STOCKS

News


రక్షణకు రూ.మూడు లక్షల కోట్లు!

Saturday 2nd February 2019
Markets_main1549107771.png-23979

సాక్షి, హైదరాబాద్‌: కేంద్ర బడ్జెట్‌లో రక్షణ రంగానికి ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయల కేటాయింపులతో ఎన్డీయే సర్కారు రికార్డు సృష్టించింది. దేశ సరిహద్దుల రక్షణ అవసరాలకు తగ్గట్లుగా అదనపు నిధులు ఇచ్చేందుకూ సిద్ధమని కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ స్పష్టం చేశారు. పార్లమెంటులో శుక్రవారం తన బడ్జెట్‌ ప్రసంగంలో పీయూష్‌ గోయల్‌.. ‘దేశాన్ని కాపాడుతున్న సైనికులు మాకు గర్వకారణం. అందుకే ఈ ఏడాది వీరికోసం ఇప్పటివరకూ ఎవరూ కేటాయించని స్థాయిలో రూ.3.05 లక్షల కోట్లు కేటాయించాం’ అని తెలిపారు. గత ఏడాది రక్షణ శాఖ బడ్జెట్‌ రూ.2.85 లక్షల కోట్లతో పోలిస్తే ఇది రూ.20 వేల కోట్లు ఎక్కువ. యూపీఏ సర్కారు ఒకే హోదా.. ఒకే పింఛన్‌ కోసం తన మధ్యంతర బడ్జెట్‌లో కేవలం రూ.500 కోట్లు మాత్రమే కేటాయిస్తే తామిప్పటికే రూ.35 వేల కోట్లు పంపిణీ చేశామని పీయూష్‌ అన్నారు. యూపీఏ ఒకేహోదా ఒకే పింఛన్‌ను మూడు బడ్జెట్‌లలో ప్రస్తావించినప్పటికీ అమలు చేసింది మాత్రం తామేనంటూ ఆయన.. ‘మిలటరీ సర్వీస్‌ పే’ లో అన్ని దళాల వారికీ అలవెన్సులను గణనీయంగా పెంచామని వివరించారు. అంతేకాకుండా ప్రమాదకర పరిస్థితుల్లో ఉద్యోగాలు చేస్తున్న నావికా, వాయుసేల సిబ్బందికి ఇచ్చే ప్రత్యేక అలవెన్సులను కూడా ఎక్కువ చేశామని గుర్తు చేశారు.

