STOCKS

News


మరింతగా డిజిటల్‌ జోరు

Friday 9th November 2018
news_main1541741032.png-21813

న్యూఢిల్లీ: బ్యాంకింగ్‌ రంగంపై డిజిటల్‌ ప్రభావం మరింత జోరుగా ఉండనున్నది. మొబైల్‌, ఆన్‌లైన్‌ వంటి డిజిటల్‌ చానెళ్ల ద్వారా జోరు మీదున్న బ్యాంకింగ్‌  రంగంపై  2022 నాటికి డిజిటల్‌ పరంగా మరింత జోరు కనిపించనున్నదని ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌, ఎఫ్మాల తాజా నివేదిక పేర్కొంది. ఇన్ఫోసిస్‌ అనుబంధ సం‍స్థ, ఎడ్జ్‌వెర్వ్‌ సిస్టమ్స్‌కు చెందిన ఇన్ఫోసిస్‌ ఫినాకిల్‌, అంతర్జాతీయ స్వచ్ఛంద సం‍స్థ, ఎఫ్మాలు పదవ ‘బ్యాంకింగ్‌ రంగంలో నవకల్పనలు’ పేరిట నివేదికను రూపాందించాయి. ప్రపంచ వ్యాప్తంగా 300కు పైగా బ్యాంక్‌లు పాల్గొన్న సర్వే​ ఆధారింగా రూపొందిన ఈ నివేదిక  ఇంకా ఏం చెప్పిందంటే..., 

♦ ప్రస్తుతమున్న బ్యాంక్‌ల పనిభారంలో 40 శాతం వరకూ 2022 కల్లా పబ్లిక్‌ క్లౌడ్‌కు మారుతుందని సర్వేలో పాల్గొన్న మొత్తం బ్యాంక్‌ల్లో సగం బ్యాంక్‌లు అభిప్రాయపడుతున్నాయి. 
♦ 2022 కల్లా ఖాతాదారుల సేవల విషయంలో కృత్రిమ మేధ పాత్ర చెప్పుకోదగిన స్థాయిలో పెరుగుతుందని 70 శాతం బ్యాంక్‌లు  భావిస్తున్నాయి. 
♦ మెషిన్‌ లర్నింగ్‌, చాట్‌బోట్స్‌, రోబొటిక్‌ ప్రాసెస్‌ ఆటోమేషన్‌(ఆర్‌పీఏ) వంటి ప్రస్తుత టెక్నాలజీల కన్నా భవిష్యత్‌ నవకల్పనలకు ఓపెన్‌ అప్లికేషన్‌ ప్రొగ్రామింగ్‌ ఇంటర్‌ఫేస్‌(ఏపీఐ) ​‍అగ్రశ్రేణి టెక్నాలజీ కానున్నది. 
♦ 2022 కల్లా ఇన్నోవేషన్‌ లీడర్లుగా ఆలీబాబా వంటి డిజిటల్‌ కామర్స్‌ప్లాట్‌ఫార్మ్స్‌ నిలుస్తాయి. 
♦ గతంలో జరిగినట్లుగానే చెల్లింపులు, మొబైల్‌ వాలెట్లు, రుణాలివ్వడం వంటి వంటి అంశాల్లో పెనుమార్పులు రానున్న మూడేళ్లలో కూడా చోటు చేసుకోనున్నాయి. 


 



You may be interested

2019లో పెరగనున్న చమురు డిమాండ్‌

Friday 9th November 2018

న్యూఢిల్లీ: భారత్‌ చమురు డిమాండ్‌ 2019లో మెరుగుపడుతుందని ఫిచ్‌ సొల్యూషన్స్‌ మైక్రో రిసెర్చ్‌ గురువారం విడుదల చేసిన తన తాజా విశ్లేషణా పత్రంలో పేర్కొంది. తగిన ఆర్థిక పరిస్థితులు, కరెన్సీ స్థిరీకరణ, క్రూడ్‌ ధరల స్పీడ్ తగ్గడం దీనికి కారణాలుగా పేర్కొంది.  అంతర్జాతీయంగా తీవ్ర స్థాయిలో కొనసాగిన క్రూడ్‌ ధరలు, డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత వంటి పలు ప్రతికూలతలు 2018లో భారత్‌ చమురు డిమాండ్‌పై ప్రభావం చూపాయని నివేదిక

బ్యాంక్‌లకు భలే అవకాశం

Friday 9th November 2018

ముంబై: నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీ) తాజా సంక్షోభం బ్యాంక్‌లకు మంచి అవకాశంగా మారనున్నట్లు సింగపూర్‌కు చెందిన డీబీఎస్‌ అంచనా వేసింది. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం రుణాల్లో 12-15 శాతం వాటా ఎన్‌బీఎఫ్‌సీలదేనని డీబీఎస్‌ ఆర్థిక వేత్త రాధిక రావు పేర్కొన్నారు. ‘‘ఇప్పుడు ఎన్‌బీఎఫ్‌సీలకు లిక్విడిటీ సమస్యలు తలెత్తడంతో ఈ వాటా రుణాలు బ్యాంక్‌లకు దక్కనున్నాయి. కాకపోతే ఈ రుణ డిమాండ్‌ను తట్టుకునే పరిస్థితుల్లో బ్యాంక్‌లు

Most from this category