భార్య, కుమార్తెలకు బహమతులపై పన్ను వద్దు
By Sakshi

న్యూఢిల్లీ: భార్య, కుమార్తెలకు ఇచ్చే బహుమతులపై గిఫ్ట్ ట్యాక్స్ వేయవద్దని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ కోరారు. ఇందుకు సంబంధించి చట్ట సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్ గోయల్‌కు సూచించారు. ‘‘ఓ సమాజంగా మహిళల ఆర్థిక సాధికారతకు భరోసానివ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 64ను తగిన విధంగా సవరించడాన్ని పరిశీలించాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నాను’’ అని మేనకాగాంధీ ట్వీట్ చేశారు. సెక్షన్ 64 ప్రకారం భర్త తన భార్యకు ఏదైనా ఆస్తి బహుమతిగా ఇస్తే, దానిపై వచ్చే ఆదాయాన్ని భర్త ఆదాయంగానే పరిగణించడం జరుగుతుంది. భార్యకు బహమతిగా ఇచ్చినా, పన్ను భారం మోయాల్సి ఉంటుంది. ‘‘1960ల్లో భార్య, కుమార్తెలకు స్వతంగా పన్ను వర్తించే ఆదాయం ఉండదన్న భావనతో ఈ నిబంధనను రూపొందించారు. కానీ, ఆర్థికంగా స్వతంత్రులవుతున్న నేటి రోజుల్లో ఈ నిబంధన వారిపై ఎంతో ప్రభావం చూపిస్తోంది. భర్తలు, మామ స్థానంలో ఉన్న వారు తమ కుటుంబంలో మహిళలకు ఆస్తులను బదలాయించేందుకు వెనుకాడుతున్నారు. ఆ ఆస్తుల ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను భారం తమపైనే పడుతుందన్న భయం వారిలో ఉంది’’ అని మేనకాగాంధీ ట్వీట్ చేశారు.
You may be interested
ప్యాసింజర్ విభాగంలో మారుతీ ఆధిపత్యం
Tuesday 10th July 2018న్యూఢిల్లీ: దిగ్గజ కార్ల తయారీ కంపెనీ ‘మారుతీ సుజుకీ ఇండియా’.. దేశీ ప్యాసెంజర్ వాహన విభాగంలో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు తొలి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) 52.54 శాతం వాటాతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. టాటా మోటార్స్ మార్కెట్ వాటా పరంగా హోండా కార్స్‌ను వెనక్కునెట్టి నాల్గో స్థానాన్ని దక్కించుకుంది. ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ సమాఖ్య (సియామ్) ప్రకారం.. ఏప్రిల్- జూన్ మధ్యకాలంలో మొత్తం దేశీ ప్యాసెంజర్ వాహన
రూ.1,212కే విమాన టికెట్: ఇండిగో
Tuesday 10th July 2018ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ తాజాగా ‘మెగా వార్షికోత్సవ సేల్’ పేరుతో టికెట్ ధరల డిస్కౌంట్ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టికెట్లను రూ.1,212 ధర నుంచి అందిస్తోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు (జూలై 10 నుంచి 13 వరకు) అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్లో భాగంగా టికెట్లను బుక్ చేసుకున్నవారు ఈ ఏడాది జూలై 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 మధ్య ఎప్పుడైనా