STOCKS

News


11 శాతం పెరిగిన విమాన యానం

Saturday 22nd December 2018
news_main1545450750.png-23156

ముంబై: విమాన ప్రయాణాల జోరు పెరుగుతోంది. గత నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య 11 శాతం వృద్ధి చెందిందని డీజీసీఏ (డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌) వెల్లడించింది. డిజీసీఏ వెల్లడించిన వివరాల ప్రకారం..., 
♦ గత నెలలో 1.16 కోట్ల మంది విమాన ప్రయాణం చేశారు. గత ఏడాది ఇదే నెలలో ఈ సం‍ఖ్య 1.05 కోట్లుగా ఉంది. 
♦ లోడ్‌ ఫ్యాక్టర్‌ విషయంలో స్పైస్‌జెట్‌ అగ్రస్థానం కొనసాగిస్తోంది. ఈ కంపెనీ లోడ్‌ ఫ్యాక్టర్‌ 91.1 శాతంగా ఉంది. 87.6 శాతంతో గో ఎయిర్‌ రెండో స్థానంలో, 86.5 శాతం లోడ్‌ ఫ్యాక్టర్‌తో ఎయిరేషియా ఇండియా మూడో స్థానంలో ఉన్నాయి. 
♦ సకాలంలో విమాన నిర్వహణ విషయంలో గో ఎయిర్‌ మొదటి స్థానంలో నిలిచింది. ఈ సంస్థకు చెందిన 87 శాతం విమానాలు టైమ్‌ప్రకారమే నడిచాయి. 86.1 శాతంతో విస్తార, 79.2 శాతంతో ఇండిగో ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. 
♦ విమాన ప్రయాణికుల మార్కెట్‌ వాటాలో ఇండిగో అగ్రస్థానం కొనసాగిస్తోంది. మొత్తం ప్రయాణికుల్లో 43 శాతం మంది ఇండిగో సంస్థ నుంచే ప్రయాణం చేశారు. ఈ విషయంలో ఇండిగో తర్వాతి స్థానాల్లో జెట్‌ ఎయిర్‌వేస్‌ (14.3 శాతం), స్పైస్‌జెట్‌ (12.5 శాతం) నిలిచాయి. 


 



You may be interested

బ్యాంకింగ్ లావాదేవీలపై పాక్షిక ప్రభావం

Saturday 22nd December 2018

న్యూఢిల్లీ: వేతనాల సవరణ డిమాండ్‌తో ప్రభుత్వ రంగ బ్యాంకు అధికారులు నిర్వహించిన ఒక్క రోజు సమ్మెతో శుక్రవారం బ్యాంకింగ్ కార్యకలాపాలపై పాక్షిక ప్రభావం పడింది. దేశవ్యాప్తంగా చాలా చోట్ల శాఖలు మూతబడగా, మరికొన్ని ప్రాంతాల్లో సిబ్బంది లేక ఖాళీగా కనిపించాయి. బ్రాంచీల్లో డిపాజిట్‌, విత్‌డ్రాయల్‌, చెక్కుల క్లియరెన్సులు, డ్రాఫ్ట్‌ల జారీ తదితర లావాదేవీలపై ప్రభావం పడింది. అయితే, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి ప్రైవేట్ బ్యాంకుల కార్యకలాపాలు యథాప్రకారం కొనసాగాయి.

మన మార్కెట్లలోనే అస్థిరతలు తక్కువ

Saturday 22nd December 2018

కోల్‌కతా: అంతర్జాతీయ క్యాపిటల్‌ మార్కెట్లలో ఈ ఏడాది నెలకొన్న అస్థిరతలు మరికొంత కాలం పాటు కొనసాగొచ్చని సెబీ చైర్మన్‌ అజయ్‌ త్యాగి పేర్కొ‍న్నారు. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపు, చమురు ధరల్లో అస్థిరతలు, వాణిజ్య వివాదాలు పెరగడం, ఇరాన్‌పై ఆంక్షలు వంటి అంశాలను అస్థిరతలకు కారణాలుగా త్యాగి ఉదహరించారు. భారత మార్కెట్లు కూడా ఈ అంశాల కారణంగా ప్రభావితం అయ్యాయన్నారు. ఐఐఎం కలకత్తా నిర్వహించిన  భారత 8వ ఆర్థిక సదస్సులో త్యాగి

Most from this category