STOCKS

News


ఐటీలో కొత్తగా 14 లక్షల ఉద్యోగాలు: సిస్కో

Friday 16th November 2018
news_main1542348086.png-22084

ఢిల్లీ: సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐవోటీ), బిగ్‌ డేటా వంటి అత్యాధునిక టెక్నాలజీల కారణంగా భారత్‌లో 2027 నాటికి కొత్తగా 14 లక్షల ఐటీ ఉద్యోగాలు వస్తాయని సిస్కో-ఐడీసీ సంస్థ ఓ నివేదికలో తెలిపింది. ఇదే కాలంలో ప్రపంచ వ్యాప్తంగా 50 లక్షల ఉద్యోగాలు ఏర్పడతాయని పేర్కొంది. 2017 నాటికి భారత్‌లో ఉన్న 91 లక్షల ఐటీ ఉద్యోగాల్లో 59 లక్షల మందిని నూతన తరం టెక్నాలజీ బాధ్యతల్లో నియమించినట్టు తెలిపింది. సోషల్‌ మీడియా అడ్మినిస్ట్రేటర్‌, మెషిన్‌ లర్నింగ్‌ డిజైనర్‌, ఐవోటీ డిజైనర్‌ ఉద్యోగాలకు రానున్న రోజుల్లో మంచి డిమాండ్‌ ఉంటుందని అంచనా వేసింది. 



You may be interested

భారత్‌ రేటింగ్‌ మార్చడం లేదు!

Friday 16th November 2018

న్యూఢిల్లీ: భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించిన రేటింగ్‌ను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు అంతర్జాతీయ రేటింగ్‌ దిగ్గజం- ఫిచ్‌ గురువారం ప్రకటించింది. ప్రస్తుతం భారత్‌కు ఫిచ్‌... స్థిర అవుట్‌లుక్‌తో ‘బీబీబీ-’ సావరిన్‌ రేటింగ్‌ ఉంది. ఇది అతి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌. 12 సంవత్సరాల నుంచీ ఇదే గ్రేడింగ్‌ను భారత్‌కు ఫిచ్‌ కొనసాగిస్తోంది. ప్రస్తుత రేటింగ్‌ను అప్‌గ్రేడ్‌ చేసే పరిస్థితి లేదని ఫిచ్‌ తాజాగా స్పష్టం చేసింది. బలహీన ద్రవ్య పరిస్థితులు ఇందుకు కారణంగా

బీఎండబ్ల్యూ ఎం2 కాంపిటీషన్‌ విడుదల

Friday 16th November 2018

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ ‘ఎం2 కాంపిటిషన్‌’ పేరుతో కొత్త వెర్షన్‌ కారును గురువారం విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్‌ ధర రూ.79.9 లక్షలు. దేశవ్యాప్తంగా అన్ని డీలర్‌షిప్‌ కేంద్రాల్లో ఇది అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. మూడు లీటర్ల పెట్రోల్‌ ఇంజన్‌తో కూడిన ఈ కారు కేవలం 4.2 సెకండ్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని, గరిష్ట వేగం 250 కిలోమీటర్లు అని పేర్కొంది.  ఆన్‌లైన్‌

Most from this category