STOCKS

News


3.4శాతం ద్రవ్యలోటు కష్టమే..!

Monday 4th February 2019
news_main1549262899.png-24001

-అధికంగా ప్రభుత్వ వ్యయాలు
-అల్పంగా రాబడి వృద్ధి
-ద్రవ్యలోటు లక్ష్యం కష్టమే
-మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ వెల్లడి

న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి ​‍ద్రవ్యలోటును 3.4 శాతానికి పరిమితం చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం సాకారం కావడం కష్టమేనని అంతర్జాతీయ రేటింగ్‌ సంస్థ, మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ తెలిపింది. ప్రభుత్వ వ్యయం అధికంగా ఉండడం, రాబడి వృద్ధి అల్పంగా ఉండనుండటం దీనికి ప్రధాన కారణాలని మూడీస్‌ తెలిపింది.
పెరుగుతున్న ప్రభుత్వ రుణ భారం...
ప్రభుత్వ రుణం భారీగా పెరుగుతోందని, ద్రవ్య క్రమశిక్షణ పాటిస్తేనే ఈ రుణ భారం తగ్గుతుందని మూడీస్‌ ఇన్వె‍స్టర్స్‌ సర్వీస్‌ (సావరిన్‌ రిస్క్‌ గ్రూప్‌) ఎమ్‌డీ జీన్‌ ఫాంగ్‌ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వృద్ధి అంచనాలు సమంజసంగానే ఉన్నాయని,  అయితే ద్రవ్యలోటు లక్ష్యాలను సాధించడంలో సవాళ్లు కొనసాగుతాయని వివరించారు. ప్రభుత్వ వ్యయాలు పెరుగుతున్నాయని, రాబడి పెరగడం కష్టమవుతుందని వివరించారు. 2020 మార్చితో ముగిసే వచ్చే ఆర్థిక సంవత్సరానికి ద్రవ్యలోటును 3.4 శాతానికి పరిమితం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుందని, ఇది అంచనాల కంటే అధికమని పేర్కొన్నారు. చిన్న రైతులకు నేరుగా నగదు బదిలీ, ఆదాయపు పన్నులో రిబేట్లు ఇవ్వడం వల్ల ఇది పెరిగిందని తెలిపారు. ద్రవ్యలోటు పెరగడం వల్ల భారత్‌ రేటింగ్‌ను తగ్గించబోమని వివరించారు. ప్రస్తుతం భారత్‌కు బీఏఏ2 రేటింగ్‌ను ఇచ్చామని, ఇది స్టేబుల్‌ (నిలకడ)ను సూచిస్తోందని పేర్కొన్నారు. మెరుగుదల, తరుగుదల రిస్క్‌లు సమతూకంగా ఉంటాయని ఈ రేటింగ్‌ సూచిస్తుందని వివరించారు.



You may be interested

ఈ రెండు షేర్లను కొనవచ్చు.

Monday 4th February 2019

హెచ్‌డీఎఫ్‌సీ            కొనొచ్చు బ్రోకరేజ్‌ సంస్థ: మోతిలాల్‌ ఓస్వాల్‌ ప్రస్తుత ధర: రూ.1,961 టార్గెట్‌ ధర: రూ.2,300 ఎందుకంటే:  భారత దేశపు మొదటి హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీగా 1977లో కార్యకలాపాలు ప్రారంభించింది. ప్రస్తుతం భారత్‌లో అతి పెద్ద హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ ఇదే. ఈ ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో ఈ కంపెనీ రిటైల్‌ రుణాలు 18 శాతం, కార్పొరేట్‌ లెండింగ్‌ 8 శాతం చొప్పున వృద్ధి చెందడం వల్ల నిర్వహణ ఆస్తులు

షీలాఫోమ్‌ అమ్మకాల్లో 11 శాతం వృద్ధి

Monday 4th February 2019

హైదరాబాద్‌: స్లీప్‌వెల్‌ బ్రాండ్‌ పేరిట పరుపులను(మ్యాట్రెస్‌) విక్రయించే షీలాఫోమ్‌ లిమిటెడ్‌ డిసెంబర్‌తో ముగిసిన మూడో త్రైమాసికంలో అమ్మకాల పరంగా 11 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇదే కాలంలో పరిశ్రమ వృద్ధి 6 శాతంగా ఉంది. ఫైనాన్షియల్‌ మార్కెట్లో ప్రతికూలతల నడుమ పరిశ్రమకు మించిన వృద్ధిని కంపెనీ సాధించింది. అవ్యవస్థీకృత రంగం నుంచి కొనుగోళ్లు క్రమంగా వ్యవస్థీకృత రంగం వైపు మళ్లుతాయని అంచనా వేస్తోంది. డిసెంబర్‌ నాటికి దేశవ్యాప్తంగా 6,800

Most from this category