STOCKS

News


ప్రజా రవాణాను విద్యుత్‌తో నడిపిస్తారా...?

Saturday 8th September 2018
news_main1536381626.png-20087

న్యూఢిల్లీ: ప్రజా రవాణా బస్సులను విద్యుత్‌తో నడిపించేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తే వారికి అన్ని రకాల అనుమతులను పళ్లెంలో పెట్టి అందిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ ప్రకటించారు. ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేందుకు నియంత్రణ పరమైన అవరోధాలను తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అనుమతులు చాలా పెద్ద అవరోధంగా మారి, ప్రాజెక్టుల వ్యయం పెరిగిపోయేందుకు దారితీస్తున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మూవ్‌ సదస్సులో మాట్లాడుతూ... ప్రభుత్వరంగ రవాణా కార్పొరేషన్లు భారీ డిమాండ్‌ను తీర్చలేని పరిస్థితుల్లో లండన్‌ తరహా రవాణా మోడల్‌ను భారత్‌లో సులభంగా అమల్లోకి తీసుకోచ్చని అభిప్రాయపడ్డారు. టాటా మోటార్స్‌, అశోక్‌ లేలాండ్‌ తదితర ఆటోమొబైల్‌ కంపెనీలు లండన్‌ రవాణా నమూనాలో ఆపరేటింగ్‌ కంపెనీని ఏర్పాటు చేసుకోవచ్చని గడ్కరీ సూచించారు.
ఎలక్ట్రిక్‌ హైవేలు
దేశంలో ఎలక్ట్రిక్‌ మార్గాలను ప్రోత్సహించేందుకు తాము ఆసక్తిగా ఉన్నట్టు మంత్రి గడ్కరీ చెప్పారు. ‘‘ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మార్గంలో విద్యుత్‌ కేబుళ్లను ఏర్పాటు చేయగలం. 40 టన్నుల సామర్థ్యం కలిగిన ట్రక్కులు సైతం దానిపై సులభంగా వెళ్లగలవు. ఈ ప్రాజెక్టుకు అనుమతులిచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. ఎవరు ముందుకు వచ్చినా ఆహ్వానిస్తాం’’ అని చెప్పారు. కేబుల్‌ కారు ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ తరహా ప్రాజెక్టులపై రాబడి రేటు లాభదాయకమేనని, పెట్రోల్‌, డీజిల్‌ కంటే విద్యుత్‌ చౌక అని గుర్తు చేశారు. ఆటోమొబైల్‌ కంపెనీలు తమ ఆలోచన తీరును (మైండ్‌ సెట్‌) కొంత మార్చుకుని, భవిష్యత్తు కోసం మరింత ప్రాధాన్యం ఇవ్వాలని మంత్రి నితిన్‌ గడ్కరీ కోరారు. ఇందుకు విధానాల పరంగా ప్రభుత్వం వైపు నుంచి సహకారం ఉంటుందని భరోసా ఇచ్చారు. చుమరు దిగుమతులను తగ్గించడంతోపాటు, కాలుష్యానికి అంతం పలకాలనే విషయంలో ప్రభుత్వ విధానం స్పష్టంగా ఉందన్నారు. అందుకే ప్రత్యామ్నాయ ఇంధనాలైన ఇథనాల్‌, మెథనాల్‌, ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహిస్తున్నట్టు చెప్పారు. 

ఏటా రూ.1.2 లక్షల కోట్లు ఆదా చేయొచ్చు
ఎలక్ట్రిక్‌ వాహనాలపై నీతి ఆయోగ్‌ న్యూఢిల్లీ: విద్యుత్‌ ఆధారిత వాహనాలను ప్రోత్సహించడం ద్వారా చమురు దిగుమతుల ఆదా రూపంలో ఏటా రూ.1.2 లక్షల కోట్ల విదేశీ మారకాన్ని ఆదా చేయవచ్చని నీతి ఆయోగ్‌ పేర్కొంది. ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజన్‌ (ఐసీఈ) వాహనాలను ఎలక్ట్రిక్‌ వాహనాలను మార్చడం ద్వారా భారత్‌ ఎంతో లబ్ధి పొందొచ్చని ప్రభుత్వానికి సూచించింది. మూవ్‌ సదస్సులో ఈ నివేదికను ప్రధాని మోదీకి నీతి ఆయోగ్‌ సమర్పించింది. ‘‘దేశంలో 17 కోట్ల ద్విచక్ర వాహనాలు ఉన్నాయి. ఒక్కో వాహనం రోజూ సగటున అర లీటర్‌ పెట్రోల్‌ ఖర్చు చేస్తుందనుకుంటే... ఏడాదికి అన్ని వాహనాలకు కలిపి 34 బిలియన్‌ లీటర్లు అవసరమవుతుంది. లీటర్‌కు రూ.70 చొప్పున ఏడాదికి ఖర్చు రూ.2.4 లక్షల కోట్లు. ఇందులో సగాన్ని పరిగణనలోకి తీసుకున్నా రూ.1.2 లక్షల కోట్లను ఆదా చేయవచ్చు’’ అని వివరించింది.  You may be interested

జేఎల్‌ఆర్‌ అమ్మకాలు 5 శాతం డౌన్‌

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: టాటా మోటార్స్‌కు చెందిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌(జేఎల్‌ఆర్‌) అంతర్జాతీయ అమ్మకాలు గత నెలలో 5 శాతం తగ్గాయి. గత నెలలో జేఎల్‌ఆర్‌ వాహన విక్రయాలు 5 శాతం క్షీణించి  36,629కు తగ్గాయని జేఎల్‌ఆర్‌ చీఫ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ ఫెలిక్స్‌ వెల్లడించారు. జాగ్వార్‌ బ్రాండ్‌ అమ్మకాలు 8 శాతం వృద్ధితో 11,802కు పెరగ్గా, ల్యాండ్‌ రోవర్‌ బ్రాండ్‌ విక్రయాలు 10 శాతం పతనమై 24,827కు చేరాయని వివరించారు. కీలకమైన మార్కెట్లలో

చిరిగిన నోట్ల మార్పిడీ విధానాల్లో మార్పు!

Saturday 8th September 2018

ముంబై: చిరిగిన నోట్ల మార్పిడీకి సంబంధించి విధి విధానాలను రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం సవరించింది. చిరిగిన లేక పాడైపోయిన 50 రూపాయలు ఆపైన డినామినేషన్స్‌ కరెన్సీ నోట్లకు పూర్తి విలువ పునఃచెల్లింపునకు సంబంధించి ‘‘పాడైపోయిన నోటు కనీసం ఎంత పరిమాణంలో ఉండాలి’’ అనే నిర్దేశాలను మార్చినట్లు  ఆర్‌బీఐ వివరించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది.  పెద్ద నోట్ల అనంతరం రూ.2,000 సహా అంతకన్నా తక్కువ

Most from this category