని రకాల పెట్టుబలకు ఏంజెల్‌ ట్యాక్స్‌ నుంచి మినహాయింపునిచ్చే ప్రతిపాదనలు కూడా ఇందులో ఉన్నట్లు వివరించారు. ఇప్పటిదాకా 17,984 స్టార్టప్ సంస్థలు డీపీఐఐటీ గుర్తింపు పొందాయి.



You may be interested

ముడిచమురు @75 డాలర్లు

Friday 26th April 2019

ఆరునెలల గరిష్ఠస్థాయి నమోదు  లండన్‌: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు మంటలు మొదలయ్యాయి. గురువారం ట్రేడింగ్‌లో బ్రెంట్‌క్రూడ్‌ ధర 75 డాలర్ల పైన ఆరునెలల గరిష్ఠస్థాయిని తాకింది. ఇరాన్‌పై ఆంక్షలతో చమురు సరఫరా అతలాకుతలం అవుతుందన్న ఆందోళనలు చమురు ధరల్లో కాక పెంచాయి. గురువారం ఇంట్రాడేలో బ్రెంట్‌ క్రూడ్‌ 75.60 డాలర్లను తాకింది. గత అక్టోబర్‌ తర్వాత ఈ స్థాయి చూడడం ఇదే తొలిసారి. మరోవైపు డబ్ల్యుటీఐ క్రూడ్‌ సైతం ఆరునెలల గరిష్టం

సైయంట్‌ లాభం రూ. 188 కోట్లు

Friday 26th April 2019

రెవెన్యూలో 9.5 శాతం వృద్ధి 2018-19 సంవత్సరానికి రూ. 15 డివిడెండ్‌ న్యూఢిల్లీ: మార్చి త్రైమాసికంలో సైయంట్‌ నికరలాభం 54.7 శాతం పెరిగి రూ. 188.1 కోట్లకు చేరింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో కంపెనీ రూ. 121.5 కోట్ల లాభం నమోదు చేసింది. ‘వన్‌ ఆఫ్‌ ఎంప్లాయి’ కార్యక్రమం, ఇన్‌సైట్స్‌ సంస్థ మూసివేత ప్రభావం లేకుండా లెక్కిస్తే క్యు4లో నికరలాభం 176.8 కోట్లని కంపెనీ తెలిపింది. సమీక్షా కాలంలో కంపెనీ

Most from this category