STOCKS

News


జోరందుకున్న ఎయిర్‌ జర్నీ

Thursday 25th October 2018
news_main1540445771.png-21468

ముంబై: దేశీ విమాన ప్రయాణికుల సంఖ్య గతనెలలో గణనీయంగా పెరిగింది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో 114 లక్షల మంది దేశీ విమానాల్లో ప్రయాణం చేసినట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) తాజాగా విడుదలచేసిన డేటా ద్వారా వెల్లడైంది. ఏడాది ప్రాతిపదికన 18.95 శాతం రేటు వృద్ధి నమోదైంది. అంతకు ముందు ఏడాది సెప్టెంబర్‌లో 95.83 లక్షల మంది ప్రయాణికులు దేశీ విమానాల్లో ప్రయాణం చేశారు. గతనెలలో ఎయిర్‌ ట్రాఫిక్‌ పెరగడానికి.. భారీ డిస్కౌంట్‌ ఆఫర్లు, పండుగల సీజన్‌ కావడమే ప్రధాన కారణమని డీజీసీఏ విశ్లేషించింది. ఈ కాలంలో ఇంధన ధరలు ఒక్కసారిగా పెరిగినప్పటికీ, దేశీ విమానయాన సంస్థలు మాత్రం డిస్కౌంట్లను కొనసాగించినట్లు తెలిపింది.
నెంబర్‌ వన్‌ స్థానంలో ఇండిగో 
అత్యధిక మంది ప్రయాణికులు ప్రయాణించిన ఎయిర్‌ లైన్స్‌గా ఇండిగో మరోసారి రికార్డు సృష్టించింది. గతనెలలో 49.20 లక్షల మంది ఈ క్యారియర్‌లో ప్రయాణించిన నేపథ్యంలో మార్కెట్‌ లీడర్‌ స్థానం మళ్లీ ఈ సంస్థకే దక్కింది. సెప్టెంబర్‌లో సంస్థ మార్కెట్‌ వాటా 43.20 శాతంగా నమోదైంది. ఆ తరువాత స్థానంలోని జెట్‌ ఎయిర్‌వేస్‌ మార్కెట్‌ వాటా 14.2 శాతానికి పరిమితమైంది. ఈ ఎయిర్‌లైన్స్‌లో 16.13 లక్షల మంది ప్రయాణికులు ప్రయాణించారు. స్పైస్‌ జెట్‌ ప్రయాణికుల సంఖ్య 13.63 లక్షలు కాగా, మార్కెట్‌ వాటా 12 శాతంగా ఉంది. 13.45 లక్షల మంది ప్రయాణికులతో ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్‌ ఇండియా మార్కెట్‌ వాటా 11.8 శాతంగా నమోదైంది. 



You may be interested

కార్పొరేట్లను తిట్టడం ఫ్యాషనైపోయింది..

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలను ప్రదాని నరేంద్ర మోదీ మరోసారి సమర్ధించారు. కార్పొరేట్లు వ్యాపారంతో పాటు సామాజిక సేవ చేస్తున్నప్పటికీ.. వారిని తిట్టడం ఫ్యాషన్‌గా మారిందని మోదీ ఆక్షేపించారు. ఇది ఆమోదయోగ్యం కాదన్నారు. ఐటీ నిపుణులు, టెక్నాలజీ దిగ్గజాలతో బుధవారం చర్చాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. "ఐటీ, కార్పొరేట్ దిగ్గజాలు అత్యుత్తమంగా సామాజిక సేవ చేస్తుండటం, తమ ఉద్యోగులను కూడా ప్రోత్సహిస్తుండటం మనం చూస్తున్నాం. ఎందుకో తెలియదు

జుబిలంట్‌ ఫుడ్‌వర్క్స్‌ బంపర్‌ ఫలితాలు

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: డామినోస్‌ పిజ్జా, డంకిన్‌ డోనట్స్‌ బ్రాండ్లపై ఫుడ్‌ స్టోర్లను నిర్వహించే జుబిలంట్‌ ఫుడ్‌ వర్క్స్‌ సెప్టెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి మెరుగైన ఫలితాలను ప్రకటించింది. లాభం 60 శాతం పెరిగి రూ.77.67 కోట్లకు చేరుకుంది. డామినోస్‌ పిజ్జా స్టోర్ల నుంచి అధిక అమ్మకాలు లాభాల వృద్ధికి తోడ్పడ్డాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో కంపెనీ లాభం రూ.48 కోట్లుగా ఉంది. కంపెనీ మొత్తం ఆదాయం సైతం సెప్టెంబర్‌ త్రైమాసికంలో 22

Most from this category