ప్రభుత్వ రంగంలోకి కృత్రిమ మేథ!
సాక్షి, హైదరాబాద్‌: గ్రామీణ భారతాన్ని డిజిటల్‌ పుంతలు తొక్కించేందుకు ఎన్డీయే సర్కారు తన తుదిబడ్జెట్‌లో గట్టి ప్రయత్నమే మొదలుపెట్టింది. భారత్‌ నెట్‌ పథకం కింద అనుసంధానించే 2.5లక్షల గ్రామ పంచాయతీల్లో కనీసం లక్ష గ్రామాలను డిజిటల్‌ గ్రామాలుగా తీర్చిదిద్దుతామని ఆర్థికశాఖ తాత్కాలిక మంత్రి పీయూష్‌ గోయల్‌ శుక్రవారం నాటి బడ్జెట్‌ ప్రసంగంలో తెలపడమే ఇందుకు తార్కాణం. అంతేకాదు..వేర్వేరు ప్రభుత్వ శాఖల్లోని సమాచారాన్ని విశ్లేషించి వనరులను మరింత సమర్థంగా వినియోగించుకునే లక్ష్యంతో ప్రభుత్వ శాఖల్లోనూ కృత్రిమ మేథను వాడేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు మంత్రి ‍ప్రకటించారు. కృత్రిమ మేథ టెక్నాలజీలు మరింత కచ్చితంగా వాతావరణ అంచనాలు కట్టేందుకు మాత్రమే కాకుండా.. అనేక ఇతర రంగాల్లోనూ ఉపయోగపడతాయని వాహనాల్లో విద్యుత్‌ వ్యవస్థల సమర్థ నిర్వహణ, ఫొటోలు, వీడియోల విశ్లేషణ వంటివి వీటిల్లో ఉన్నాయని గోయల్‌ తన బడ్జెట్‌ ప్రసంగంలో పేర్కొన్నారు.
కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు కేంద్రంగా డిజిటల్‌ గ్రామాలు...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన డిజిటల్‌ గ్రామాల వ్యవస్థ మొత్తం కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు కేంద్రంగా నడుస్తాయి. వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా లక్ష వరకూ గ్రామాల్లో ఈ కామన్‌ సర్వీసెస్‌ సెంటర్ల ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల చెంతకు చేర్చాలన్నది లక్ష్యం. గ్రామాల్లో డిజిటల్‌ టెక్నాలజీకి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుకోవాల్సిన బాధ్యత కూడా ఈ కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లపైనే ఉంచనున్నారు. దేశంలో ఇప్పటికే దాదాపు మూడు లక్షల కామన్‌ సర్వీసెస్‌ సెంటర్లు పనిచేస్తున్నాయనీ, వీటిద్వారా మరిన్ని ఎక్కువ సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వివరించారు. గత ఐదేళ్లలో ఎన్డీయే ప్రభుత్వం అనేక ప్రభుత్వ సర్వీసులను, విధానాలను డిజిటల్‌ రూపంలోకి మార్చేసిందని.. వీటన్నింటి ఆధారంగా 2030 నాటి డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన మౌలిక సదుపాయాలను సిద్ధం చేస్తామని వివరించారు. దేశ యువత సృష్టించే అనేక స్టార్టప్‌ కంపెనీలు సృష్టించే డిజిటల్‌ ఇండియా కారణంగా లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అన్నారు. ఎన్డీయే ప్రభుత్వ హయాంలో మొబైల్‌ డేటా 50 రెట్లు ఎక్కువైందని, ప్రభుత్వం చేపట్టిన అనేక చర్యల ఫలితమిదని మంత్రి వ్యాఖ్యానించారు. డిజిటల్ గ్రామాల వంటి వాటి వల్ల మధ్యవర్తుల ప్రమేయం అస్సలు లేకుండా ప్రభుత్వ పథకాలు నేరుగా లబ్ధిదారులకు అందుతాయని చెప్పారు.
కృత్రిమ మేథతో అనేక లాభాలు...
ప్రభుత్వ ప్రాజెక్టుల్లో కృత్రిమ మేథ వినియోగం సర్వత్రా పెరగనుందని.. ఇందుకు తగ్గట్టుగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం కృత్రిమ మేథ సర్వీసుల కోసం ఓ జాతీయ పోర్టల్‌ను ఏర్పాటు చేస్తుందని కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖల వెబ్‌సైట్లు, సేవలు, కేంద్రాలకు ఈ పోర్టల్‌ ద్వారా సేవలు అందిస్తామని..ఆసక్తికర ప్రైవేట్‌ వ్యాపార సంస్థలు కూడా ఈ పోర్టల్‌ సేవలు వినియోగించుకోవచ్చునని మంత్రి వివరించారు. త్వరలో సిద్ధం కానున్న నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌లో ఈ కృత్రిమ మేథ సర్వీసులు చాలా కీలకం కానున్నాయని మంత్రి చెప్పారు. దేశం ఇప్పటికే స్టార్టప్‌ రంగంలో గణనీయమైన పురోగతి సాధించిందని.. దీంతోపాటు కృత్రిమ మేథ తాలూకూ లాభాలను ప్రజల చెంతకు చేర్చేందుకు జాతీయ స్థాయిలో ఓ విస్తృత స్థాయి కార్యక్రమం చేపట్టాలన్నది ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. నేషనల్‌ సెంటర్‌ ఆఫ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ కేంద్రంగా.. ఇతర అత్యున్నత నైపుణ్య కేంద్రాలు కూడా ఏర్పాటు కావడం ద్వారా ఈ కార్యక్రమానికి ఊపు లభిస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. కృత్రిమ మేథ సర్వీసులను ఉపయోగించుకునేందుకు ఇప్పటికే తొమ్మిది రంగాలను గుర్తించామని మంత్రి అన్నారు.You may be interested

మార్పు కోసం పది లక్ష్యాలు

Saturday 2nd February 2019

జీవన ప్రమాణాలకు నాంది: పీయూష్‌         ప్రగతి పథంలో ముందుకు సాగడమే పది లక్ష్యాల ఉద్దేశం పది లక్ష్యాలతో భారతదేశ దశ దిశలో మార్పుతెస్తామంటూ సార్వత్రిక ఎన్నికలవేళ మోదీ ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్‌తో జనం ముందుకొచ్చింది. మోదీ ప్రభుత్వం పదిలక్ష్యాలను నిర్దేశించింది. బడ్జెట్‌ని ప్రవేశ పెడుతూ ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌ రాబోయే పది ఏళ్లలో 10 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థికవ్యవస్థకి తాత్కాలిక బడ్జెట్‌తో పునాదివేసారు. ఇది తాత్కాలికం మాత్రమే కాదని

నాలుగు నెలలకు రూ.34.17 లక్షల కోట్లు

Saturday 2nd February 2019

ఓటాన్‌ అకౌంట్‌ కోరిన ప్రభుత్వం న్యూఢిల్లీ: వచ్చే ఏప్రిల్‌ నుంచి నూతన ఆర్థిక సంవత్సరం (2019-20)లో మొదటి నాలుగు నెలల కాలానికి గాను (ఏప్రిల్‌ నుంచి జూలై వరకు) రూ.34.17 లక్షల కోట్ల వ్యయాల కోసం కేంద్ర ప్రభుత్వం ఓటాన్‌ అకౌంట్‌ ద్వారా పార్లమెంట్‌ అనుమతి కోరింది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి స్థూల వ్యయాలు రూ.97.43 లక్షల కోట్లుగా మధ్యంతర బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి అంచనాలను పేర్కొన్నారు. మొదటి నాలుగు నెలల

Most from this category